S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/25/2018 - 12:40

మంచాల: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగాల వద్ద సోమవారం తెల్లవారుజామున ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు నలుగురు మహిళలు మృతిచెందారు. చెన్నారెడ్డిగూడకు చెందిన 10 మంది మహిళలు కూరగాయలు మార్కెట్‌కు తరలించే నిమిత్తం ఆటోలో హైదరాబాద్‌ బయలుదేరారు. వారి ఆటో లింగాల వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది.

06/25/2018 - 11:57

హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, విపక్షాల సంగతేమిటని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సవాల్‌ చేశారు.ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌ చేశారు.

06/25/2018 - 01:11

హైదరాబాద్, జూన్ 24: టీఆర్‌ఎస్ సర్కారు మరో తొమ్మిది నెలలే అధికారంలో ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆ తర్వాత తామే అధికారంలోకి వస్తామని, అప్పుడు అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన అగ్రిగోల్డ్ బాధితుల సమావేశానికి ఉత్తమ్‌తోపాటు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరై ప్రసంగించారు.

06/25/2018 - 01:09

హైదరాబాద్, జూన్ 24: ముందస్తు ఎన్నికలకు టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంకేతం ఇచ్చారు. ‘మాకే బాగుంది... మాకే బాగుంది అని అంటున్నారు.. పరిస్థితి ఎవరికి అనుకూలంగా ఉందో ప్రజలే తేలుస్తారు, ముందస్తు ఎన్నికలకు మేము సిద్ధం. మీరూ సిద్ధమేనా’ అని ప్రతిపక్ష కాంగ్రెస్‌కు సీఎం సవాల్ విసిరారు.

06/25/2018 - 04:25

కరీంనగర్, జూన్ 24: బీజేపీ 2019 ఎన్నికలకు సంస్థాగతంగా సిద్ధంగా ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశంలో పూర్తి ప్రణాళికతో ముందుకెళ్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రా ల్లో ఎన్నికల నాటికి ప్రాంతీయ పార్టీలకు దీటుగా బీజేపీని బలోపేతం చేస్తామని తెలిపారు.

06/25/2018 - 01:02

విశాఖపట్నం, జూన్ 24: ఛత్తీస్‌గఢ్ నుంచి తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. దీనికి అనుంబంధంగా వాయువ్య బంగాళాఖాతంలో 4.5 నుంచి 5.8 కిమీ ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాలో చెదురు, మదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

06/25/2018 - 01:01

అనంతపురం సిటీ, జూన్ 24 : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆభరణాలపై టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో పుట్టాను సన్మానించారు.

06/25/2018 - 00:57

కర్నూలు, జూన్ 24: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని సోమయాజులపల్లె వద్ద కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలిలోనే ఏడుగురు మృతిచెందగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు.

06/25/2018 - 00:55

రాజమహేంద్రవరం, జూన్ 24: ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో సొమ్ము కేంద్రానిదైతే సోకు చంద్రబాబునాయుడు చేస్తున్నారని, పోలవరం అక్రమాల పుట్టగా మారిందని నిర్వాసితుల నుంచి తమకు ఫిర్యాదులు వెల్లువలా అందుతున్నాయని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. నిర్వాసితుల నుంచి బీజేపీకి అందుతున్న విజ్ఞప్తుల మేరకు అవసరమైతే నిర్వాసిత గ్రామాల్లో విచారణ జరిపిస్తామన్నారు.

06/25/2018 - 00:52

అమరావతి, జూన్ 24: రాజధాని అమరావతి మెట్రోరైల్ కారిడార్‌కు సంబంధించి మరోవిడత అధ్యయనం జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత విజయవాడ మెట్రో కోసం మూడేళ్ల క్రితం డిజైన్లు కూడా పూర్తయ్యాయి. మొత్తం 26.03 కిలోమీటర్ల మేర రెండుమార్గాల్లో మెట్రోరైల్‌కు ప్రతిపాదనలు, అంచనాలు రూపొందించారు. సుమారు 6,769 వేల కోట్ల రూపాయలకు పైగా ఇందుకు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా వేశారు.

Pages