S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/18/2018 - 05:53

రాజమహేంద్రవరం: అఖండ గోదారి ఉగ్రరూపం దాల్చింది..వరద తాకిడితో ఉప్పొంగుతోంది.. ఊళ్లను తాకుతూ భయకంపితం చేస్తోంది. పాపికొండలను ఒరుసుకుంటూ కొండవాగుల సరిహద్దులను చెరిపేస్తూ, ఏర్లను, సెలయేర్లను పెనవేసుకుంటూ ఉప నదులతో ఉగ్రరూపం దాల్చింది. ఉపనది శబరి వరదపోటుతో నురగల సుడులు తిరుగుతూ పరీవాహనాన్ని బెంబేలెత్తిస్తోంది. అఖండ గోదావరి నది రాజమహేంద్రవరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక దిశగా ఉరకలు వేస్తోంది.

08/18/2018 - 04:51

విశాఖపట్నం, ఆగస్టు 17: ఇక నుంచి రైతులు తమకు అవసరమైన రుణాల కోసం రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయనక్కర్లేదు. క్షణాల్లో రుణాలే రైతు ఇంటికి వెళ్తాయి. అటువంటి అత్యాధునిక సాంకేతిక విజ్ఞానంతో కూడిన ‘మొబైల్ ఏటీఎం’ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని ప్రతి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)ల ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిఒక్క జిల్లాలోను నిర్వహిస్తారు.

08/18/2018 - 02:06

అనంతపురం, ఆగస్టు 17: అయినవారే చిన్నారుల బతుకులు ఛిద్రం చేస్తున్నారు. వీరి పైశాచికత్వానికి అనె్నంపుణ్యం ఎరుగని తొమ్మిదో తరగతి విద్యార్థిని(14) జీవితం బుగ్గి పాలైంది. మాయమాటలు చెప్పి ఓ చిన్నారిని లోబర్చుకున్న పొరుగింటి యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసి అడ్డుకోవాల్సిన సోదరుడే వావివరసలు మరచి తన పశువాంఛ తీర్చుకున్నాడు.

08/18/2018 - 05:00

హైదరాబాద్, ఆగస్టు 17: కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి వరద నీరు చేరుతుండటంతో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఈ నెల 22 నుంచి నీరు విడుదల చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. భవిష్యత్ మంచినీటి అవసరాలకు నీటిని నిల్వ చేసి, మిగిలిన నీటిని ఎడమ కాలువ ద్వారా నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని ఆయకట్టుకు అందించాలని మంత్రి ఆదేశించారు.

08/18/2018 - 02:04

హైదరాబాద్, ఆగస్టు 17: నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. రుతుపవనాలకు తోడు బంగాళా ఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తోడవడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సాధారణం కంటే 129 శాతం అధిక వర్షపాతం నమోదు అయినట్టు వాతవరణశాఖ తెలిపింది.

08/17/2018 - 21:58

హైదరాబాద్, ఆగస్టు 17: దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల మహిళా దక్షత సమితి రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ సరోజ్ బజాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి దురాగతాలపై తమ సమితి సభ్యులు తీవ్రంగా కలత చెందారని ఆమె శుక్రవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. ఈ సమస్యపై సమావేశంలో చర్చించి కనీసం ఐదుగురు ఆడ పిల్లలకు తగిన సహాయం అందించడంపైనా చర్చించామని అన్నారు.

08/18/2018 - 04:52

హైదరాబాద్: బక్రీదు తర్వాతే తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని బీజేపీకి ఇటీవల రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. తన వల్ల బీజేపీకి నష్టం వాటిల్లరాదన్న భావనతోనే పార్టీకి రాజీనామా చేశానని ఆయన శుక్రవారం ‘ఆంధ్రభూమి ప్రతినిధి’తో మాట్లాడుతూ చెప్పారు.

08/17/2018 - 21:55

హైదరాబాద్, ఆగస్టు 17: ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటికే ఫీజుల భారంతో తలమునకలవుతున్న తల్లిదండ్రులకు పుస్తకాల మోత రోజురోజుకూ ఎక్కువ అవుతోంది. 3వేల రూపాయిలకు దొరికే పుస్తకాలను 20 నుండి 30వేల రూపాయిలకు ప్రైవేటు పాఠశాలలు అమ్ముతున్నాయి. స్కూల్ యూనిఫారం, బెల్టులు, బ్లేజర్‌లకు వేర్వేరు రుసుం వసూలు చేస్తున్న విద్యాసంస్థలు పాఠ్యపుస్తకాలకు అదనపు భారం వేస్తున్నాయి.

08/18/2018 - 05:06

హైదరాబాద్: ప్రాజెక్టుల నిర్మాణంపై నిరాథార ఆరోపణలు చేస్తోన్న కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే ఈ అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలని టీఆర్‌ఎస్ పార్టీ సవాల్ విసిరింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆ పార్టీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క పస లేని ఆరోపణలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ మండిపడింది. తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతమైందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించింది.

08/17/2018 - 22:07

హైదరాబాద్: పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్-కాకినాడల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. 07001/07002 పేరుతో ఈ రెండు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించనుంది. ఈనెల 21, 24 తేదీల్లో హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్ నుంచి రాత్రి 9.05 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:25 నిమిషాలకు కాకినాడ స్టేషన్‌కు చేరకుటుంది.

Pages