S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/29/2018 - 03:21

ద్వారకాతిరుమల, ఏప్రిల్ 28: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల చినవెంకన్న బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన తిరు కల్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా లక్షలాది రూపాయలు వెచ్చించి ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలో భారీ వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

04/29/2018 - 03:22

విశాఖపట్నం, ఏప్రిల్ 28: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించే డీఎస్సీ-2018 ద్వారా రాష్టవ్య్రాప్తంగా 10,351 పోస్టులు భర్తీ చేయనున్నట్టు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. విశాఖలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ డీఎస్సీ-2018కి సంబంధించి జూలై 6న నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఆగస్టు 23 నుంచి 30 వరకూ ఆన్‌లైన్ విధానంలో డీఎస్సీ పరీక్షలు జరుగుతాయన్నారు.

04/29/2018 - 03:24

తిరుపతి, ఏప్రిల్ 28: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న సామాన్య భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ వెల్లడించారు. టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్, 12మంది సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.

04/29/2018 - 03:26

వరంగల్/ భద్రాచలం టౌన్, ఏప్రిల్ 28: అడవులు ఎరుపెక్కుతున్నాయి. వరుస ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లుతున్నాయి. మహారాష్టలోని గడ్చిరోలిలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ మరువక ముందే చత్తీస్‌గఢ్‌లో వరుసగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.

04/29/2018 - 01:46

కర్నూలు, ఏప్రిల్ 28: అధిక ధరలతో సామాన్యుడికి భారంగా మారిన పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది సాధ్యం కాకపోతే కేంద్రం వసూలు చేస్తున్న ఎక్సైజు సుంకం, రాష్ట్రాలు విధించిన వ్యాట్‌ను తగ్గించే అవకాశాలను పరిశీలించనున్నట్లు సమాచారం.

04/29/2018 - 01:43

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 28: పోలవరం ప్రాజెక్టు నష్టపరిహారం పంపిణీలో రెవెన్యూ అధికారుల నిర్వాకం కారణంగా బాధితులకు నేటికీ పరిహారం అందని పరిస్థితి చోటు చేసుకుంది. బాధితులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బతికి ఉన్న బాధితులను చనిపోయినట్టు రికార్డు చేసి పరిహారాన్ని గాలికొదిలేస్తున్నారు.

04/28/2018 - 16:21

అమరావతి: దివంగత తెలుగుదేశం ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు భార్య సరస్వతమ్మకు చిత్తూరు ఎమ్మెల్సీ టిక్కెట్ ఖరారైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం చంద్రబాబును గాలి ముద్దు కృష్ణమనాయుడు కుటుంబ సభ్యులు కలుసుకున్నారు.

04/28/2018 - 16:19

హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత విమర్శలు చేయటం తగదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. ఆయన శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ దమ్ముంటే ఓయూలో మీటింగ్ పెట్టాలని, ఓయూలో మీటింగ్ పెట్టలేని కేసీఆర్ దేశాన్ని ఎలా నడుపుతారని ప్రశ్నించారు.

04/28/2018 - 16:18

హైదరాబాద్: నగరం నడిబొడ్డిన రూ.500 కోట్ల విలువైన స్థలంలో 50 నుంచి 60 కోట్ల రూపాయలతో విలాసవంతమైన భవనం అవసరమా అని మాత్రమే తాను ప్రశ్నించానని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ ప్రగతి భవన్‌లో 150 గదులు ఉన్నాయని తాను ఏనాడు అనలేదని అన్నారు. సీఎం కేసీఆర్ ఇతరులను కించపరుస్తూ తన వ్యక్తిత్వాన్ని వెల్లడించుకుంటున్నారని ఉత్తమ్ విమర్శించారు.

04/28/2018 - 16:17

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదలకానునున్నది. దాదాపు 10,351 టీచర్ పోస్టుల భర్తీకి జూలై 5వ తేదీన డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఏపీపీఎస్సీ ద్వారా డిఎస్సీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ డిఎస్సీని ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

Pages