S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/24/2019 - 02:23

నల్లగొండ, అక్టోబర్ 23: రాష్ట్ర ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ఫలితం గురువారం వెలువడనుంది. ఈనెల 21న జరిగిన పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపును గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మార్కెట్ గోదాముల్లో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లతో సిద్ధమైంది.

10/23/2019 - 17:44

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులెవ్వరు అధైర్య పడవద్దని జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే డిమాండ్‌పై వెనక్కితగ్గే ప్రసక్తే లేదని అన్నారు. ఏ ఒక్క డిమాండ్‌ను వెనక్కి తీసుకోబోమని అన్నారు.

10/23/2019 - 13:36

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై బస్ భవన్‌లో ఈడీ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో సమ్మెపై చర్చించారు. రెండురోజుల్లో సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పించనున్నారు. కార్మికులతో రవాణాశాఖ కమిషనర్ చర్చలు జరపనున్నారు. చర్చలకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధమని ఈ సమావేశంలో కార్మికులు పేర్కొన్నట్టు తెలుస్తోంది.

10/23/2019 - 05:47

సికింద్రాబాద్, అక్టోబర్ 22: ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పని చేయాలని, కోర్టు ఆదేశాలను గౌరవించి చర్చలకు ఇప్పటికైనా పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వాత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసి సమ్మె 18వ రోజుకు చేరుకున్న సందర్భంగా సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ‘్ధం...్ధం’, వంటావార్పు కార్యక్రమం జరిగింది.

10/23/2019 - 05:44

హైదరాబాద్, అక్టోబర్ 22: నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తే ఆర్ధిక వ్యవస్థ మరింత పతనం అవుతుందని మంగళవారం నాడు జరిగిన బ్యాంకు ఉద్యోగుల ధర్నాలో వక్తలు అభిప్రాయపడ్డారు.

10/23/2019 - 05:41

హైదరాబాద్, అక్టోబర్ 22: ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలుకుతూ ఈ నెల 25వ తేదీన ఉస్మానియా యూనివర్శిటీలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు విద్యార్థి సంఘాల జాక్ ప్రకటించింది. బహిరంగసభకు సంబంధించిన పోస్టర్‌ను టీ ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మంగళవారం నాడు ఆవిష్కరించారు.

10/23/2019 - 05:40

హైదరాబాద్, అక్టోబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ ప్రకటించి ఓటాన్ అకౌంట్‌లో ఆరు వేల కోట్లు కేటాయించి, ఆ నిధులను బ్యాంకులకు విడుదల చేయకపోవడంతో రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టీ సాగర్ పేర్కొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం అధ్యక్షుడు పీ జంగారెడ్డి అధ్యక్షతన జరిగింది.

10/23/2019 - 05:40

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలంగాణ రాష్ట్రంలో గౌడ కులస్తుల ఆత్మగౌరవం పెంపొందిస్తామని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి వి. శ్రీనివాసగౌడ్ తెలిపారు. హైదరాబాద్ (బర్కత్‌పుర) లో మంగళవారం ఏర్పాటు చేసిన ‘అలయ్..బలయ్’ కార్యక్రమంలో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ కులస్తులు ఐకమత్యంగా ఉండాలని కోరారు. తల్లివంటి గౌడ కుల వృత్తిని కల్లుగీత కార్మికులంతామరువకుండా కొనసాగించాలని సూచించారు.

10/23/2019 - 05:39

హైదరాబాద్, అక్టోబర్ 22: ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రగతిభవన్ ఆ పార్టీలో చిచ్చురేపింది. అసలు ఈ కార్యక్రమాన్ని ఎవరితో చర్చించి నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు.

10/23/2019 - 05:38

హైదరాబాద్, అక్టోబర్ 22: రాష్ట్రంలో పాలనను ముఖ్యమంత్రి కేసీఆర్ గాలికొదిలేశారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నో ఘటనలు జరుగుతున్నా ముఖ్యమంత్రికీ, మంత్రులకూ కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని అన్నారు. మంగళవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్యరంగం దురవస్థకు చేరుకుందని పేర్కొన్నారు.

Pages