S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/24/2018 - 06:19

భువనగిరి, జూన్ 23: తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి కుటుంబ ప్రయోజనాలకు వాడుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే.లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని ఆయన టీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు.

06/24/2018 - 06:21

అమరావతి, జూన్ 23: ఎన్నికలు ఏ క్షణాన వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని టీడీపీ అధినేత,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా టీడీపీ నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ‘గ్రూపులు మానుకోండి. సమన్వయంతో పనిచేయండి. మనం తిరిగి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి కొనసాగుతుందనే సంకేతాలను ప్రజలకు వివరించండి’అని ఆయన అన్నారు.

06/24/2018 - 02:51

అమరావతి, జూన్ 23: అలవికాని హామీలు గుప్పిస్తున్న కోతిమూకలు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. తమ వేతనాలు పెంచినందుకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన అంగన్‌వాడీలు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని ప్రజావేదిక ప్రాంగణంలో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు.

06/24/2018 - 02:49

విజయనగరం, జూన్ 23: ‘మేం చెప్పేవి వాస్తవాలు. చంద్రబాబు చెప్పేవి అవాస్తవాలు.మేం మిత్ర ధర్మంతో మాట్లాడుతున్నాం. కేంద్రం మంజూరు చేసే ప్రతి పథకంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోంది’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిని నిరూపించలేకపోతే జైలుకెళ్తానని శనివారం ఇక్కడ సంచలన ప్రకటన చేశారు.

06/24/2018 - 02:48

కొవ్వూరు, జూన్ 23: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు శ్రీకృష్ణ చైతన్య స్నానఘట్టం వద్ద గోదావరి నదిలో శనివారం నాలుగు మృతదేహాలను పట్టణ పోలీసులు కనుగొన్నారు. ఒక మృతదేహం స్నానఘట్టంలో తేలియాడుతుండగా మిగిలిన మూడూ గోదావరి నదిలో లభ్యమయ్యాయి. 35 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు పురుషుల మృతదేహాలు, 24 ఏళ్ల వయసున్న మహిళ, మూడేళ్ల బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

06/24/2018 - 06:29

విజయవాడ, జూన్ 23: కృష్ణా నదిలో పవిత్ర సంగమం వద్ద శనివారం నలుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. కృష్ణా డెల్టాకు సాగునీటి కోసం ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమానికి గత రెండు రోజులుగా గోదావరి జలాలు వస్తున్నాయి. ఈ దృశ్యాలను చూడడానికి వచ్చిన నలుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. సాయంత్రానికి వీరిలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు.

06/24/2018 - 02:43

గుంటూరు, జూన్ 23: సంక్షేమానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమశాఖల మంత్రి నక్కా ఆనందబాబు ఉద్ఘాటించారు. సంక్షేమమంటే తెలియని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి తన మీడియా సంస్థల ద్వారా అసత్య ప్రచారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.

06/24/2018 - 02:42

రాజమహేంద్రవరం, జూన్ 23: బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టుపై కోటి ఆశలు గూడు కట్టుకున్నాయి. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్సు మాదిరిగా ఎడమ కాలువ పనులు మాత్రం పరుగులు పెట్టడం లేదు. ఎడమ ప్రధాన కాలువ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు కంటే ముందే కాలువలు పూర్తయ్యాయని ప్రచారం జరిగినప్పటికీ ఎడమ ప్రధాన కాలువ మాత్రం 60.92 శాతం మాత్రమే పూర్తయింది.

06/24/2018 - 06:27

ఇబ్రహీంపట్నం : ఆంధ్రప్రదేశ్‌లోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద నలుగురు విద్యార్థులు గల్లంతైయ్యారు. విద్యార్థులు కంచికచర్లలో గల మిక్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. గల్లంతైనవారిని ప్రవీణ్(18), చైతన్య(18), శ్రీనాథ్(19), కుమార్(19)గా గుర్తించారు. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

06/23/2018 - 16:24

కొవ్వూరు:పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు లాంచీలరేవు దగ్గర గోదావరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి ప్రాంతానికి చెందిన పొందూరు రవికుమార్(27), పావని(24), పూజిత(3), హారిక(4)గా గుర్తించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Pages