S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/20/2018 - 05:22

అమరావతి, ఆగస్టు 19: రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడనంతో వర్షాలు ముంచెత్తుతున్నాయి. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఒడిశా సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారటంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

08/20/2018 - 06:31

* అద్భుత ఇంజనీరింగ్‌కు తార్కాణం

08/20/2018 - 06:32

ఆసియా క్రీడల్లో తొలిరోజే భారత్ పతకాల ఖాతా తెరిచింది. 65 కేజీ కుస్తీ విభాగంలో స్వర్ణాన్ని సాధించి స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా భారత కేతనాన్ని ఎగరేస్తే, ఎయిర్ ఫిస్టల్ ఫ్రీ స్టయిల్ విభాగంలో అపూర్వి చండేలా, రవికుమార్ ద్వయం కాంస్యాన్ని సాధించి భళా అనిపించుకుంది.

08/20/2018 - 05:08

హైదరాబాద్, ఆగస్టు 19: తెలంగాణ సరిహద్దున చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోల ఏరివేతకు కేంద్రం భారీగా సీఆర్‌పీఎఫ్ బలగాలను పంపనున్న నేపథ్యంలో, అక్కడ మాటువేసిన మావోలు తెలంగాణ మైదాన ప్రాంతల్లోకి వచ్చే అవకాశం ఉందని నిఘా హెచ్చరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనల్లో బలగాలను పెంచాలని సూచించింది. అంతేగాక, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమతమ పర్యటనల సమాచారాన్ని ముందుగానే పోలీసులకు ఇవ్వాలని తెలిపింది.

08/20/2018 - 06:35

హైదరాబాద్, ఆగస్టు 19: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి తెలంగాణ ఆపన్నహస్తం అందించింది. ‘మీకు అండగా మేమున్నాం’ అంటూ పలువురు రాష్ట్ర మంత్రులు, సినీ నటులు, వివిధ పార్టీల నాయకులు, పారిశ్రామికవేత్తలు ‘చేయూత’ నిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కేరళ బాధితులకు సహాయం అందించేందుకు రూ.25 కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

08/20/2018 - 06:36

హైదరాబాద్, ఆగస్టు 19: ‘అసెంబ్లీ రద్దు కాబోతున్నది...ముందస్తు ఎన్నికలు ఖాయం.. సిద్ధంగా ఉండాలి’ అంటూ పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఆదివారం సాయంత్రం సుమారు రెండు గంటల పాటు ఉత్తమ్ అన్ని జిల్లాల పార్టీ శ్రేణులతో ఫెస్ బుక్ లైవ్ ద్వారా మాట్లాడారు. కార్యకర్తలు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

08/20/2018 - 06:38

హైదరాబాద్, ఆగస్టు 19: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. నైరుతీరుతుపవనాలు బలంగా ఉండటం వల్ల ఉత్తర తెలంగాణలో భారీగానూ, దక్షిణ తెలంగాణలో సాధారణంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో మహబూబాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి.

08/20/2018 - 06:40

* ‘ఆంధ్రభూమి’తో కేరళ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కమలవర్ధనరావు

08/19/2018 - 07:10

విజయవాడ (క్రైం): కేరళ రాష్ట్రానికి సహాయక చర్యలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ రంగంలోకి దిగింది. అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ సత్యనారాయణ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ ఎంవి శేషగిరిబాబు నేతృత్వంలో ప్రత్యేక సహాయక బృందాలు శనివారం కేరళకు బయలుదేరాయి. గడిచిన వందేళ్ళలో ఎన్నడూ లేని విధంగా ప్రకృతి విలయతాండవం గత తొమ్మిదిరోజులుగా కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది.

08/19/2018 - 05:40

హైదరాబాద్, ఆగస్టు 18: ఏదో లబ్ధి పోందాలని తాను రాజకీయాల్లోకి రాలేదని, త్రికరణ శుద్ధిగా ప్రజలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అన్నారు. శనివారం నాడు హైదరాబాద్ మాదాపూర్‌లోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకినాడకు చెందిన ముత్తాగోపాలకృష్ణ, ఆయన కుమారుడు ముత్తా శశిధర్‌తో పాటు వారి అనుచరులు 500 మంది జనసేనలో చేరారు.

Pages