S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/06/2017 - 04:09

నల్లగొండ, జనవరి 5: రాజ్యంగం కల్పిస్తున్న హక్కులకు తూట్లు పొడిచేలా పాలకులు తెచ్చే కొత్త చట్టాలన్నింటికి 123జీవోకు పట్టిన గతే పడుతుందని టి.జెఎసి చైర్మన్ కోదండరాం అన్నారు. గురువారం నల్లగొండ టౌన్ హాల్‌లో కవి, గాయకుడు ఏపూరి సోమన్న సామాజిక తెలంగాణ గుండె చప్పుడు జిల్లా కమిటీ నేతృత్వంలో నిర్వహించిన ఆటపాట మాట సభకు కోదండరాం ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.

01/06/2017 - 04:08

మహబూబాబాద్, జనవరి 5: బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు అనే నినాదం నిజం కాబోతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో బయ్యారంలో ఉక్క్ఫ్యుక్టరీ నిర్మించాలనే డిమాండ్ ఉండేది. నాటి ఉద్యమ నేత కేసీఆర్ ఆ తరువాత ముఖ్యమంత్రి కావడంతో మహబూబాబాద్ (మానుకోట) జిల్లా బయ్యారంలో భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

01/06/2017 - 04:08

హైదరాబాద్, జనవరి 5:కొత్తగా 9041 మంది పోలీసుల నియామకం జరుపుతున్నామని, వీరికి శిక్షణ ఇచ్చి, ఉద్యోగంలో చేరిన తరువాత దశల వారీగా ఆంధ్ర పోలీసులను వెనక్కి పంపుతామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు.

01/06/2017 - 04:07

హైదరాబాద్, జనవరి 5: జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్నా భోజన పథకం అమలు చేసే విషయం పరిశీలిస్తున్నట్టు ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం శాసన సభలో ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, బానోతు శంకర్ నాయక్ అడిగిన ప్రశ్నపై మంత్రి ఈ విషయం తెలిపారు. రాష్ట్రంలో 2కోట్ల 73లక్షల, 66వేల, 328 లబ్దిదారులకు సబ్సిడీ బియ్యం అందజేస్తున్నట్టు చెప్పారు.

01/06/2017 - 04:07

హైదరాబాద్, జనవరి 5: నల్లధనాన్ని వెలికితీస్తామని, నకిలీ కరెన్సీకి చెక్ పెడతామంటూ కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేయటం అనాలోచిత నిర్ణయమని, దీంతో మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఈ నిర్ణయంతో ప్రజలు అష్టకష్టాలు పడుతూంటే ప్రధానికి ముఖ్యమంత్రి కేసిఆర్ మద్దతు ఇవ్వడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

01/06/2017 - 04:04

హైదరాబాద్, జనవరి 5:్ఫజు రీయింబర్స్‌మెంట్ అంశంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనుకున్న కాంగ్రెస్‌కు సరైన వ్యూహం లేకపోవడం, ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించడంతో నవ్వుల పాలైంది. ఉదయం సభ ప్రారంభం కాగానే జానారెడ్డి లేచి.. నిన్నటి సభలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ అర్ధాంతరంగా ముగించి వాయిదా వేశారని, దానిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

01/06/2017 - 02:48

హైదరాబాద్, జనవరి 5: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలలో కనీస సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని, గతంలో ఎన్నడూలేని విధంగా రెండున్నర సంవత్సరాలలో రోడ్ల అభివృద్ధి కోసం రూ.4193 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

01/06/2017 - 02:46

హైదరాబాద్, జనవరి 5: ఫీజు రీఇంబర్స్‌మెంట్ విషయంలో సభను తప్పుదోవబట్టించే సమాచారం ఇచ్చారనే ఆరోపణపై ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసును ఇచ్చింది. అసెంబ్లీ రూల్ 168 కింద ఈ నోటీసును సిఎల్‌పి ఇచ్చింది. స్పీకర్ కార్యాలయంలో ఈ నోటీసును కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందచేశారు.

01/06/2017 - 02:46

హైదరాబాద్, జనవరి 5: అసెంబ్లీ సమావేశాలు ఈనెల 17,18 తేదీలకు వాయిదా పడే అవకాశం ఉంది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ సమావేశాల్లో రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ బిఎసి సమావేశం శుక్రవారం జరుగుతుంది. తొలుత నిర్ణయించిన తేదీల్లో కాకుండా అసెంబ్లీ సమావేశాల తేదీలను మార్చడం కోసం ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.

01/06/2017 - 02:43

న్యూఢిల్లీ, జనవరి 5: కరీంనగర్ జిల్లాలో మరో ఎల్‌పిజి (గ్యాస్) ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఎంపి వినోద్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం ధర్మేంద్రప్రధాన్‌ను కలిసిన వినోద్‌కుమార్ ఉత్తర తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న గ్యాస్ సరఫరా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

Pages