S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/06/2019 - 17:48

హైదరాబాద్:శంషాబాద్‌లోని నక్షత్ర కాలనీలో దిశ ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. ఎవ్వరినీ ఇంటిలోకి అనుమతించవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే దిశ కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేయవద్దని సీపీ సజ్జనార్ సైతం మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు.

12/06/2019 - 17:48

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్‌హెచ్‌ఆర్సీ తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఎన్‌కౌంటర్‌లో నిజానిజాలు తెలుసుకునేందుకు ఒక బృందాన్ని పంపాలని ఆదేశించింది.

12/06/2019 - 17:47

వరంగల్: దిశ కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చటాన్ని హర్షిస్తూ వరంగల్ వడ్డేపల్లి క్రాస్‌రోడ్ వద్ద ఎస్ ఆర్ కళాశాల విద్యార్థినులు ఏబీవీపీ ఆధ్వర్యంలో స్వీట్లు పంచిపెట్టారు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. పోలీసుల చర్యను సమర్థిస్తూ సీపీ సజ్జనార్ జిందాబాద్ అని నినాదాలు చేశారు.

12/06/2019 - 16:06

హైదరాబాద్: దిశ హత్యోదోంతం నిందితుల ఎన్ కౌంటర్ చేయడంపై ఒకవైపు హర్షాతీరేఖాలు వ్యక్తం అవుతుండగా.. మరోవైపు అదే సందర్భంలో ఈ ఘటనపై నిరసనలు..ఖండించేవారు లేకపోలేదు. విద్యార్థినులు, మహిళలు, తల్లిదండ్రులు పోలీసులను అభినందిస్తూ ప్రకటనలు సైతం చేస్తున్నారు. వారికి జిందాబాద్‌లు కొడుతున్నారు. కొంతమంది ఏకంగా వారిపై పూలజల్లు సైతం కురిపించారు.

12/06/2019 - 13:16

హైదరాబాద్: దిశ నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించటంతో పోలీసులు ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందని సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ దిశ కేసులో నలుగురు నిందితులు మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులును చటాన్ పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకువచ్చి కేసు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా వారు పోలీసులపై రాళ్లతో దాడి చేస్తూ పారిపోయేందుకు యత్నించారని చెప్పారు.

12/06/2019 - 13:15

హైదరాబాద్: ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన దిశ నిందితుల మృతదేహాలకు పోలీసులు పోస్ట్‌మార్టమ్ చేశారు. ఎన్‌కౌంటర్ ప్రాంతంలోనే పోస్ట్‌మార్టమ్‌కు ఏర్పాట్లు చేశారు. గాంధీ ఆస్పత్రి నుంచి వచ్చి డాక్టర్లు నిందితులు ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతదేహాలకు రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీసులు పంచనామా నిర్వహించారు. మృతదేహాలను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తారు.

12/06/2019 - 13:13

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన యువ వైద్యురాలు దిశపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులు పోలీసు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. నలుగురు నిందితులు పారిపోవటానికి ప్రయత్నించగా ఈ రోజు తెల్లవారుజామున వీరు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. దిశను సజీవ దహనం చేసిన చటాన్‌పల్లి ప్రాంతానికి కేవలం 300 మీటర్ల దూరంలో వీరు హతమవ్వటం జరిగింది.

12/05/2019 - 16:44

హైదరాబాద్: ఐఎంఎస్ కేసులో అరెస్టు అయిన డైరెక్టర్ దేవీకారాణి భర్త డాక్టర్ గురుమూర్తిని అరెస్టు చేశారు. వీరికి హైదరాబాద్, తిరుపతి, కడప తదితర ప్రాంతాల్లో వంద కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. దేవీకారాణి అవినీతి అక్రమాల వల్ల సంపాదించిన దానితో భర్త ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

12/05/2019 - 05:17

హైదరాబాద్, డిసెంబర్ 4: స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎల్లవేళలా సామాజిక సేవకు సిద్ధంగా ఉండాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపు ఇచ్చారు. రాజ్‌భవన్‌లో బుధవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ స్టేట్ కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు గవర్నర్ ప్యాట్రన్‌గా, ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.

12/05/2019 - 05:13

హైదరాబాద్, డిసెంబర్ 4: సరళీకరణ విధానాలపై పోరాడకుండా మతోన్మాదానికి అడ్డుకట్టవేయలేమని సీపీఐఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఈ రెండింటికీ లింకుందని ఆయన పేర్కొన్నారు.

Pages