S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/07/2017 - 00:11

హైదరాబాద్, ఆగస్టు 6:జీఎస్టీని ఏకపక్షంగా అమలు చేయకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తామని టిఆర్‌ఎస్ ఎంపిలు వేర్వేరుగా జరిగిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు 18 నుంచి జిఎస్‌టిని 12శాతానికి తగ్గించారని, అయితే దానిని కూడా రాష్ట్రాలు భరించలేవని ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, బాల్క సుమన్ తెలిపారు.

08/07/2017 - 00:11

హైదరాబాద్, ఆగస్టు 6: తెలంగాణ సచివాలయాన్ని బైసన్ పోలో గ్రౌండ్స్‌లో నిర్మించే ప్రతిపాదన ఖరారు కావడంతో ప్రస్తుతం సచివాలయంలో ఉన్న భవనాల్లో నగరానికి చెందిన ప్రభుత్వ శాఖల ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను ప్రభు త్వం పరిశీలిస్తోంది.

08/07/2017 - 00:10

హైదరాబాద్, ఆగస్టు 6: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) తో మొన్నటి వరకు లాభం అని చెప్పి, ఇప్పుడు మాట మార్చి నష్టం, భారం అని చెప్పి మొత్తం తెలంగాణ ప్రజలను గందరగోళంలో పడేశారని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును విమర్శించారు.

08/07/2017 - 00:09

హైదరాబాద్, ఆగస్టు 6: లోక్‌సత్తా పార్టీ తెలంగాణ శాఖ నూతన అధ్యక్షుడిగా నందిపేట రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీనియర్ నాయకుడు నందిపేట రవీందర్‌ను మె జార్టీ జిల్లాల అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

08/07/2017 - 00:08

హైదరాబాద్, ఆగస్టు 6: రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తే సగటున విద్యుత్ డిమాండ్ రోజుకు 11వేల మెగావాట్లకు చేరుతుందని విద్యుత్ శాఖ అంచ నా వేసింది. ఆగస్టు 15న వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌పై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్ని వివరాల తో ప్రకటన చేయనున్నారు. ఈ నేపథ్యం లో నాణ్యమైన విద్యుత్ సరఫరాపై విద్యు త్ యంత్రాంగం అప్రమత్తమైంది.

08/07/2017 - 00:07

హైదరాబాద్, ఆగస్టు 6: తెలంగాణలో తీవ్ర నేరాలు రోజురోజుకూ బయటపడుతున్నాయి. తీవ్ర నేరంగా పరిగణించిన కేసులను నామమాత్రపు దర్యాప్తుతోనే సరిపెడుతున్నారనే విమర్శ సర్వత్రా వినవస్తోంది. కేసుల పునర్విచారణ, రిమాండ్‌లోని నిందితులను కస్టడీలోకి తీసుకుని మళ్లీ విచారించడం వంటి దర్యాప్తులతో నిందితులు సైతం బేజారవుతున్నట్టు తెలుస్తోంది.

08/06/2017 - 01:53

హైదరాబాద్, ఆగస్టు 5: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మేడ్చల్ జిల్లాలోని రెండు గ్రామాల ప్రజలకు హామీ ఇచ్చి 24 గంటలు గడవక ముందే హామీల అమలుకోసం అవసరమైన నిధులు మంజూరయాయి. మేడ్చల్ జిల్లా షామీర్‌పేట మండలంలోని కేశవాపూర్, లక్ష్మాపూర్ గ్రామాల మీదుగా గురువారం ముఖ్యమంత్రి తన ఫాంహౌజ్‌కు వెళ్లారు. అలా వెళుతూ, ఈ రెండు గ్రామాల్లో కొద్దిసేపు ఆగిప్రజలతో మాట్లాడగా, కొన్ని సమస్యలు ముఖ్యమంత్రికి చెప్పబోయారు.

08/06/2017 - 01:53

హైదరాబాద్, ఆగస్టు 5: తపాలశాఖలో పనిచేస్తూ, ఓ జెవెల్లర్స్ కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయలు నష్టం చేకూర్చిన అధికారుల అవినీతి వెలుగులోకి వచ్చింది. హుమాయున్‌నగర్ పోస్టల్ ఉద్యోగులు తపాల శాఖకు రూ.

08/06/2017 - 01:52

హైదరాబాద్, ఆగస్టు 5: ఉప రాష్టప్రతిగా ఎం. వెంకయ్య నాయుడు ఘన విజయం సాధించడంతో శనివారం సాయంత్రం బిజెపి రాష్ర నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఉప రాష్టప్రతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించినట్లు ఢిల్లీ నుంచి ప్రకటన వెలువడడంతోనే నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.

08/05/2017 - 04:03

న్యూఢిల్లీ,ఆగస్టు 4: ‘సిస్టర్స్ ఫర్ చేంజ్’ వెబ్‌సైట్‌ను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పార్లమెంట్‌లోని స్పీకర్ కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించారు. నిజామాబాద్ ఎంపీ కవిత నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం శుక్రవారం రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, బండారు దత్తాత్రేయలను కలిశారు.

Pages