S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/16/2019 - 01:22

హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను లాభదాయక పదవులకు నుంచి మినహాయిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడంతో పదవుల పందేరం కోసం పలువురు ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు వచ్చే ఏడాది ఖాళీ కాబోతున్న రాజ్యసభ, ఎమ్మెల్సీల స్థానాల భర్తీలో అవకాశం కోసం శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలైన పలువురు ముఖ్య నేతలు గంపెడాశ పెట్టుకున్నారు.

12/15/2019 - 05:22

హైదరాబాద్, డిసెంబర్ 14: పౌరసత్వచట్ట సవరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఈ చట్టం అమలులో రాష్ట్రాల పాత్ర ఏమీ ఉండదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం ఆయన ఇక్కడ అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తెలంగాణ రాష్ట్ర రెండవ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయ ప్రకటనలు చేశారన్నారు.

12/15/2019 - 05:19

హైదరాబాద్, డిసెంబర్ 14: పౌరసత్వ చట్ట సవరణపై వామపక్షనేతలు భగ్గుమన్నారు. రాష్ట్రంలో పౌరసత్వ చట్టాన్ని అమలుచేయవద్దని సీపీఎం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాయగా, చట్ట సవరణపై దేశవ్యాప్తంగా ఉద్యమం జరగాలని సీపీఎం జాతీయ మాజీ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సూచించారు. చట్ట సవరణపై ఎఐఎస్‌ఎఫ్ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
అమలు చేయవద్దు: తమ్మినేని

12/15/2019 - 04:17

హైదరాబాద్, డిసెంబర్ 14: జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో 25,985 కేసులు పరిష్కారమైనట్టు తెంలగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ జీవీ సుబ్రహ్మణ్యం తెలిపారు.

12/15/2019 - 04:10

హైదరాబాద్, డిసెంబర్ 14: దేశ భద్రతే తక్షణ కర్తవ్యమని ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ చీఫ్ దేవేందర్‌జీ పేర్కొన్నారు. దేశద్రోహులకు , అక్రమ చొరబాటుదారులకు, నరహంతకులకు మద్దతు తెలిపేవారు, విదేశీ నిధులతో బతికేవారు ఈ దేశ సెక్యులరిజం గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. వారంతా దేశ ద్రోహులేనని పేర్కొన్నారు.

12/15/2019 - 04:10

హైదరాబాద్, డిసెంబర్ 14: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారని టీఆర్‌ఎస్ ధ్వజమెత్తింది. శనివారం ఇక్కడ టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు ఎం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ టీ భానుప్రసాదరావు విలేఖర్లతో మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీ నేతలు అసూయతోనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

12/15/2019 - 04:09

హైదరాబాద్, డిసెంబర్ 14: ఆర్మీ జవాన్లకు ఏఓసీ (ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్ సెంటర్ ) కేంద్రంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నిర్వహించే అంతర్గత శిక్షణ కార్యక్రమాలకు సమానత్వపు హోదాను ఇంటర్మీడియట్ బోర్డు కల్పించి, జవాన్లకు ఉన్నత విద్యార్హతలను కల్పిస్తోంది. ఈ మేరకు గతంలో ఏఓసీ, ఇంటర్ బోర్డు అవగాహన ఒప్పందం కుదుర్చుకోగా, శనివారం నాడు ఒక బ్యాచ్‌కు ఇంటర్ బోర్డు గుర్తింపుతో కూడిన ఏఓసీ సర్ట్ఫికేట్లను జారీ చేశారు.

12/15/2019 - 04:05

హైదరాబాద్, డిసెంబర్ 14: వెనుజులా, బెనిన్ నగరాలకు చెందిన 29 మందికి ఆంగ్ల శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని ఇఫ్లూ శనివారం నాడు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి విదేశీ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి సురేష్ కే రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విదేశీ భాషల అధ్యయన ఆవశ్యకతను, ప్రాముఖ్యతను వివరించారు.

12/15/2019 - 04:05

హైదరాబాద్, డిసెంబర్ 14: గ్రామీణ ప్రాంతాలతో పాటు, పట్టణ ప్రాంతాల్లోని పేద పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ‘బాలామృతం’ పేరుతో ఒక పథకాన్ని రూపొందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని సంయుక్తంగా చేపడుతున్నాయి. యూనిసెఫ్ కూడా ఇందులో భాగస్వామ్యం అవుతోంది. సమాజంలో పేద పిల్లలకు అవసరమైన పౌష్టికాహారం ప్రస్తుం అందడం లేదని ఒక పరిశీలనలో తేలింది.

12/15/2019 - 04:04

హైదరాబాద్, డిసెంబర్ 14: తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ విధానాల మూలంగా నేడు యువత వ్యవసాయం చేసేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ‘గ్రామీభాభివృద్ధి-వ్యవసాయ విధానాలు’ అన్న అంశంపై హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రె చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధిసంస్థ (ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ) లో శనివారం ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడారు.

Pages