S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/23/2018 - 16:27

విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో అసెంబ్లీ మాజీ స్పీకర్, కాంగ్రెస్ నేత నాదెండ్ల మనోహర్ శనివారం భేటీ అయ్యారు. నాదెండ్ల మనోహార్ ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. 2011 జూన్‌లో నాదెండ్ల ఆంధ్ర ప్రదేశ్ (ఉమ్మడి) స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 వరకు గుంటూరు జిల్లా తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.

06/23/2018 - 15:44

హైదరాబాద్‌ : ఉభయ తెలుగురాష్ట్రాల్లో నేటి నుంచి మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో వాయువ్య బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ఇంకా కొనసాగుతున్నట్లు పేర్కొంది. తెలంగాణలో శని, ఆదివారాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు జల్లులు ,సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవొచ్చు.ఆంధ్రప్రదేశ్‌లో

06/23/2018 - 13:24

హైదరాబాద్ : ఆత్మగౌరవం లేని చోట.. ఉన్న ఒకటే.. లేకున్నా ఒకటే అని, 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించానని, ఒక సైనికుడిగా పని చేసినప్పటికీ.. చాకిరీగా వాడుకుంటున్నారని దానం నాగేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఆయన మొదటి ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో బీసీలను తక్కువ చేస్తున్నారని పేర్కొన్నారు.

06/23/2018 - 13:03

కడప : ఉక్కు పరిశ్రమ సాధన కోసం కడప జడ్పీ కార్యాలయం ఆవరణలో ఎంపీ సీఎం రమేశ్‌ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. దీక్షలో ఉన్న ఎంపీ రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవికి రిమ్స్‌వైద్యులు ఈ ఉదయం పరీక్షలు నిర్వహించారు. వారి షుగర్‌ లెవల్స్‌ తగ్గుతున్నాయని వైద్యులు తెలిపారు. ఇద్దరూ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీక్షా శిబిరంలోనే సీఎం రమేశ్‌ వెంట ఆయన కుటుంబసభ్యులు ఉన్నారు.

06/23/2018 - 04:18

అనంతపురం, జూన్ 22: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం రాజుకుంటూనే ఉంది. ఈ సమస్య కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న అనంతపురం జిల్లా పరిధిలోని మూడు గ్రామాల మీదుగా వెళ్లే సరిహద్దు రేఖకు సంబంధించింది. 1963లో తొలిసారిగా ఈ వివాదం చోటుచేసుకుంది. అక్రమ మైనింగ్ నేపథ్యంలో గత నెలలో రెండు రాష్ట్రాల్లో కొలతలు వేసినా సరిహద్దు వివాదం పరిష్కారం కాలేదు.

06/23/2018 - 04:16

కదిరి, జూన్ 22: అనంతపురం జిల్లా కదిరి సబ్‌రిజిస్ట్రర్ కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. సబ్‌రిజిస్ట్రర్ యస్. నాసీర్, అతని ఇంట్లో, సిబ్బంది, కార్యాలయం నుంచి రూ. 4.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఏసీబీ డీఎస్పీ జయరామ్ రాజు సిబ్బందితో దాడులు జరిపారు.

06/23/2018 - 05:12

హైదరాబాద్, జూన్ 22: నానాటికి విజృంభిస్తున్న కేన్సర్ మహమ్మారిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బసవతారకం కేన్సర్ ఆసుపత్రి 18వ వార్షికోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్య అతిధిగా ఎంపీ కవిత పాల్గొన్నారు.

06/23/2018 - 02:58

అమరావతి, జూన్ 22: ఎర్రచందనం స్మగ్లింగ్‌లో అటవీ అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు హెచ్చరించారు. అటవీ సంపదను సంరక్షించాల్సిన వారే అక్రమాలకు పాల్పడితే ఉదాసీనంగా వ్యవహరించబోమని స్పష్టంచేశారు.

06/23/2018 - 02:55

హైదరాబాద్, జూన్ 22: ఏటా టీచర్లకు జాతీయ అవార్డుల ఎంపికలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో ఈసారి కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక మీదట టీచర్లకు నేరుగా జాతీయ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.

06/23/2018 - 02:38

హైదరాబాద్, జూన్ 22: అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు గమ్య స్ధానాలకు 106 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ద.మ.రైల్వే స్పష్టం చేసింది. నర్సాపూర్-హైదరాబాద్-విజయవాడ మధ్య 10 సర్వీసులను నడుపుతోంది. జూలై 1, 8, 5, 22, 29 తేదీల్లో నర్సాపూర్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు జూలై 2, 9, 16, 23, 30 తేదీల్లో నడుపుతున్నట్లు వెల్లడించింది.

Pages