S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

,
10/24/2019 - 02:20

సంగారెడ్డి, అక్టోబర్ 23: తెలంగాణ రాష్ట్రం గుండా ప్రవహించే కృష్ణా, గోదావరి నదులకు వరద పోటెత్తడంతో ప్రధాన జలాశయాలు ఇంచుమించు పూర్తిగా నిండిపోవడంతో సర్వత్రా సంతృప్తి వ్యక్తమవుతోంది. అయతే ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రవహిస్తున్న మంజీర నదీ పరీవాహక ప్రాంతంపై వరుణుడు అలకవహించాడని చెప్పవచ్చు.

10/24/2019 - 02:15

నిజామాబాద్, అక్టోబర్ 23: ప్రజా రవాణా వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని, అప్పటివరకు కార్మికులు మనోధైర్యం కోల్పోకుండా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని టీజేఎస్ అధ్యక్షుడు, రాజకీయ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

10/24/2019 - 02:12

నాగార్జునసాగర్, అక్టోబర్ 23: నాగార్జునసాగర్ జలాశయానికి బుధవారం నుండి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో సాగర్‌లో 18 క్రస్టు గేట్లను 15 అడుగుల మేరకు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. మంగళవారం నాడే సాగర్ ఎగువన శ్రీశైల జలాశయానికి ఇన్‌ఫ్లో తాకడంతో సాగర్‌లో రెండు గేట్ల ద్వారా నీటి విడుదల ప్రారంభించారు.

10/24/2019 - 02:10

హైదరాబాద్, అక్టోబర్ 23: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఈ పార్టీ ఎమ్మెల్యేలు పులిలా ఉంటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఎంపీ, పీసీసీ మాజీ నేత కే కేశవవరావు కాంగ్రెస్ పార్టీలో పులిలా ఉండేవారన్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో పిల్లిలాగా బతుకుతున్నారన్నారు.

10/24/2019 - 02:10

అల్వాల్, అక్టోబర్ 23: పండించిన పంటకు గిట్టుబాటు ధర రావటంలేదని బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో కమీషన్ ఎజెంట్‌లు, హమాలీలు కలిసి దోపిడీ చేస్తున్నారని, అధికారులు సైతం వారికే వంత పాడుతున్నారని బోయిన్‌పల్లి మార్కెట్ ముందు రైతులు ధర్నాకు దిగారు. గోవర్దన్ రెడ్డి అనే రైతు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకోని కాల్చుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

10/24/2019 - 02:08

హైదరాబాద్ : ఎన్నికల సంఘం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

10/24/2019 - 01:22

హైదరాబాద్, అక్టోబర్ 23: కొల్లూర్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ టౌన్ షిప్‌ను దేశంలోనే మాడల్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. పేదలకు నిర్మించే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికే ఆదర్శంగా కొల్లూరులో నిర్మించే ఇళ్లను తీర్చిదిద్దుతామన్నారు. దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున ఒకే చోట పేదల కోసం ఇళ్ల ప్రాజెక్టు లేదన్నారు.

10/24/2019 - 01:17

హైదరాబాద్, అక్టోబర్ 23: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఏబీవీపీ బుధవారం చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతను సృష్టించింది. అరెస్టులకు దారితీసింది. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితికి తెరదించాలని వారు కోరారు. ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన వారిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు.

10/24/2019 - 01:15

హైదరాబాద్ : రాష్ట్రంలోని చేనేత కార్మికులకు చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం తాజాగా 178 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ‘నేతన్నలకు చేయూత’ పథకం కింద ప్రభుత్వం 2019-20 సంవత్సరం బడ్జెట్‌లో 338 కోట్ల రూపాయలు కేటాయించి, తొలుత 150 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ప్రస్తుతం మరో 178 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇవి కాకుండా మరో 59 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంది.

10/24/2019 - 01:14

హైదరాబాద్, అక్టోబర్ 23: రాష్ట్ర హైకోర్టు ద్వారానే ఆర్టీసీ సమ్మెను విరమింపచేయడానికి ప్రభుత్వం అన్ని మార్గాలను అనే్వషిస్తోంది. హైకోర్టే ఏదో ఒకటి తేల్చాలనే ఆలోచనలో ఉంది. మరోపక్క ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు ఉండవని పరోక్షంగా ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. కాగా, ఈనెల 28 హైకోర్టుకు ప్రభుత్వం అందజేయనున్న నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Pages