S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/10/2017 - 22:58

హైదరాబాద్, ఆగస్టు 10: తెలంగాణలో జలవనరుల ప్రాజెక్టులతో రాష్ట్భ్రావృద్ధికి మార్గం మరింత సుగమం అవుతోందని గురువారం నాడిక్కడ ప్రారంభమైన జలవనరుల అంతర్జాతీయ సదస్సులో పరిశోధకులు, విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సదస్సులో పలువురు పరిశోధనా పత్రాలను సమర్పించారు.

08/10/2017 - 22:58

హైదరాబాద్, ఆగస్టు 10: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని 14ప్రదేశాల్లో ఖాళీ స్థలాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ స్థలాలను వాణిజ్య సంస్థలకు ఇచ్చి ఆదాయాన్ని పెంచుకోవాలని ఆర్టీసి యోచిస్తోంది. ప్రైవేట్ ఏజన్సీలు, వాణిజ్య సంస్థల సహాయంతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్సఫర్ (బివోటి) మోడ్ పద్ధతిలో వీటిని లీజుకిస్తారు.

08/10/2017 - 03:02

నిజామాబాద్, ఆగస్టు 9: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పర్యటనకు పోచంపాడ్ అన్ని హంగులను సంతరించుకుని అందంగా ముస్తాబైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకానికి గురువారం ఆయన శంకుస్థాపన చేయనున్నారు. బుధవారం సాయంత్రమే రోడ్డు మార్గం గుండా ఇక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి, పోచంపాడ్‌లోని ఎస్సారెస్పీ గెస్ట్‌హౌస్‌లో బస చేశారు.

08/10/2017 - 03:02

వేములవాడ, ఆగస్టు 9: సిరిసిల్ల రాజన్న జిల్లా నేరెళ్ల ఘటనలో పోలీసులు చేసిన అత్యుత్సాహంతో అపవాదు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఆలస్యంగా స్పందించింది. సంఘటన జరిగిన నెలరోజుల తరువాత బాధితులను విచారించేందుకు కరీంనగర్ రేంజ్ డిఐజి రవి వర్మ బుధవారం వేములవాడకు చేరుకొని బాధితులు చికిత్స పొందుతున్న మనోహర్ ఆసుపత్రికి స్వయంగా వెళ్లి విచారించారు.

08/10/2017 - 03:01

హైదరాబాద్, ఆగస్టు 9: నేరెళ్ల ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మంత్రి కె తారకరామారావు వ్యాఖ్యానించారు. ఈ ఘటన దళితులపై దాడి కాదన్నారు. ఎక్కడైనా మా ప్రజలను మేమే కొట్టామని ఎందుకు చెబుతామని మంత్రి ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం కూడా ప్రజలపై కేసులు పెట్టమని, కొట్టమని చెప్పదన్నారు. కేసులు పెట్టిన విషయం తనకు తెలియదన్నారు. ఈ ఘటనను తన దృష్టికి తీసుకరావడంలో స్థానిక నాయకత్వం విఫలమైందన్నారు.

08/10/2017 - 03:01

హైదరాబాద్, ఆగస్టు 9: రాజకీయాల్లో అడ్డదార్లకు తావు లేదని, నీతి నిజాయితీతో పార్టీ ఇచ్చిన పనిని తాను చేస్తూ ఈ స్థాయికి ఎదిగానని నూతన ఉపరాష్టప్రతిగా ఎన్నికైన ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. తాను ఏ పదవిలో తానున్నా కుటుంబం కోసం దానిని వాడుకోలేదని, అలాగే కుటుంబ సభ్యుల వ్యాపారాల్లో తాను తలదూర్చలేదన్నారు.

08/09/2017 - 03:58

కరీంనగర్, ఆగస్టు 8: సిఎం కెసిఆర్ ఇచ్చి న హామీ మేరకు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ గత మూడు రోజులుగా చేపడుతున్న ఆమరణ దీక్షను మంగళవారం వేకువజామున పోలీసులు భగ్నం చేశారు.

08/09/2017 - 03:51

నిజామాబాద్, ఆగస్టు 8: తెలంగాణ రాష్ట్రంలో కరవు పరిస్థితులను శాశ్వతంగా పారదోలాలన్న సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపడుతోందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

08/09/2017 - 03:51

ఖానాపూర్, ఆగస్టు 8: నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఆర్ అండ్ బి విశ్రాంతి భవనంలో మంగళవారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు రాథోడ్ రమేష్, ఎమ్మెల్యే రేఖానాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కుర్చీ విషయంలో తలెత్తిన సమస్య వారిద్దరి మధ్య వివాదాన్ని సృష్టించింది.

08/09/2017 - 03:48

వేములవాడ, ఆగస్టు 8: సిరిసిల్ల రాజన్న జిల్లా నేరెళ్లలో దళితులపై ఇటీవల జరిగిన ఘటన బాధా కరం, దురదృష్టకరమని, ఈ ఘటనలోని బాధితులను ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని పురపాలక, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయన వేములవాడ పట్టణంలో మనోహర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నే రెళ్ల బాధితులను ఎమ్మెల్యేలు రమేశ్‌బాబు, పుట్ట మధుతో స్వయంగా కలుసుకుని పరామర్శించారు.

Pages