S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/21/2018 - 00:21

రాజమహేంద్రవరం, ఆగస్టు 20: ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద సోమవారం ఉదయం నుంచీ వరద నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. గోదావరి నది ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొత్తం 175 గేట్లను ప్రవాహ మట్టానికి మించి ఎత్తి వేసినపుడు 11.75 అడుగులు నమోదైతే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. సోమవారం ఉదయం పదకొండున్నర గంటలకు గోదావరి నది మట్టం 13.75 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

08/20/2018 - 13:56

జంగారెడ్డిగూడెం : పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో సోమవారం యర్రకాలువ జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు యర్రకాలువ జలాశయంలో 4 గేట్లను ఎత్తివేశారు. 27 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు.

08/20/2018 - 13:01

ధవళేశ్వరం: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ బ్యారేజీ నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఈ కారణంగా బ్యారేజీపై కేవలం ద్విచక్రవాహనాలను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. గోదావరి ఉద్ధృతి కారణంగా పడవ ప్రయాణాలను నిషేధించారు.

08/20/2018 - 12:50

ఏలూరు : కుంభవృష్టితో పశ్చిమగోదావరి జిల్లా అతలాకుతలమైంది.ఎగువ ప్రాంతాల నుంచి చేరుతున్న భారీ వరద నీటి కారణంగా సోమవారం తమ్మిలేరు జలాశయంలోని 5 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం తమ్మిలేరు జలాశయ ఇన్‌ఫ్లో 12 వేల క్యూసెక్కులుగా నమోదయ్యింది. భారీగా వరద నీరు చేరడంతో ఇరిగేషన్‌ అధికారులు సోమవారం 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

08/20/2018 - 12:38

హైదరాబాద్: బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో ఆదివారం నగరంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలుండడంతో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని బల్దియా కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు.

08/20/2018 - 05:49

తిరువనంతపురం, ఆగస్టు 19: పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయంటారు. దైవభూమి వరదలతో అతలాకుతలమైంది. కాని పెళ్లి చేసుకోవాలనుకునేవారిని వరుణదేవుడు ఆపలేకపోయారు. వరద బీభత్సంతో కునారిల్లుతున్న మల్లపురం జిల్లాలో ఒక శిబిరంలో ఒక పెళ్లి జరిగింది. నూతన వధూవరులను శిబిరంలోని బాధితులు ఆశీర్వదించారు. అంజూ అనే అమ్మాయికి ఒకవరుడుతో పెళ్లి జరిగింది. శిబిరాన్ని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేశారు.

08/20/2018 - 05:28

అమరావతి, ఆగస్టు 19: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) పార్కులతో అర్హులైన యువతకు దశలవారీగా ఉద్యోగావకాశాలు కల్పించటమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రాంతీయ వృద్ధిలో అసమానతలు లేకుండా చూడాలన్నారు. ఆర్థిక పరివర్తన కోసం ఐటీ, పరిశ్రమలు, పర్యాటకం, తదితర రంగాల్లో ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పించాలని సూచించారు.

08/20/2018 - 05:59

విజయవాడ: రాష్ట్రంలో తిరుమల-తిరుపతి దేవస్థానం తరువాతి స్థానంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. రాష్ట్రంలో అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి, ద్వారకాతిరుమల, సింహాచలం, తదితర పుణ్యక్షేత్రాల్లో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ కొనసాగుతున్న వైదిక కమిటీ ఆలయ వ్యవహారాల్లో చలాయిస్తున్న పెత్తనం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది.

08/20/2018 - 06:28

విశాఖపట్నం, ఆగస్టు 19: ప్రకృతి సౌందర్యాన్ని సంతరించుకోవడంతో పాటు అనేక రకాలుగా ప్రపంచ పర్యాటకుల్ని ఆకట్టుకునే హంగులను సంతరించుకున్న విశాఖను పర్యాటక స్వర్గంగా మార్చే ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి. దేశ విదేశాల నుంచి ఏటా వచ్చే పర్యాటకుల సంఖ్యను మరింతగా పెంచడంతో పాటు మరిన్ని సౌకర్యాలను కల్పించడం ద్వారా వారిని ఆకట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.

08/20/2018 - 06:29

విశాఖపట్నం, ఆగస్టు 19: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం నిలకడగా కొనసాగుతోంది. ఇది మరో 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం వెల్లడించారు. దీని ప్రభావం వలన కోస్తా అంతటా సోమవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.

Pages