S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/27/2017 - 03:20

హైదరాబాద్, ఆగస్టు 26: రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు రాజీవ్ స్వగృహ ఇళ్లను అమ్మాలని నిర్ణయించామని గృహనిర్మాణ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో శనివారం ఆయన రాజీవ్ స్వగృహ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్కువ ధరలకే ఫ్లాట్లను విక్రయిస్తున్నామన్నారు.

08/27/2017 - 03:19

హైదరాబాద్, ఆగస్టు 26: ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసుల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఉమ్మడి సర్వీసులను క్రమబద్ధం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినా, రాష్ట్రప్రభుత్వం అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసినా హైకోర్టు తిరిగి యథాతథ స్థితి కొనసాగిస్తూ ఆదేశాలు ఇవ్వడంతో వ్యవహారం మొదటికి వచ్చింది.

08/27/2017 - 03:18

హైదరాబాద్, ఆగస్టు 26: రెండేళ్ల డిఇడి కోర్సులో చేరేందుకు ఈ నెల 31 నుండి డీసెట్ అడ్మిషన్లను నిర్వహించనున్నారు. వెబ్ ఆధారితంగా జరిగే అడ్మిషన్లకు సెప్టెంబర్ 6 వరకూ ఆప్షన్ల నమోదు గడువు ఇచ్చారు. సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 12న జరుగుతుంది. సెప్టెంబర్ 14 వరకూ ఫీజు చెల్లించాలి, సంబంధిత కాలేజీల్లో సెప్టెంబర్ 12 నుండి 15వ తేదీలోగా అభ్యర్ధులు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
దూరవిద్య నాణ్యంగా ఉండాలి

08/27/2017 - 03:17

హైదరాబాద్, ఆగస్టు 26: బోర్‌బావుల విషాద ఘటనల నివారణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. బోర్‌బావుల తవ్వకం, డ్రిల్లింగ్ ఏజన్సీలు ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవడం చట్టబద్ధం చేశామని ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది.

08/27/2017 - 03:17

హైదరాబాద్, ఆగస్టు 26: వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉన్నతస్థాయి అధికారులకు ప్రమోషన్లు లభించాయి. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, సాధారణ పరిపాలనాశాఖ ముఖ్యకార్యదర్శి అదర్‌సిన్హా నేతృత్వంలోని కమిటీ ఈ మేరకు శనివారం నిర్ణయం తీసుకుంది. హైడ్రాలజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వైద్యం ఆరోగ్యం తదితర శాఖల్లోని 46 మందికి ప్రమోషన్లు లభించాయి.

08/27/2017 - 03:16

హైదరాబాద్, ఆగస్టు 26: అయ్యప్ప సొసైటీలోని నారాయణ విద్యా సంస్థ వర్మ-1 క్యాంపస్‌లో లాంగ్‌టెర్మ్ బ్యాచ్‌లో శిక్షణ పొందుతున్న వై అరుణ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. యాజమాన్యం ఈ సమాచారాన్ని గుట్టుగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గద్వాల్ జిల్లా దారూర్ మండలం చంద్రనాయక్ తండాకు చెందిన అరుణ తీవ్రమైన ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని తెలిసింది.

08/27/2017 - 03:15

హైదరాబాద్, ఆగస్టు 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ, ప్రజాభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని ఎంపీ రేణుకా చౌదరి విమర్శించారు. ఆమె నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి)ని సందర్శించింది. కాంగ్రెస్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి, ఎం. కోదండరెడ్డి ప్రభృతులు కూడా ఆమె వెంట ఉన్నారు.

08/27/2017 - 03:14

హైదరాబాద్, ఆగస్టు 26: రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే నీటి పారుదల ప్రాజెక్టులపై తనతో బహిరంగ చర్చకు రావాలని పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు. బహిరంగ చర్చకు సిఎం కెసిఆర్ వస్తారో, భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు వస్తారో లేక ఎవరు వచ్చినా తాను సిద్ధంగా ఉన్నానని పొన్నాల స్పష్టం చేశారు.

08/27/2017 - 03:13

హైదరాబాద్, ఆగస్టు 26: భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు పూర్తయినా ఇంకా స్వాతంత్య్ర ఫలాలు పూర్తిగా అందడం లేదని, ఆ లక్ష్యం పూర్తికాలేదని, దానిని పూర్తి చేసేందుకే నూతన భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రధాని నరేంద్రమోదీ పూనుకున్నారని బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి రామ్‌మాధవ్ పేర్కొన్నారు. ఇంపీరియల్ గార్డెన్స్‌లో జరిగిన సంకల్పసిద్ధి సభలో ఆయన పాల్గొన్నారు.

08/26/2017 - 23:23

హైదరాబాద్, ఆగస్టు 26: కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్రంలో 15 ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయింది. తెలంగాణ, మహారాష్టల్రో ఈ ప్రాజెక్టు కోసం భూ సేకరణ జరుగుతోంది. తెలంగాణలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి కాగా, మహారాష్టల్రో వచ్చేనెల జరుగుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల మద్దతు పలికారని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Pages