S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/27/2018 - 17:00

హైదరాబాద్ : ప్రధాని మోదీ దిశానిర్దేశంతో టెక్నాలజీని భారీగా వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఈ-గవర్నెన్స్ ద్వారా సేవలను సులభతరంగా అందించగలుగుతున్నట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. హెచ్‌ఐసీసీలో జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు ముగింపు కార్యక్రమానికి కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సదస్సులో ప్రతినిధులు దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న వినూత్న విధానాలపై చర్చించారు.

02/27/2018 - 16:42

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ కాశ్మీరం అని, ఈ జిల్లా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి..

02/27/2018 - 13:02

హైదరాబాద్: ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడానికి టెక్నాలజీని వాడుతున్నం. గత నాలుగేళ్లుగా ఎలాంటి మేజర్ క్రైం లేకుండా ప్రశాంతంగా ఉందని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. హెచ్‌ఐసీసీలో రెండో రోజు జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు లో ఈ గవర్నెన్స్-బెస్ట్ ప్రాక్టీసెస్ అనే అంశంపై డీజీపీ మాట్లాడుతూ... రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటానికి టెక్నాలజీని ఉపయోగిస్తుమన్నారు.

02/27/2018 - 11:59

పెద్దపల్లి: అంతర్గాం మండలం మూర్మూర్‌లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. మూర్మూర్ ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుతో 22 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. పాలకూర్తి, అంతర్గాం మండలాల్లోని 20 గ్రామాలు లబ్ధి పొందనున్నాయి. మిషన్ భగీరథ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సీఎం పరిశీలించారు.

02/27/2018 - 11:43

హైదరాబాద్‌: హోలీ, శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్‌ పాతబస్తీలోని పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి ఇంటింటినీ తనిఖీ చేశారు. సంతోష్ నగర్, లాల్ దర్వాజ, మొగల్ పురా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు అనుమానితులను ప్రశ్నించారు. గుర్తింపు పత్రాలు సమర్పించని 56మందిని అదుపులోకి తీసుకున్నారు.

02/27/2018 - 04:42

అనంతపురం, ఫిబ్రవరి 26: హైకోర్టు రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగిస్తున్న ఆందోళనలో భాగంగా సోమవారం అనంతపురంలో న్యాయవాదులు కదం తొక్కారు. హైకోర్టు సాధన సమితి-న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో ఉదయం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణ నుంచి న్యాయవాదులు ర్యాలీ చేపట్టారు. స్థానిక టూటౌన్ పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు.

02/27/2018 - 04:23

హైదరాబాద్, ఫిబ్రవరి 26: భారతీయ రైల్వే నాలుగేళ్ల తర్వాత ప్రకటించిన మెగా రిక్రూట్‌మెంట్‌లో అభ్యర్థుల సౌకర్యార్థం దరఖాస్తు విధానాన్ని కొంత సులభతరం చేసినట్లు రైల్వే ప్రకటించింది. గ్రూప్-సి, లెవెల్ 1, 2 కేటగిరీల్లో 89,409 ఖాళీల భర్తీకి మెగా నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 3న ప్రకటించింది. నాలుగేళ్ల తర్వాత జరిగే ఈ భారీ రిక్రూట్‌మెంట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు ప్రకటించింది.

02/27/2018 - 04:13

అమరావతి, ఫిబ్రవరి 26: నాయకుడంటే.. స్థితప్రజ్ఞత-ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించేవాడు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినవాడు. జయాపజయాలతో నిమిత్తం లేకుండా వ్యవస్థను నడిపించేవాడు. తనతో ఉన్న వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునేవాడు. వీటన్నింటికీ మించి జనాలకు, సహచరులకు, అనుచరులకు భరోసా ఇచ్చేవాడు. ఇన్ని లక్షణాలున్న వారే జననేతగా సుస్థిరకాలం మనగలుగుతారు.

02/27/2018 - 03:57

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో చివరి రోజైన సోమవారం ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రత్యేక ప్లీనరీ సెషన్ నిర్వహించారు. నేటి సమాజంలో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లను ఎదుర్కొనేందుకు పరిష్కార మార్గాల గురించి రవిశంకర్, చంద్రబాబు సెషన్ నిర్వాహకుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

02/27/2018 - 02:57

ధర్మపురి, ఫిబ్రవరి 26: దక్షిణకాశీగా, హరిహరక్షేత్రంగా, నవనారసింహ క్షేత్రాలలో నొకటిగా పేరెన్నికగన్న ధర్మపురి క్షేత్రంలో 13రోజులపాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవ వేడుకలు సోమవారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. క్షేత్రంలోని ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మీనరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల దేవాలయాలలో ప్రారంభం రోజు ఫాల్గుణ శుద్ధ ఏకాదశి పర్వదినాన ప్రత్యేక పూజలు చేశారు.

Pages