S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/03/2017 - 02:20

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక బృహత్ ప్రణాళికను కేంద్రం ముందు ఉంచింది. 1500 కిలోమీటర్ల పొడవున్న మొత్తం 15 రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

03/03/2017 - 02:19

హైదరాబాద్, మార్చి 2: యువతే మన దేశానికి ఎనలేని సంపద అని, మరే దేశానికీ లేనంత భారీ సంఖ్యలో యువతీ యువకులు మన దేశంలో ఉన్నారని మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో జెడ్ ఎఫ్ టెక్నాలజీ సంస్థను ఆయన గురువారం ప్రారంభించారు. ఇది దేశంలోనే ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ సేవలు అందించే తొలి సంస్థ కావడం విశేషం.

03/03/2017 - 02:17

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణ ‘ఆయుష్’ (్భరతీయ వైద్య విధానాల డైరెక్టరేట్/కమిషనరేట్) కమిషనర్ పోస్టును డైరెక్టర్ గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా ఆయుష్ కమిషనర్‌గా ఐఎఎస్ అధికారిని నియమిస్తూ ఉంటారు. సమైక్య రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుండి ఐఎఎస్ అధికారినే కమిషనర్‌గా నియమిస్తున్నారు. మొట్టమొదటి సారి ఆయుష్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎ.

03/03/2017 - 02:16

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణ రాష్ట్రంలో గ్రంథాలయాలను విజ్ఞాన కేంద్రాలుగా రూపొందిస్తామని గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ తెలిపారు. పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ గురువారం నాడు ఆంధ్రభూమి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ, ఇప్పటి వరకు ఏవో కొన్ని పత్రికలు, పుస్తకాలకు కేంద్రాలుగానే గ్రంథాలయాలను పరిగణిస్తూ వస్తున్నారన్నారు.

03/03/2017 - 02:14

హైదరాబాద్, మార్చి 2: నియోజకవర్గం అభివృద్ధి నిధులకు మోక్షం లభించింది. తెలంగాణ ఆవిర్భావం తరువాత నియోజకవర్గ అభివృద్ధి నిధుల పథకం పునరుద్ధరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఒక్కో నియోజకవర్గానికి కోటి 50 లక్షల రూపాయల చొప్పున నిధులు విడుదల చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమానంగా కోటి 50 లక్షల రూపాయలు నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించారు.

03/03/2017 - 02:14

హైదరాబాద్, మార్చి 2: కేంద్రంలోని మోదీ సర్కార్ వ్యవహార శైలితో లౌకిక వ్యవస్థకు తీవ్ర ప్రమాదం వాటిల్లిందని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. లౌకిక వ్యవస్థ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజాసంఘాలు పోరాడాలని పిలుపునిచ్చారు. గురువారం నాడిక్కడ మగ్ధుం భవన్‌లో జరిగిన వివిధ రాష్ట్ర స్థాయి ప్రజా సంఘాల నాయకుల సమావేశంలో సుధాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

03/02/2017 - 08:17

హైదరాబాద్, మార్చి 1: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షల తొలి రోజే బుధవారం విద్యార్థులు అనేక అగచాట్లు పడ్డారు. తొలి రోజు సెకండ్ లాంగ్వేజి పేపర్-1 నిర్వహించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంటర్మీడియట్ బోర్డు ఉపయోగించి విద్యార్ధుల సెంటర్ లొకేటర్ సదుపాయాన్ని కల్పించినా, పరీక్ష కేంద్రాల్లో సదుపాయాలపై దృష్టి సారించకపోవడంతో చీకటి గదుల్లో కూర్చుని పరీక్ష రాయాల్సి వచ్చింది.

03/02/2017 - 05:23

హైదరాబాద్, మార్చి 1: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవుల నియామకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకేసారి పది కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ బుధవారం సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. నియమితులైన పదిమందిలో ఐదుగురు మైనార్టీలకు అవకాశం కల్పించి ఆయా వర్గాలకు పెద్దపీట వేశారు.

03/02/2017 - 05:22

హైదరాబాద్, మార్చి 1: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం 600 ఎకరాలు గుర్తించినట్టు మున్సిపల్‌శాఖ మంత్రి కె తారకరామారావు తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి నిధుల కొరత లేదని, దీని కోసం హడ్కో నుంచి తీసుకున్న నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు.

03/02/2017 - 05:21

హైదరాబాద్, మార్చి 1: గ్రామీణ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో వివిధ పథకాలలో పని చేస్తున్న ప్రభుత్వ సిబ్బందికి ముఖ్యమంత్రి ప్రకటిస్తున్న వరాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇందిరా క్రాంతి పథకంలో (ఐకెపి) పని చేస్తున్న సహాయకులకు బుధవారం ముఖ్యమంత్రి వరాలు ప్రకటించారు.

Pages