S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/21/2018 - 17:37

చిత్తూరు: జిల్లాలోని కుప్పం నియోజకవర్గం పోడూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడుకు వెళుతున్న వ్యాన్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వీరు తమిళనాడుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

08/21/2018 - 14:00

నిర్మల్: తెలంగాణలోని బైంసాలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బాసర వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. బిత్రెల్లి వాగు పొంగి ప్రవహించటంతో వందల ఎకరాల్లోని పంట భూములు నీటమునిగాయి.

08/21/2018 - 13:57

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌లకు చెందిన కోర్టు ధిక్కారణ వ్యాజ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కోమటిరెడ్డి, సంపత్‌లను ఎమ్మెల్యేలుగా కొనసాగించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. రెండు నెలల పాటు ఉత్తర్వులు నిలిపివేయాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది.

08/21/2018 - 12:58

అమలాపురం: గోదావరి ముంపులోనే లంక గ్రామాలు మగ్గుతున్నాయి. గౌతమి, వశిష్ట, వైనతేయ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాజ్‌వేలు మునిగిపోవటంతో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీటమునిగాయి. లంక గ్రామాల్లోని తోటలు నీటమునిగాయి. దీంతో అపారనష్టం సంభవించింది.

08/21/2018 - 04:03

విజయవాడ, ఆగస్టు 20: కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎఫ్‌కు సంబంధించిన సమాచారం అందగానే ముఖ్యమంత్రి యువనేస్తం (నిరుద్యోగ భృతి) వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని, వెంటనే రిజిస్ట్రేషన్లను కూడా చేపడతామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఈ శాఖ అధికారులతో, వివిధ వర్సిటీల ప్రతినిధులతో సోమవారం మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.

08/21/2018 - 03:32

కర్నూలు, ఆగస్టు 20: శ్రీశైలం జలాశయానికి ఎగువ కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి వరద మరింత తగ్గింది. దీంతో జలాశయంలో 200 టీఎంసీల నీరు నిల్వ చేసి మిగిలిన నీటిని వెలుపలికి పంపుతున్నారు. తుంగభద్ర, కృష్ణానదులు ఒకేసారి శాంతించడంతో వరద జలాల చేరిక గణనీయంగా తగ్గింది. నీటిమట్టం 882 అడుగులకు చేరడంతో ఎగువ నుంచి వస్తున్న నీటిని దిగువకు పంపడానికి ఎత్తిన ఐదు గేట్లను దించలేదు.

08/21/2018 - 03:38

విశాఖపట్నం, ఆగస్టు 20: విశాఖలో ఈనెల 23వతేదీన రెండవ జ్ఞానభేరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలియజేశారు. జ్ఞానభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని వర్శిటీల వీసీలతో సోమవారం స్థానిక ఆంద్రా యూనివర్శిటీలో మంత్రి గంటా సమీక్ష నిర్వహించారు.

08/21/2018 - 03:19

ఖమ్మం, ఆగస్టు 20: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారి వ్యవస్థ అతలాకుతలమైంది. అటు గోదావరి నది కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూడు రోజులుగా మొదటి ప్రమాద హెచ్చరిక కంటే అధికంగా ప్రవాహం ఉంది. 10 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. సోమవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద గోదావరం నీటిమట్టం 46 అడుగులుగా ఉంది.

08/21/2018 - 03:10

విశాఖపట్నం, ఆగస్టు 20: వాయువ్య ఒడిశా పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోస్తాలో రాగల 24 గంటల్లో కోస్తా అంతటా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. అల్పపీడనానికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం 7.6 కి.మీ. ఎత్తున ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ రెండింటి ప్రభావంతో కోస్తాలో మంగళవారం ఉదయం వరకూ పలుచోట్ల వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

08/21/2018 - 01:58

హైదరాబాద్, ఆగస్టు 20: భూవనరులపై వివిధ రకాలుగా జరుగుతున్న ఒత్తిడి జల ప్రళయానికి హేతువని ప్రముఖ శాస్తవ్రేత్త, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మాజీ చైర్మన్ కే.కసూర్తిరంగన్ వ్యాఖ్యానించారు. కేరళ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు, వరదల కారణంగా ఎంతోనష్టం జరిగిన నేపథ్యంలో ఆయన పీటీఐ ప్రతినిధితో సోమవారం ఇక్కడ మాట్లాడారు.

Pages