S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/08/2017 - 01:31

హైదరాబాద్, ఆగస్టు 7: ఏజెన్సీ ప్రాంతాల్లోని రోడ్లకు 247 కోట్ల రూపాయలు, మైదాన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. గిరిజనాభివృద్ధిపై మంత్రి గిరిజనాభివృద్ధి శాఖ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

08/08/2017 - 01:30

హైదరాబాద్/ వనస్థలిపురం, ఆగస్టు 7: వైద్య వృత్తి చేతిలో ఉందనే అహంకారంతో ఓ వైద్యురాలు కేవలం రూ. 20 వేల రూపాయల కోసం 5 నెలల గర్భిణి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కమలానగర్ అనూష నర్సింగ్‌హోమ్‌లోచోటు చేసుకుంది.

08/08/2017 - 01:29

న్యూఢిల్లీ, ఆగస్టు 7: జీఎస్టీ విషయంలో సిఎం కెసిఆర్ పూటకో మాట మాట్లాడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. జీఎస్టీ అమలువల్ల రాష్ట్రానికి జరిగే నష్టంపై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఒక ప్రకటన చేస్తే, ముఖ్యమంత్రి కెసిఆర్ మరో ప్రకటన చేసి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని అన్నారు.

08/08/2017 - 01:28

హైదరాబాద్, ఆగస్టు 7: రాష్ట్రంలో లక్షా 20వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలను సామాజిక భద్రతకు దూరం చేస్తున్న కాంట్రిబ్యూటరీ పింఛను పథకం రద్దుచేసి పాత పింఛను పథకాన్ని కొనసాగించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 8,9 తేదీల్లో మండల, తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు, ర్యాలీలు నిర్వహించనున్నట్టు కమిటీ నేతలు ఎ నర్సిరెడ్డి, చావా రవి తదితరులు తెలిపారు.

08/08/2017 - 01:28

హైదరాబాద్, ఆగస్టు 7: ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడేందుకు దక్షిణ మధ్య రైల్వే కట్టుబడి ఉందని జనరల్ మేనేజర్ వికె యాదవ్ తెలిపారు. రైల్వేలో పని చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి ఒక మొక్కనాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం నాడిక్కడ నార్త్‌లాలాగూడ రైల్వే కాలనీ, ఆలుగడ్డ బావి ప్రాంతాల్లో ఆయన మొక్కలు నాటారు.

08/08/2017 - 01:27

హైదరాబాద్, ఆగస్టు 7:చేనేతను ప్రోత్సహించేందుకు ఐటి ఉద్యోగులు కూడా వారం రోజుల్లో ఒక రోజు చేనేత ధరించాలని ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు విజ్ఞప్తి చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. వ్యవసాయం తరువాత చేనేత రంగం ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. చేనేత రంగాన్ని, కార్మికులను కాపాడుకునేందుకు చేనేత ఫ్యాషన్‌ను ప్రోత్సహించాలని అన్నారు.

08/07/2017 - 23:08

హైదరాబాద్, ఆగస్టు 7: ప్రైవేటు వైద్యశాలల పనితీరు, వైఖరిపై రాష్ట్ర హైకోర్టు మందలించింది. కేర్ నాంపల్లి వైద్యశాల వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న టి సునీతతో పాటు గ్లోబల్ హాస్పటల్‌లో ఆపరేషన్ తర్వాత నడవలేని పరిస్థితికి చేరుకున్న నిఖిల్‌రెడ్డి తరఫున నరేందర్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ సంఘటనలో కోర్టుకు హాజరైన వారి న్యాయవాదులు ఆస్పత్రుల తీరును దుయ్యబట్టారు.

08/07/2017 - 23:07

హైదరాబాద్, ఆగస్టు 7: డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా తెలంగాణ జెఎసి ఉద్యమించేందుకు సిద్ధమైంది. టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ అధ్వర్యంలో జెఎసి ప్రతినిధులు, కార్యకర్తలు పోరుబాట పట్టనున్నారు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రరిణామాలను ప్రజలను, ముఖ్యంగా యువతను చైతన్యవంతం చేసేందుకు టి.జెఎసి నడుం బిగించింది.

08/07/2017 - 23:06

హైదరాబాద్, ఆగస్టు 7: సినీ పరిశ్రమ సిగ్గుపడాల్సిన విషయం డ్రగ్స్ స్కాండల్ కాదు, ఆడ్రగ్స్ స్కాండల్‌కు సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ ఒక బహిరంగ లేఖతో తెలుగు సినీ పరిశ్రమకు తరవంపులు తెచ్చే విధంగా అనవసర ప్రాధేయ పడిన విధానం అని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ లేఖ రాశారు.

08/07/2017 - 23:06

హైదరాబాద్, ఆగస్టు 7: గత కొంతకాలంగా డ్రగ్స్ మాఫియా హైదరాబాద్ కేంద్రంగా దందా కొనసాగిస్తోంది. ప్రముఖులను, యువకులను, ఐటీ ఉద్యోగులను, విద్యార్థులను టార్గెట్ చేసుకుంటూ వారికి మత్తుమైకాన్ని పెంచి పథకం ప్రకారం లక్షలాది రూపాయలు విలువచేసే డ్రగ్స్‌ను సరఫరా చేస్తోంది. డ్రగ్స్ ఏజెంట్లు, ముఠా సభ్యులపై రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిఆర్‌ఐ అధికారులు నిఘా పటిష్టం చేశారు.

Pages