S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/05/2017 - 05:17

హైదరాబాద్, జనవరి 4: విద్యుత్ రంగంలో ప్రగతి సాధన, డిస్కమ్‌ల బలోపేతానికి కేంద్ర విద్యుత్ పథకం ‘ఉదయ్’లో చేరినట్టు సిఎం కె చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ప్రకటించారు. ఈమేరకు కేంద్రంతో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్టు అసెంబ్లీలో బుధవారం ప్రకటించారు.

01/05/2017 - 05:15

హైదరాబాద్, జనవరి 4: అసెంబ్లీ వాయిదా తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్, తెలుగు దేశం ఎమ్మెల్యేలు సభలో నిరసన ధర్నాకు దిగారు. సుమారు ఐదు గంటల తర్వాత స్పీకర్ ఆదేశంతో మార్షల్స్ (పోలీసులు) వారిని బలవంతంగా పార్టీ ఆఫీసులకు తరలించారు. బుధవారం అసెంబ్లీలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై జరిగిన చర్చకు సిఎం కె చంద్రశేఖర్ రావు సుదీర్ఘ సమాధానమిచ్చారు.

01/04/2017 - 05:17

హైదరాబాద్/ఖైరతాబాద్, జనవరి3: తెలంగాణలో పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రలపై సమష్టిగా ఉద్యమిద్దామని పలువురు వక్తలు పిలుపు నిచ్చారు.

01/04/2017 - 05:14

బచ్చన్నపేట, జనవరి 3: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంతానికి మంగళవారం కారులో రవాణా అవుతున్న 1.62 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బచ్చన్నపేట పోలీసుస్టేషన్‌లో జనగామ డిసిపి వెంకన్న తెలిపిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కొన్నాళ్లుగా ఈ ప్రధాన రహదారి వెంట గంజాయి రవాణా అవుతున్న సమాచారంతో నిఘా పెట్టారు.

01/04/2017 - 05:14

హైదరాబాద్/ముషీరాబాద్, జనవరి 3: ప్రభుత్వం అధికారికంగా ఊబర్. ఓలా క్యాబ్ డ్రైవర్లతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు.

01/04/2017 - 05:13

సిద్దిపేట, జనవరి 3 : సిద్దిపేటలోని శ్రీనివాస థియేటర్‌లో ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమా చూస్తూ ప్రేక్షకుడు మృతిచెందిన సంఘటన మంగళవారం జరిగింది. ఈ సంఘటనలో పట్టణంలోని ఎన్‌టిఆర్ నగర్‌కు చెం దిన షాదుల్ (28) మృతిచెందాడు. ఈవిషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బాధితులు కొద్దిసేపు ధియేటర్ వద్ద ఆందోళన చేపట్టారు. సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివారాల్లోకి వెళితే..

01/04/2017 - 05:13

మంచిర్యాల అర్బన్, జనవరి 3: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో తెలంగాణ మోడల్ స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. పట్టణ ఎస్‌ఐ వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం, శ్రీరాంపూర్‌కు చెందిన దేవీ కళాంజలి, టెకుమట్లలుకు చెందిన చిప్పకూర్తి పావని మంచిర్యాల పట్టణంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో సీఈసీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారని తెలిపారు.

01/04/2017 - 05:12

చౌటుప్పల్, జనవరి 3: చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు శివారులోని 11 ఇటుక బట్టీ పరిశ్రమలపై మంగళవారం స్మైల్ టీమ్ బృందం భూదాన్‌పోచంపల్లి ఎస్‌ఐ రాఘవేంద్ర సారథ్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఇటుక బట్టీలలో పనిచేస్తున్న 150 మంది బాలకార్మికులను గుర్తించారు. వారంతా బాలకార్మికులు కాదని, తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారని యాజమాన్యాలు వాదిస్తున్నప్పటికీ అధికారులు తమపని తాము చేశారు.

01/04/2017 - 05:12

హైదరాబాద్, జనవరి 3: ప్రాజెక్టుల నిర్మాణంలో భూ సేకరణ కీలక అంశమని, కలెక్టర్లు భూ సేకరణ వేగవంతం చేయాలని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషి ఆదేశించారు. భూ సేకరణపై జిల్లా కలెక్టర్లతో జోషి మంగళవారం వీడియో నిర్వహించారు. భూ సేకరణ కోసం రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన 2013 భూ సేకరణ చట్ట సవరణ ముసాయిదాను జిల్లా కలెక్టర్లు అందరికీ పంపిస్తున్నట్టు చెప్పారు.

01/04/2017 - 05:11

హైదరాబాద్, జనవరి 3: ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ప్రముఖ అథ్లెట్ కోచ్ వరంగల్ జిల్లా వాసి నాగపురి రమేష్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.25లక్షల రూపాయల పారితోషికాన్ని మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫైళుపై కెసిఆర్ మంగళవారం సంతకం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నగదు పారితోషికాన్ని మంజూరు చేసినట్టు తెలిపారు.

Pages