S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/03/2018 - 16:30

వనపర్తి: జిల్లాలోని పెబ్బేరు మండలం గుమ్మడం క్రాస్ రోడ్డు వద్ద బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపైకి లారీ దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా సర్పంచ్ పద్మ తీవ్రంగా గాయపడింది. అటుగా వెళుతున్న కలెక్టర్ శ్వేతామహంతి సర్పంచ్‌ను తన వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

03/03/2018 - 16:40

హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేస్తానని కాంగ్రెస్ ఎంపీ జైపాల్ రెడ్డి స్పష్టంచేశారు. కేసీఆర్‌కు నిజమైన ప్రత్యర్థి కాంగ్రెస్ అని అన్నారు. కేసీఆర్ పచ్చి అవకాశవాది అని అన్నారు. ఎన్నికల తరువాత బిజెపితో కలుస్తారని అన్నారు. మోదీనే కాదు రాహుల్‌ను కూడా కేసీఆర్ ఎకవచనంతో సంబోధిస్తారని విమర్శించారు.

03/03/2018 - 14:08

ఒంగోలు: ఈనెల ఐదవ తేదీ నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాలకు హారవుతామని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఆయన శనివారంనాడు ప్రకాశం జిల్లా తాళ్లూరులో వైసీపీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. రాజ్యసభ సభ్యుల ఎన్నిక జరుగుతున్న సందర్భంగా ఓటు వేసేందుకు వెళతామని వెల్లడించారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ చేస్తున్న ఆందోళనకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు.

03/03/2018 - 13:25

విశాఖపట్నం: ఐదవ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు శనివారంనాడిక్కడ బిజెపి ప్రతినిధుల సమావేశం జరిగింది. జాతీయ నేత సతీష్‌జీ సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏమి చేసింది, ఏమి చేయబోతుందో చెబుతామని ఎంపి హరిబాబు వెల్లడించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు.

03/03/2018 - 13:23

అమరావతి: అసెంబ్లీ సమావేశాలు ఈనెల ఐదు నుంచి నెలాఖరు వరకు జరుగుతాయని స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. ఈ మేరకు సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు ప్రతిపక్షమైన వైసీపీ ముఖ్య నాయకులతో మాట్లాడానని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష సభ్యులు రావాలని, సమస్యల ప్రస్తావనకు, పరిష్కారానికి అసెంబ్లీనే సరైన వేదిక అని వెల్లడించారు.

03/03/2018 - 03:30

తిరుపతి, మార్చి 2: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి జూన్ నెల కోటాలో మొత్తం 56,424 టిక్కెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ విడుదల చేశారు. ఆన్‌లైన్ డిప్ విధానంలో 11,149 సేవా టిక్కెట్లు విడుదల చేసినట్లు ఈ సందర్భంగా ఈఓ తెలిపారు. ఇందులో సుప్రభాతం - 7854, తోమాల-120, అర్చన -120, అష్టదళపాదపద్మారాధన - 180, నిజపాద దర్శనం -2875 టిక్కెట్లు ఉన్నాయని తెలిపారు.

03/03/2018 - 03:20

భద్రాచలం టౌన్, మార్చి 2: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం డోలోత్సవం, వసంతోత్సవం ఆహ్లాదకరంగా నిర్వహించారు. మార్చి 26న భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో నిర్వహించే స్వామివారి కల్యాణానికి అవసరమైన తలంబ్రాల తయారీ ప్రక్రియ సంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆలయంలో తొలుత ఉత్సవమూర్తులకు 25 కలశాలతో, పంచామృతాలతో ప్రత్యేక స్నపనం నిర్వహించారు.

03/03/2018 - 03:31

తిరుపతి, మార్చి 2: వేదం మనస్సుకు అలౌకిక ఆనందాన్ని ఇస్తుందని, స్వామివారి దర్శనానికి ఎంతగా శ్రమిస్తామో, వేదం శ్రవణం చేయడానికి అంతగా శ్రమించాలని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ సూచించారు. ఉజ్జయిని మహర్షి సాందీపని వేదవిద్యాప్రతిష్టాన్, శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో దక్షిణ భారత వేద సమ్మేళనాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు.

03/03/2018 - 02:15

రాజమహేంద్రవరం, మార్చి 2: వేసవి తాపం..గోదావరి నదికి శాపంగా మారింది..జీవనది గోదావరి నదిలో అసలే సహజ నీటి లభ్యత అడుగంటిపోయే స్థితిలో వుంటే..ఉన్న ఆ కొద్దిపాటి జలాలు కూడా అమాంతం పెరిగిన ఉష్ణోగ్రతకు ఆవిరైపోతున్నాయి. దీంతో గత వారం రోజులుగా గోదావరిలో నీటి లభ్యత ఎండమావిగా మారిపోయి, రబీ చేలకు నీరందక రైతన్నలు హాహాకారాలు చేస్తున్నారు.

03/03/2018 - 02:12

అనంతపురం, మార్చి 2: హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత 40 రోజులుగా కొనసాగిస్తున్న ఆందోళనలో భాగంగా అనంతపురంలో న్యాయవాదులు శుక్రవారం జాతీయ రహదారిని దిగ్బంధించారు. న్యాయవాదులకు సంఘీభావం ప్రకటిస్తూ ఆందోళనలో బీజేపీ, సీపీఐ, సీపీఎం, విద్యార్థిసంఘాలు ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎస్‌ఐ, రాయలసీమ విద్యార్థి వేదిక నాయకులు కూడా పాల్గొన్నారు.

Pages