S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/05/2017 - 01:13

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణ ఆర్టీసి రాష్ట్రంలో అన్ని గ్రామాలకు రవాణా సేవలు అందించేందుకు ఎకాఎకిన 1,156 బస్సులను కొనుగోలు చేసింది. ఇందులో భాగంగా 600 కొత్త బస్సులను బస్సు తయారీ సంస్థలు సిద్ధం చేశాయి. మిగిలిన బస్సులు వచ్చే మే నెలలో ఆర్టీసి సేవలో చేరనున్నాయి. ఈ వివరాలను ఆర్టీసి ఎండి జివి రమణారావు శనివారం తెలిపారు.

03/04/2017 - 04:40

హైదరాబాద్/సంస్థాన్ నారాయణ్‌పూర్, మార్చి 3:రానున్న రోజుల్లో ఆర్టీసీలో అర్హతలను బట్టి మహిళా డ్రైవర్లకు అవకాశం కల్పించనున్నట్టు రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో శుక్రవారం ఢిల్లీ ఆర్టీసిలో డ్రైవర్‌గా పని చేస్తున్న సరిత మంత్రిని కలిసి తనకు టిఎస్ ఆర్టీసీలో డ్రైవర్‌గా పని చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

03/04/2017 - 04:38

నిజామాబాద్, మార్చి 3: నిజాంసాగర్ జలాశయాన్ని నమ్ముకుని ప్రస్తుత యాసంగిలో వరి పంట సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంలా తయారైంది. సమృద్ధిగా సాగునీరు అందుబాటులో ఉందనే గట్టి నమ్మకంతో అప్పులు చేసి పంటలు వేసుకున్న రైతులకు నిరాశే ఎదురైంది. వేసవి ఆరంభంలోనే వరి చేలు ఎండుముఖం పడుతూ, పచ్చదనంతో కళకళలాడాల్సిన పంట భూములు క్రమేణా బీటలు వారుతున్నాయి.

03/04/2017 - 04:38

హైదరాబాద్, మార్చి 3: కేరళలో కమ్యూనిస్టుల ప్రేరేపిత తీవ్రవాదం రోజురోజుకూ పెరిగిపోతోందని మాజీ డిజిపి దినేష్‌రెడ్డి ఆరోపించారు. అమరుల స్మారక పరిశోధన సంస్థ (ఎంఎంఆర్‌ఐ) ఆధ్వర్యంలో జాగృత భారత్, సిటిజన్స్ ఫోరం సంయుక్తంగా శుక్రవారం నాడు మహాధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నాలో కేరళలో హత్యలకు గురైన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

03/04/2017 - 04:37

బాసర, మార్చి 3: బాసర ట్రిపుల్ ఐటి యూనివర్సిటీలో శుక్రవారం మరో విద్యార్థిని నేలరాలింది. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ 4వ సంవత్సరం విద్యనభ్యసిస్తున్న నల్గొండ జిల్లా నిదమనేరు మండ లం మర్లగడ్డ క్యాంపునకు చెందిన కె.రాధ (21) తన వసతి గృహంలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి కళాశాల వైస్ చాన్స్‌లర్ సత్యనారాయణ, అధ్యాపకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

03/04/2017 - 04:35

వరంగల్, మార్చి 3: క్రీడలలో విజయం సాధించాలి, పతకాలు సాధించాలనే లక్ష్యంతో క్రీడాకారులు పోటీలలో పాల్గొనాలని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ అనురాగ్‌శర్మ సూచించారు. ఒకసారి పాల్గొన్న పోటీలలో విజయం సాధించకున్నా తదుపరి పోటలలో విజేత కావాలనే పట్టుదల క్రీడాకారులలో పెరగాలని ఆయన అన్నారు.

03/04/2017 - 04:34

సంగారెడ్డి, మార్చి 3: విద్యా, ఆర్థిక, సామాజిక రంగాల్లో వెనుకబడిన ముస్లింల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలని, ముస్లిం మైనార్టీల స్థితిగతులపై సుధీర్ కమిటి ఇచ్చిన నివేధికను తక్షణమే అమ లు చేయాలని టి-జెఎసి చైర్మన్ కోదండ రాం డిమాండ్ చేసారు.

03/04/2017 - 04:06

గజ్వేల్, మార్చి 3: గజ్వేల్‌ను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నామని, రోల్ మోడల్‌గా తయారు చేయడమే తన సంకల్పమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు.

03/04/2017 - 04:03

హైదరాబాద్, మార్చి 3: ఈ నెల 10 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి ఈ నెల 13న బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. బడ్జెట్ సమావేశాలు దాదాపు 18 రోజుల పాటు కొనసాగుతాయని కూడా మంత్రి తెలిపారు.

03/04/2017 - 04:02

హైదరాబాద్, మార్చి 3: స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో చిన్న రాష్ట్రాలే అభివృద్ధిలో ముందున్నాయని, గుజరాత్, చత్తీస్‌గఢ్, హర్యానా, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సత్యాన్ని చూడలేని చంద్రబాబు అంధుడని మండిపడ్డారు.

Pages