S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/03/2017 - 03:30

హైదరాబాద్, జనవరి 2: ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు చదువుపైనే దృష్టి కేంద్రీకరించాలని, పండగలు, పబ్బాలకు సమయం వృథా చేయవద్దని రాష్ట్ర గిరిజన మంత్రి అజ్మీరాచందూలాల్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని బుద్ధ్భవన్‌లో గిరిజన శాఖ నేతృత్వంలో ఏర్పాటు చేసిన స్టడీసర్కిల్‌ను మంత్రి ప్రారంభించారు.

01/03/2017 - 03:46

హైదరాబాద్, జనవరి 2: ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటి (టిజాక్) చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని టిజాక్ కేంద్ర కార్యాలయంలో సోమవారం టిజాక్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చూపించిన రాజ్యాంగబద్ధమైన మార్గంలోనే పయనిస్తామన్నారు.

01/03/2017 - 03:25

హైదరాబాద్, జనవరి 2: నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును పొగడటంపై కాంగ్రెస్, సిపిఐ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. కెసిఆర్ డైనమిక్ సిఎం అని గవర్నర్ తన హోదాను మరిచి పొగిడారని కాంగ్రెస్ సీనియర్ నేత మహ్మద్ షబ్బీర్ అలీ విమర్శించారు. గవర్నర్ తన పదవీ కాలాన్ని పొడిగించుకునేందుకే కెసిఆర్‌పై పొగడ్తల జల్లు కురిపించారని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

01/03/2017 - 03:24

హైదరాబాద్, జనవరి 2: మూడు రోజుల విరామం తర్వాత మంగళవారం నుంచి మళ్లీ శాసనసభ, మండలి శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 16న అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సమావేశాలను గత నెల 30 వరకే నిర్వహించాలని ప్రభుత్వం తొలుత భావించినా, ప్రజా సమస్యలపై చర్చించి, పరిష్కరించేందుకు ఎన్ని రోజులైనా సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని సిఎం కెసిఆర్ చెప్పారు.

01/03/2017 - 03:23

హైదరాబాద్, జనవరి 2: హైదరాబాద్‌లో రీజినల్ స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటు చేస్తామని కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్ గోయల్ ప్రకటించారు. స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని, దీనికి అవసరమై స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చేసిన వినతిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి గోయల్ సోమవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.

01/03/2017 - 03:22

హైదరాబాద్, జనవరి 2: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్లక్ష్యం కారణంగా ప్రజా సంక్షేమం సంక్షోభంలో పడిందని టిడిపి టిఎస్ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పి. సాయిబాబా విమర్శించారు. దేశంలో రెండో ధనిక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పినప్పటికీ అభివృద్ధిలో వెనుకబడిందని ఆయన సోమవారం విలేఖరులు సమావేశంలో విమర్శించారు.

01/03/2017 - 02:54

కరీంనగర్, డిసెంబర్ 2: నల్లధనం వెలికితీత పేరిట ప్రధాని నరేంద్రమోదీ 2016 నవంబర్ 8న ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎఐసిసి పరిశీలకుడు సి.జయప్రకాష్ ఆరోపించారు.

01/03/2017 - 02:51

మహబూబ్‌నగర్, జనవరి 2: మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ ప్రజావాణి కార్యక్రమంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు ఆశించిన స్థాయిలో పరిష్కరించడం లేదనే అపవాదు రావడంతో అందుకు చెక్ పెట్టడానికి కలెక్టర్ రంగంలోకి దిగారు.

01/03/2017 - 02:49

హైదరాబాద్, జనవరి 2: హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్ల ఆందోళన కొనసాగుతోంది. రోడ్లపై క్యాబ్‌లను ఎక్కడిక్కడ నిలిపివేసి డ్రైవర్లు తమ ఆందోళనను ఉద్ధృతం చేస్తున్నారు. సోమవారంతో క్యాబ్ డ్రైవర్లు చేపట్టిన ఆందోళన మూడో రోజుకు చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూకట్‌పల్లిలోని మలేషియా టౌన్‌షిప్ వద్ద ఓలా, ఉబెర్ క్యాబ్‌లను నిలిపివేసి, ప్రయాణికులను దింపేసి ధర్నా చేశారు.

01/03/2017 - 02:47

సంగారెడ్డి, జనవరి 2: కాంగ్రెస్ శ్రేణులను బలోపేతం చేసేందుకు ఈ నెల రెండవ వారంలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జె.గీతారెడ్డి, వి.సునితారెడ్డి స్పష్టం తెలిపారు. సోమవారం సంగారెడ్డి ఐబిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు.

Pages