S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/02/2018 - 00:48

హైదరాబాద్, మార్చి 1: తెలంగాణలో పార్టీని బలోపేతంపై పార్టీ నేతలు సమిష్టిగా పనిచేయాలని, పొత్తులు గురించి తర్వాత ఆలోచిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ నేతలను కోరారు. ఇప్పటికే బిజెపి ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించినందు వల్ల పొత్తులపై ఎన్నికల సమయంలో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

03/01/2018 - 17:25

గుంటూరు: గవర్నర్ నరసింహన్ రాజకీయాలు చేస్తున్నారని సినీ హీరో శివాజీ పేర్కొన్నారు. గురువారం గుంటూరులో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి సదస్సు జరిగింది. ఈ సదస్సులో శివాజీ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రత్యేక హోదా లేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరని శివాజీ అన్నారు.

03/01/2018 - 17:56

హైదాబాద్: ఇన్నోవేషన్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆదిభట్లలో ఏర్పాటైన టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ..

03/01/2018 - 17:27

హైదరాబాద్‌: పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని మార్చి 29 వరకు విస్తృతంగా కొనసాగించాలని బాబు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచించారు. రెండోరోజు తెలంగాణ తెదేపా పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో చంద్రబాబు హైదరాబాద్‌లోని తన నివాసంలో సమావేశమయ్యారు. త్వరలోనే ఖమ్మంలో భారీ బహిరంగసభకు తాను హాజరవుతానని బాబు చెప్పారు.

03/01/2018 - 17:26

హైదరాబాద్: కేటీఆర్‌లా దిగజారి మాట్లాడలేనని. గర్వాంధులకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. గురువారం సీఎల్పీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జానాబాబా దొంగలన్న కేటీఆర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, అగ్రనేతలను తిడితే స్థాయి పెరుగుతుందని అనుకుంటున్నారని, తలపై లేవా..? అంటూ ప్రశ్నించారు.

03/01/2018 - 13:05

హైదరాబాద్: తెలంగాణకు చెందిన టీడీపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం సమావేశమయ్యారు. తన నివాసంలో ఆయన సమావేశమ్యారు. ఈ సందర్బంగా తెలంగాణలో పార్టీ బలోపేతం, భవిష్యత్ లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చంద్రబాబు చర్చించినట్లు సమాచారం.

03/01/2018 - 13:01

తిరుమల: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుంతియా అన్నారు. గురువారం ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కోసం చేసిన చట్టాలను ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు.

03/01/2018 - 04:08

హైదరాబాద్, ఫిబ్రవరి 28: ప్రత్యేక హోదా సాధనకు వైకాపా రాజీలేని పోరాటం చేస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరిగా ప్రత్యేక హోదా అని ఒకసారి, ప్యాకేజీ అంటూ మరో సారి మాట మార్చే ప్రసక్తిలేదని వైకాపా ఎంపి డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు అన్నారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలను మాటలతో మభ్యపెడుతూ చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారన్నారు.

03/01/2018 - 02:36

కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 28: అనాదిగా వేళ్ళూనుకున్న బాలకార్మిక వ్యవస్థను సమూలంగా రూపుమాపితేనే దేశం అన్ని రంగాల్లో ముందడుగేస్తుందని బచ్‌పన్ బచావో ఆందోళన్ సంస్థ వ్యవస్థాపకుడు, నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి అన్నారు. బాలలకోసం బంగారు తెలంగాణ అనే నినాదంతో బుధవారం నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన బాలమిత్ర సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

03/01/2018 - 02:33

తిరుపతి, ఫిబ్రవరి 28: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన బుధవారం మలయప్ప స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు కనువిందు చేశారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడవీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు.

Pages