S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/05/2019 - 01:53

హైదరాబాద్: లాభదాయక పోస్టుల నుంచి రాష్టస్థ్రాయి కార్పొరేషన్ పోస్టులకు మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ మేరకు ది తెలంగాణ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్ (సవరణ) ఆర్డినెన్స్-2019ను సవరించింది. ఆర్డినెన్స్ జారీ కావడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది.

12/05/2019 - 01:35

హైదరాబాద్, డిసెంబర్ 4: ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో జరగనున్న భారత్ బచావో సమావేశానికి వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చినట్లు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా చెప్పారు. భారత్ బచావో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై ఆయన టీపీసీసీ సీనియర్ నేతలతో బుధవారం ఇక్కడ గాంధీభవన్‌లో సమీక్షించారు.

12/04/2019 - 16:32

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసు విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు హైకోర్టు ఆమోదం లభించింది. హైకోర్టు ఆమోదం తెలపటంతో ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటైతే రోజూవారీ విచారణ జరిపి నిందితులకు త్వరితగతిన శిక్షలు విధిస్తారు.

12/04/2019 - 13:20

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యోదోంతంపై నిరసన తెలిపేందుకు వచ్చిన భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తిదేశాయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఈరోజు సీఎం ఇంటి ఎదుట నిరసన తెలిపేందుకు రాగా పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. వారు వెనక్కి తగ్గకపోవటంతో పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు.

12/04/2019 - 05:54

సిద్దిపేట, డిసెంబర్ 3 : పదవ తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో నిలువాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వెల్లడించారు. పదవతరగతిలో 10 జీపీఎ సాధించిన విద్యార్థులకు 25వేల రూపాయలు అందచేయనున్నట్లు వెల్లడించారు.

12/04/2019 - 05:51

నాగార్జునసాగర్, డిసెంబర్ 3: నాగార్జునసాగర్ జలాశయం నుండి ఎడమ కాల్వ ద్వారా విడుదల చేస్తున్న నీటిని మంగళవారం సాయంత్రం డ్యాం అధికారులు నిలిపివేశారు. ఎడమ కాల్వ పరిధిలోని పంటలకు వారబందీ పద్ధతిలో ఇప్పటి వరకు 6 విడతలుగా నీటి విడుదల చేశారు. 7వ విడత మరో వారం రోజుల తరువాత విడుదల చేయనున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 590 అడుగులకుగాను 583.20 అడుగులుగా ఉంది.

12/04/2019 - 05:50

నల్లగొండ, డిసెంబర్ 3: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులేస్తుంది. ఇటీవల ఎన్నికల నిర్వాహణపై స్టే ఎత్తివేసిన హైకోర్టు మరోసారి వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని ఇచ్చిన ఆదేశాలను అనుసరించి పురపాలక శాఖ మంగళవారం వార్డుల పునర్విభజన ప్రక్రియ షెడ్యూల్ విడుదల చేసింది.

12/04/2019 - 05:50

వనపర్తి, డిసెంబర్ 3: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు పూర్తి అండగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తున్న చోట దివ్యాంగులు ఉన్నట్టయతే వారికి అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు.

12/04/2019 - 01:34

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె సమయంలో బస్సు చార్జీలు పెంచి అయినా కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలన్న కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం మాట మార్చి చార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకుల రెండు నాలుకల ధోరణికి పరాకాష్టకు ఇదే నిదర్శనమని దుయ్యబట్టారు.

12/04/2019 - 05:04

భువనగిరి: అయ్యప్ప మాల వేసుకో వడంతో ఒక విద్యార్థిని పాఠశాలలోకి అనుమతించని సంఘటన భువనగిరిలో జరిగింది. దీనికి ఆగ్రహించిన అయ్యప్పస్వాములు పాఠశాలవద్ద ధర్నా నిర్వహించడంతో పాటు పాక్షికంగా ఫర్నిచర్ ధ్వసంచేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ. స్థానిక ఇండియా మిషన్ పాఠశాలలో 4వ తరగతి చదువుచున్న ఎం.ప్రణీత్‌రెడ్డి తన తండ్రి శివారెడ్డితో పాటు అయ్యప్పమాల వేసుకున్నాడు.

Pages