S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/17/2019 - 13:29

హైదరాబాద్: సీఎం కేసీఆర్ యాదాద్రికి చేరుకున్నారు. అక్కడ సీఎం కేసీఆర్‌కు మంత్రి జగదీశ్‌ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయం వద్దకు చేరుకున్న కేసీఆర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

12/17/2019 - 04:30

చత్తీస్‌గఢ్ అడవుల్లో రహస్యంగా దహన సంస్కారాలు * అంత్యక్రియల్లో పాల్గొన్న కేంద్ర, రాష్ట్ర కమిటీ నాయకులు
* వందల మంది సాయుధ పహారా మధ్య ఊరేగింపు * పెద్ద ఎత్తున హాజరైన సమీప గ్రామాల ప్రజలు
* ఆదినుంచీ దండకారణ్య ప్రజలతో మమేకం * విద్యార్థి సంఘ నాయకుడి నుంచి కేంద్ర కమిటీ వరకు
* శ్రీనివాస్ ఆశయాన్ని చివరి వరకు కొనసాగిస్తామన్న దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్

12/17/2019 - 04:22

జగిత్యాల, డిసెంబర్ 16: పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం జిల్లాలోని పసుపు రైతులు జగిత్యాల జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీతో వెళ్ళి ప్రజావాణికి చేరుకొని నిరసన వ్యక్తం చేసారు. అనంతరం జగిత్యాల - కరీంనగర్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

12/17/2019 - 04:21

సూర్యాపేట, డిసెంబర్ 16: సూర్యాపేట జిల్లా పరిధిలోని పెన్‌పహాడ్ మండలం అనాజీపురం గ్రామ మూసీవాగులో సోమవారం వింతచేప లభ్యమైంది. గ్రామానికి చెందిన జాలరి మేడిగ లచ్చయ్య ఆదివారం రాత్రి వాగులో వలవేసి సోమవారం ఉదయం వెళ్లి చూడగా మామూలు చేపలతో పాటు రెండు వింత చేపలు వలకు చిక్కాయి. కిలోపైన బరువు ఉన్న ఈ చేపలు పూర్తిగా నల్లరంగులో ఉండి చారికలు ఉన్నాయి.

12/17/2019 - 04:20

తిప్పర్తి, డిసెంబర్ 16: దామరచర్ల యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు న్యాయం జరిగే వరకు కృషి చేస్తానని పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా తిప్పర్తిలో సోమవారం మిర్యాలగూడ నుంచి హైద్రాబాద్ వెళ్తున్న సందర్భంగా ఆగి కార్యకర్తలతో కలిసి కరచలనం చేశారు. మండల సమస్యలపై మాజీ జడ్పీటీసీ తండు సైదులగౌడ్, ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు.

12/17/2019 - 01:41

నల్లగొండ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మంగళవా రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు రానున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం యాదాద్రికి చేరుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి ఆగస్టు 17న యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణ పనులను పరిశీలించి మూడు నెలల్లో పనులు పూర్తిచేయాలని అధికారులకు నిర్ధేశించారు.

12/17/2019 - 01:39

హైదరాబాద్, డిసెంబర్ 16: తెలంగాణలో ఐటీ పరిశ్రమ అభివృద్ధిపై తమకు చాలా సానుకూల అభిప్రాయం ఉందని కెనడా వౌలిక వసతుల శాఖ మంత్రి ప్రసాద్ పండా వెల్లడించారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి తమ పారిశ్రామిక వర్గాలు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆయన చెప్పారు. హైదరాబాద్ వచ్చిన ఆయన సోమవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో సమావేశమయ్యారు.

12/17/2019 - 05:06

హైదరాబాద్: కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై బదిలీ వేటు పడింది. గద్వాల-జోగులాంబ జిల్లా కలెక్టర్ శశాంక్‌ను కరీంనగర్ కలెక్టర్‌గా నియమించి, సర్ఫరాజ్ ను ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు మరికొందరు ఐఏఎస్ అధికారులు కూడా బది లీ అయ్యారు.

12/16/2019 - 11:28

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దాదాపు అన్ని జిల్లాలో చలి తీవ్రత కొంతమేరకు పెరిగింది. గాలిలో తేమ 83శాతం నమోదు అయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో అత్యల్పంగా 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలుగా నమోదు అయింది.

12/16/2019 - 01:30

నల్లగొండ, డిసెంబర్ 15: వాహనదారులు టోల్‌గేట్ల వద్ద ఆగకుండా నేరుగా వెళ్లేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఫాస్ట్ ట్యాగ్ విధానం ఆదివారం నుంచి అమల్లోకి రావడంతో ఫాస్టాగ్ లేని వాహనదారులు నానాపాట్లు పడ్డారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా విజయవాడ-హైద్రాబాద్ రహదారిపై పంతంగి, కొర్లపహడ్ టోల్‌గేట్లు, వరంగల్-హైద్రాబాద్ జాతీయ రహదారి మీదుగా గూడూరు టోల్‌గేట్‌ల వద్ద నిర్వాహకులు ఫాస్ట్ టాగ్‌ను అమలు చేశారు.

Pages