S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/22/2019 - 16:31

హైదరాబాద్: ఏషియన్ సినీ నిర్మాణ, పంపిణీ సంస్థలపై ఈరోజు ఐటీ దాడులు జరిగాయి. ఏషియన్ అధినేతలు నారాయణదాస్ నారంగ్, సునిల్ నారంగ్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వారి సన్నిహితుల ఇళ్లల్లో సైతం సోదాలు జరిగాయి. నైజాంలో చిత్రాల పంపిణీ, ఏషియన్ థియేటర్లను నారంగ్ సోదరులు నిర్వహిస్తున్నారు.

10/22/2019 - 16:29

హైదరాబాద్: నగరంలో ఈ రోజు భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నీటితో నిండిపోవటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట, జీడమెట్ల తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం పూర్తిగా మారిపోయింది.

10/22/2019 - 13:05

హైదరాబాద్: తుంగభద్ర డ్యామ్‌కు వరద నీరు పోటెత్తింది. దీంతో డ్యామ్‌కు చెందిన 33 గేట్లను ఎత్తివేశారు. అల్ప పీడన ద్రోణి ప్రభావంతో కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద ప్రవహిస్తోంది. డ్యాం 33 గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా 1,55,431 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

10/22/2019 - 12:53

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ఏర్పాట్లు సక్రమంగా జరగటం లేదని దాఖలైన అన్ని వాజ్యాలను కోర్టు కొట్టివేసింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు సరిగా జరగటం లేదని కోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటన్నింటినీ కోర్టు కొట్టివేసింది. గత కొన్ని నెలలుగా ఈ పిటిషన్లపై విచారణ జరుగుతుంది.

10/22/2019 - 06:12

హైదరాబాద్, అక్టోబర్ 21: వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిశోధనా ఫలితాలు ఎప్పటికప్పుడు రైతులకు చేరాలని, ఈ పరిశోధనా ఫలితాల వల్ల పంటల ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు.

10/22/2019 - 06:10

హైదరాబాద్, అక్టోబర్ 21: ఆర్టీసీ సమ్మెతో సెలవుల పొడిగింపు అనంతరం సోమవారం నాడు పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు పున:ప్రారంభం అయినా చాలా వరకూ స్కూళ్లలో టీచర్లు, ఇతర బోధన సిబ్బంది హాజరుకాకపోవడంతో అవి బోసిపోయాయి.

10/22/2019 - 06:09

హైదరాబాద్, అక్టోబర్ 21: తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) రాష్ట్ర కమిటీ నేతలు సోమవారం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్నంగా వీహెచ్‌పీ నేతలతో తమిళిసై మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు సభ్యత, సంస్కారం ఉన్నవారని, వారి మంచికోసం పాటుపడతానని హామీ ఇచ్చారు.

10/22/2019 - 06:07

హైదరాబాద్, అక్టోబర్ 21: ప్రజాసంఘాల నిషేధంపై వామపక్ష, విప్లవ పార్టీలు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా 23న నిర్బంధ వ్యతిరేక సభను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించాలని నిర్ణయించాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అంటూ విప్లవ పార్టీలు పిలుపునిచ్చాయి.

10/22/2019 - 06:06

హైదరాబాద్, అక్టోబర్ 21:ఆర్టీసీ సమ్మె 17రోజుకు చేరుకున్న సందర్భంగా జేఏసీతో కలసి కాంగ్రెస్, వామపక్షాలు నేతలు సంఘీభావం తెలిపారు. హైదరాబాద్ ఎంజీబీఎస్ వద్ద వంటావార్పులో సీనియర్ కాంగ్రెస్ నేత హనుమంతరావు, సీపీఐ నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 97 బస్ డిపోల వద్ద కార్మిక కుటుంబాలతో బైఠాయింపు కార్యక్రమం చేశారు. ఈ బైఠాయింపులో డిపోల వద్ద ఉద్రిక్తత నెలకొంది. పట్టణ చౌరస్తాల్లో నిరసనలతో హోరెత్తింది.

10/22/2019 - 06:03

హైదరాబాద్ అక్టోబర్ 21: ఆర్టీసీ జేఏసీతో తక్షణం చర్చలకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్ తమిళసైని జేఎసీ నేతలు కోరారు. సోమవారం సాయంత్రం జేఏసీ నేతలు గవర్నర్‌ను కలసి సమ్మె ప్రభావం ప్రజారవాణాపై తీవ్రంగా ఉందని ఆమెకు సూచించారు. గవర్నర్ కలసిన తర్వాత జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజరెడ్డి, వెంకన్న ధామస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీని లాకౌట్ చేస్తారేమోనని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

Pages