S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/06/2017 - 02:50

హైదరాబాద్, జనవరి 5: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని నిరసిస్తూ శాసనసభ నుంచి గురువారం కాంగ్రెస్, టిడిపి, సిపిఎం పార్టీలు వాకౌట్ చేశాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు గుర్తు చేస్తూ ‘వారు ప్రవేశపెట్టిన పథకంపై వాళ్లే వాకౌట్ చేయడమంటే వాళ్ల ముఖాలపై వాళ్లే ...’లా ఉందని ఎద్దేవా చేశారు.

01/06/2017 - 02:30

హైదరాబాద్, జనవరి 5: మిషన్ భగీరథ కోసం వేస్తున్న పైపులతో పాటు టి-ఫైబర్ లైన్లను కూడా శ్రద్దతో వేయాలని, భగీరథ-టిఫైబర్ వర్కింగ్ ఏజన్సీలు సమన్వయంతో పనిచేయాలని ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు విజ్ఞప్తి చేశారు. టిఫైబర్ పనులపై కెటిఆర్ గురువారం ఇక్కడ సమీక్షించారు.

01/06/2017 - 02:28

హైదరాబాద్, జనవరి 5: తెలంగాణ రాష్ట్రంలో 2016 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 3.56 లక్షల మంది రైతుల నుండి 15.13 లక్షల టన్నుల వరిధాన్యం కొనుగోలు చేశామని పౌరసరఫరాల కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ధాన్యం కొనుగోలుకు 2137 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

01/06/2017 - 02:27

హైదరాబాద్/ ఖైరతాబాద్, జనవరి 5: శాసనసభలో బుధవారం జరిగిన పరిణామాలు ఎంతో బాధాకరమని టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. వేలాది మంది విద్యార్థులకు అవసరమైన అత్యంత కీలకమైన అంశంపైన చర్చ జరుగుతుండగా అర్ధాంతరంగా సభని వాయిదా వేశారని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై ఈ రోజైనా చర్చించాలని కోరితే ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వలేదన్నారు.

01/06/2017 - 02:27

హైదరాబాద్, జనవరి 5: ఒకటి కాదు రెండు కాదు ఆమె ఏకంగా 11 ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రోఫెసర్ బాధ్యతలు నిర్వహిస్తోంది. నిజమా? అని తనిఖీకి వచ్చిన అధికారులు ఫోన్ చేస్తే ఔను అని సమాధానం చెబుతుంది. అలా సమాధానం చెప్పినందుకు ఆమెకు లక్ష రూపాయలు ముట్ట చెబుతారు. ఈ ప్రోఫెసర్ గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా గురువారం శాసన సభలో వెల్లడించారు.

01/06/2017 - 02:25

హైదరాబాద్, జనవరి 5: రాష్ట్రంలోని చేనేత కార్మికులకు చేయూత ఇచ్చేందుకు ఇంజనీర్లు కూడా చేనేత దుస్తులను కొనుగోలు చేయాలని గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి కోరారు. జిల్లాల్లోని తాగునీటి విభాగం ఎస్‌ఇ, ఇఇలు, మిషన్ భగీరథ పనులపై గురువారం ఆయన వీడియ కాన్ఫరెన్స్‌ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఐటి, పరిశ్రమల మంత్రి కె.

01/06/2017 - 02:25

హైదరాబాద్, జనవరి 5: కాంట్రాక్టు లెక్చరర్లకు 10వ పిఆర్‌సి కనీస బేసిక్‌ను యథాతథంగా అమలుచేయాల్సిన ప్రభుత్వం కేవలం 50 శాతం మాత్రమే చెల్లిస్తామని చెప్పడం ద్వారా మరోమారు ప్రభుత్వం వారికి మొండిచేయి చూపించింది. ప్రస్తుతం కాంట్రాక్టు లెక్చరర్లకు 9వ పిఆర్‌సిలో కనీస బేసిక్‌ను అమలుచేస్తున్నారు.

01/06/2017 - 02:24

హైదరాబాద్, జనవరి 5: ఇటీవల ఫీజుల వేధింపులతో బిటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువకముందే నగరంలో మరో చిన్నారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం కంచన్‌బాగ్‌లో చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంచన్‌బాగ్ హఫీజ్ బాబానగర్‌లోని ఓ హైస్కూల్‌లో తొమ్మిదోతరగతి చదువుతోన్న మీర్జా సల్మాన్ బేగ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

01/06/2017 - 02:23

హైదరాబాద్, జనవరి 5: దేవాదాయ కార్మిక శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. దేవాదాయ శాఖలో 70 కమిషనర్లు, మూడు డిప్యూటీ కమిషనర్ పోస్టులు, భర్తీకి అనుమతి ఇచ్చింది. కార్మిక శాఖలో నాలుగు బాయిలర్ ఇనెస్పెక్టర్ల పోస్టుల భర్తీకి అనుమతి మంజూరు చేసింది. టిఎస్‌పిఎస్సీ ద్వారా పోస్టుల భర్తీకి అనుమతులు ఇస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

01/06/2017 - 01:20

హైదరాబాద్, జనవరి 5:‘సింగరేణి తెలంగాణ కొంగుబంగారం. అదో అద్భుతమైన సంస్థ. ఉద్యోగ వనరుగా ఉన్న సింగరేణి సంస్థను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం’ అని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు. గురువారం నాడు సింగరేణి అంశంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు సిఎం సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులపై వరాల జల్లు కురిపించారు.

Pages