S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/30/2016 - 07:13

గుంటూరు, ఏప్రిల్ 29: సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి తెలుగుదేశం గూటికి చేరారు. శుక్రవారం గుంటూరు టుబా కో మర్చంట్స్ అసోసియేషన్ హాలు లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గాదె వెంకటరెడ్డితో పాటు ఆయన సోదరుడు గాదె వెంకటేశ్వరరెడ్డి, తనయుడు మధుసూదనరెడ్డి మరో 300 మందికి పైగా అనుచరులు, కార్యకర్తలకు పచ్చకండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

04/30/2016 - 07:10

హైదరాబాద్, ఏప్రిల్ 29: నీటిపారుదల ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ తర్వాత తొలిసారి చేపట్టబోతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మే 2న శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన హైడ్రో, ఎలక్ట్రికల్ పనులకు 7,998 కోట్ల నిధులకు పాలనాపరమైన అనుమతులు లభించాయి.

04/30/2016 - 07:09

హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ ఆర్టీసిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు యాజమాన్యం ముందుకు రాకపోవడంతో దశలవారీగా పోరాటాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు టిఎస్‌ఆర్టీసి కార్మిక జెఏసి పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా మే 16లోగా సమస్యలను పరిష్కరించకపోతే జెఏసి సమ్మె నోటీసు ఇచ్చేందుకు నిర్ణయించింది. శుక్రవారం నాడిక్కడ జెఏసి సమావేశం జరిగింది.

04/30/2016 - 07:09

హైదరాబాద్, ఏప్రిల్ 29: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులతో పాటు కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనకు ప్రాణహాని ఉందని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శుక్రవారం హైకోర్టులో జస్టిస్ రాజశేఖర రెడ్డి ముందు పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించేట్లుగా ఆదేశాలు జారీ చేయాలని ఆయన తన పిటిషన్‌లో న్యాయస్థానాన్ని కోరారు.

04/30/2016 - 07:08

హైదరాబాద్, ఏప్రిల్ 29: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పదవ షెడ్యూలులో ఉన్న వివిధ సంస్థలపై ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. సుప్రీంకోర్టులోని సివిల్ అప్పీల్ 3019-3021/2016, ఎస్‌ఎల్‌పి 14705-14706/2016 లలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాష్ టక్కర్ అధ్యక్షతన ఒక కమిటీని శుక్రవారం నియమించింది.

04/30/2016 - 07:07

హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాయలసీమ, తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండలు పెరిగి, వడగాడ్పుల తీవ్రత పెరుగుతూ వచ్చినా, కోస్తాంధ్రలో ఒక మాదిరిగా ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు మార్పు వచ్చింది. కోస్తాంధ్రలో సైతం వడగాడ్పులు సెగ పుట్టిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

04/30/2016 - 07:00

హైదరాబాద్, ఏప్రిల్ 29: గత ఏడాది వర్షాలు సరిగా పడనందున హరిత హారం కార్యక్రమంలో అనుకున్న విధంగా మొక్కలు పెంచలేకపోయినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. ఈసారి వర్షాలు బాగుంటాయని, తెలంగాణ వ్యాప్తంగా హరిత హారం నిర్వహించనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని వివిధ నర్సరీల్లో 46.30 కోట్ల మొక్కలు సిద్ధమవుతున్నాయని తెలిపారు.

04/30/2016 - 06:58

కాకినాడ, ఏప్రిల్ 29: ఎపి ఎంసెట్- 2016 శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా జరిగింది. 94.84 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. కాకినాడ జెఎన్‌టియు ఆధ్వర్యంలో తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఎంసెట్-2016 నిర్వహించారు.

04/30/2016 - 03:16

దాచేపల్లి, ఏప్రిల్ 29: ‘రాష్ట్ర విభజన పేరుతో కాంగ్రెస్ పెద్దలు మనల్ని కట్టుబట్టలతో బయటకు పంపించారు. నిధులు లేవు. రాజధాని లేదు. కొత్తగా వచ్చిన కేంద్ర ప్రభుత్వం అయినా మనల్ని ఆదుకుంటుందని ఆశించాం. కాని కేంద్రం సహకరించటం లేదు.

04/30/2016 - 06:28

గుంటూరు, ఏప్రిల్ 29: కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్రానికి హక్కుపరంగా రావాల్సిన వాటాను ఎన్ని అవరోధాలు ఎదురైనా సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. భూగర్భజలాల పెంపుదల, నీరు-ప్రగతి, పంట- సంజీవని, జలవనరుల సంరక్షణకు సంబంధించిన అంశాలపై శుక్రవారం సీఎం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

Pages