S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/27/2017 - 23:24

ఖమ్మం, ఆగస్టు 27: ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో లక్షలాది ఎకరాల ఆయకట్టు బీడువారి పోవడంతో సాగునీటి కోసం సోమవారం రైతులు సిపిఎం ఆధ్వర్యంలో నాగార్జునసాగర్‌లో సమరభేరికి సిద్ధమయ్యారు. ఐదేళ్లుగా సాగర్ జలాలు రాకపోవటంతో ఖమ్మం జిల్లాలో 2.5 లక్షల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 3.5 లక్షల ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో మరో లక్ష ఎకరాలు బీళ్లుగా మారాయి. ఏటా ఆకాశం వైపు ఎదురుచూసిన రైతులకు నిరాశే మిగులుతోంది.

08/27/2017 - 23:24

కరీంనగర్, ఆగస్టు 27: అధికారంలోకి వస్తే గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామంటూ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఇచ్చిన హామీ ఇప్పటివరకు కూడా కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ నూతన రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా...ఆ దిశగా అడుగులు పడడంలేదు. రాష్ట్రంలో తెరాస పగ్గాలు చేపట్టిన అప్పటినుంచి గిరిజన తండావాసులు నిరీక్షిస్తున్నారు.

08/27/2017 - 04:30

మద్నూర్, ఆగస్టు 26: నోరులేని మూగజీవాలను ఊపిరాడని లారీలో కుక్కి, వాటిని కబేళా లకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పోలీస్ చెక్ పోస్టు వద్ద శనివారం జరిగింది. పట్టుబడిన 60 పశువుల్లో మూడు మృతి చెందగా మరికొన్ని పశువులు కొనఊపిరితో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి.

08/27/2017 - 04:29

నిజామాబాద్, ఆగస్టు 26: గంజాయి రవాణాకు నిజామాబాద్ జిల్లా అడ్డాగా మారింది. ఓ వైపు పోలీసులు, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులు, మరోవైపు రైల్వే పోలీసుల నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ, గంజాయి రవాణా యథాతథంగా కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర ప్రాంతం నిజామాబాద్‌కు ఆనుకుని ఉండడంతో అనునిత్యం ఇం దూరు మీదుగా క్వింటాళ్లకొద్దీ గంజాయి రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది.

08/27/2017 - 04:27

గోదావరిఖని, ఆగస్టు 26: సింగరేణి బొగ్గు గని కార్మికుల 10వ వేతన ఒప్పందంపై జరుగుతున్న జెబిసిసిఐ చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇప్పటికీ ఆరుసార్లు చర్చలు జరిగిన 60 వేల వరకు కార్మికుల వేతన ఒప్పందంపై స్పష్టత రాకుండా పోయింది. అట్టహాసంగా చర్చలు జరపడం... దాన్ని ఏదో ఒక సాకుతో యాజమాన్యం మెలిక పెట్టడంతో ఒప్పందం వాయిదా పడుతూ వస్తోంది. దీని పర్యవసానంగా సమయం...డబ్బు వృథా అవుతోంది.

08/27/2017 - 04:26

వరంగల్, ఆగస్టు 26: కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో శ్రామికరంగం కుదేలవుతోందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో ఉపాధి అవకాశాలు సన్నగిల్లి నిరుద్యోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసారు.

08/27/2017 - 04:22

కరీంనగర్, ఆగస్టు 26: జిల్లా కేంద్రంలోని పోలీసు కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం ఉదయం జరిగింది. రాంనగర్‌లో నివసిస్తున్న కరీంనగర్ మండలం బావుపేట గ్రామానికి చెందిన దూలం చంద్రయ్య (45) అనే ఏఆర్ కానిస్టేబుల్ తన వద్ద ఉన్న ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

08/27/2017 - 03:57

హైదరాబాద్/ ఖైరతాబాద్, ఆగస్టు 26: దేశంలోనే కాక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ మహాగణనాధునికి గవర్నర్ నర్సింహన్ దంపతులు మొదటి పూజ నిర్వహించారు. గురువారం ఉదయం 10 గంటలకు వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ నర్సింహన్ దంపతులు శ్రీ చంఢీకుమార అనంత మహాగణపతికి ప్రధమ పూజ నిర్వహించారు. అనంతరం నర్సింహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖఃశాంతులతో ఉండాలని గణపతిని పూజించినట్లు తెలిపారు.

08/27/2017 - 03:51

హైదరాబాద్, ఆగస్టు 26: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలో 18ఏళ్ల వయసు నిండిన పేద మహిళలందరికీ చేనేత చీరలను కానుకగా ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్రంలో 1,04,57,610 మందికి రేషన్ షాపుల వారిగా సెప్టెంబర్ 18,19,20 తేదీల్లో చీరల పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. పవర్‌లూమ్, హ్యాండ్లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం చీరలు పంచనున్నట్టు చెప్పారు.

08/27/2017 - 03:22

హైదరాబాద్, ఆగస్టు 26: రాష్ట్ర ప్రభుత్వం ఈ-గవర్నెన్స్, మీ-సేవ, కార్డు, ఆర్టీఏ వంటి సేవలను ఎంతో చక్కగా అమలు చేస్తున్నదని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దియోబకు వివరించారు. నేపాల్ ప్రధాని తన సతీమణి డాక్టర్ అర్జు రాణా దియోబతో పాటు 40 మంది సభ్యుల బృందంతో హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వారికి గవర్నర్ నరసింహన్ శుక్రవారం రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు ఇచ్చారు.

Pages