S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/13/2019 - 01:09

హైదరాబాద్: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 20న హైదరాబాద్ రానున్నారు. దక్షిణాది విడిదిలో భాగంగా ఆయన వస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈనెల 28 వరకు రాష్టప్రతి హైదరాబాద్‌లో ఉంటారు. సికిందరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన బస చేస్తారు.

12/12/2019 - 13:20

హైదరాబాద్: తెలంగాణలో మద్యనిషేధాన్ని అమలుచేయాలని కోరుతూ బీజేపీ నేత, మాజీమంత్రి డీకే.అరుణ ఇందిరా పార్క్ వద్ద ‘మహిళా సంకల్ప దీక్ష’ పేరుతో దీక్ష చేపట్టారు. అరుణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షకు మహిళా మోర్చా, బీజేపీ నేతలు లక్ష్మణ్, రామచంద్రరావు, ఇతర బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళలు, విద్యార్థినులు భారీగా హాజరయ్యారు.

,
12/12/2019 - 02:14

గోదావరిఖని: ‘ఆడ పిల్లలు మనో ధైర్యాన్ని కోల్పోవద్దు... విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోండి... ఆత్మరక్షణకు ఉపయోగపడే యుద్ధ కళ శిక్షణతో ఆడ పిల్లలు అపర కాళికలుగా మారండి’ అని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పిలుపునిచ్చారు.

12/12/2019 - 05:16

ఆదిలాబాద్: ‘దిశ’ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కుదిపేయగా ఇదే తరహాలో గతనెల 24న ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లా లింగాపూర్ అటవీ ప్రాంతంలో సమతపై సామూహిక అత్యాచారానికి పాల్పడి కిరాతకంగా హతమార్చిన ఘటన ప్రభుత్వ యంత్రాంగంలో అలజడి రేపుతోంది.

12/12/2019 - 01:58

సిరిసిల్ల, డిసెంబర్ 11: కాళేశ్వరం జలాలతో సిరిసిల్ల పట్టణం జలకళను సంతరించుకుంది. మధ్య మానేరు నుంచి సిరిసిల్ల మానేరు వాగులోకి బ్యాక్ వాటర్ చేరడంతో వాగుకు జల కళ వచ్చింది. ఈ శుభతరుణంలో మంత్రి కె.తారకరామారావు ట్వీటర్ ద్వారా స్పందించారు. గోదారమ్మ పరవళ్ళతో రైతుల కళ్ళలో సంతోషం నిండిందని ఆనందం వ్యక్తం చేశారు.

12/12/2019 - 01:55

ధర్మారం, డిసెంబర్ 11: రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం నిర్మించిన అద్భుతమైన సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరమని రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ ప్రశంసించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామంలోని ప్యాకేజీ-6 కింద నిర్మించిన నంది పంప్ హౌస్‌ను గవర్నర్ దంపతులు బుధవారం పరిశీలించారు.

12/12/2019 - 01:52

వరంగల్,డిసెంబర్ 11: దేశ చరిత్రలోనే కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు పారిశ్రామికంగా అగ్రభాగాన నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొరియా నుండి వచ్చిన యంగ్‌వన్ కంపెనీ చైర్మన్ కియాన్‌సూవ్ బృందంతో కలసి బుధవారం సందర్శించారు.

12/12/2019 - 05:15

సంగారెడ్డి: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాల్లో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం చూపే విధంగా ఎక్స్‌రే తీయించేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూచించారు.

12/12/2019 - 01:45

సంగారెడ్డి, డిసెంబర్ 11: సారవంతమైన భూముల్లో రైతులు సాగు చేసే పంటలకు కావల్సిన నీటిని అందించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వందల సంవత్సరాలు సుస్థిరంగా నిలబడుతుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేసారు.

12/11/2019 - 17:59

గజ్వేల్: సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ములుగులో నిర్మించిన ఫారెస్టు కాలేజీ, పరిశోధనా కేంద్రాన్ని కేసీఆర్ ప్రారంభించారు. కళాశాల ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థులతో సీఎం కాసేపు ముచ్చటించారు.

Pages