S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/23/2019 - 05:17

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 22: తమ న్యాయమైన డిమాండ్ల సాధనకోసం గత 18 రోజుల నుంచి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఈనెల 30న హైదరాబాద్‌లో జరిగే పోలికేక బహిరంగ సభతో సీఏం కేసీఆర్ గుండెల్లో గుబులు పుట్టిస్తామని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు.

10/23/2019 - 05:15

కరీంనగర్, అక్టోబర్ 22: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులైన విద్యావంతులందరికీ ఉద్యోగాలు ఇచ్చేందుకు కేసీఆర్ సర్కార్ చర్యలు చేపట్టిందని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు అందిపుచ్చుకొని, తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

10/23/2019 - 05:08

నాగార్జునసాగర్, అక్టోబర్ 22: నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద నీరు పెరుగుతుండటంతో మంగళవారం నాగార్జునసాగర్‌లో రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా సాగర్‌కు ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో సాగర్ డ్యాం క్రస్టు గేట్లను మూసివేశారు.

10/23/2019 - 05:05

హైదరాబాద్, అక్టోబర్ 22: న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టడంతో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం నాటితో 18వ రోజుకు చేరుకుంది. ఎపుడేం జరుగుతుందోనన్న వాతావరణం నెలకొంది.

10/23/2019 - 04:43

హైదరాబాద్, అక్టోబర్ 22: హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లోని షైన్ పిల్లల ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ)లో బాలల హక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖను బాధ్యులను చేయాలని ఆ పిటిషన్‌లో పేర్కొంది. ఈ ఆసుపత్రి పై అంతస్తులో సోమవారం తెల్లవారుజామున 2.40 గంటలకు అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం విదితమే.

10/23/2019 - 04:36

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలంగాణలోని పాఠశాలల్లో మూడో తరగతి స్థాయి నుండే పఠన నైపుణ్యాలు, గణిత నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా పాఠశాల విద్యాశాఖ కొత్త వ్యూహాన్ని రూపొందించింది. ఈ వ్యూహాన్ని అమలుచేసే క్రమంలో సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

10/23/2019 - 04:56

హైదరాబాద్: ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హామీ ఇచ్చారు. గిరిజన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో ఆమె రాజ్‌భవన్‌లో మంగళవారం సమీక్షించారు.

10/23/2019 - 00:46

హైదరాబాద్, అక్టోబర్ 22: ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఎట్టకేలకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ మినహాయించి మిగతా 21 డిమాండ్లను పరిశీలించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

10/23/2019 - 00:43

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో రాష్ట్ర ప్రభు త్వం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. మున్సిపల్ వ్యవహారాల మంత్రి కే తారకరామారావు ఒకటి రెండు రోజుల్లో సంబంధిత అధికారులతో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఇప్పటికే అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుండి వివరాలు తెప్పించుకుంది.

10/22/2019 - 16:31

హైదరాబాద్: కానిస్టేబుల్ అభ్యర్థులు ఈరోజు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. కానిస్టేబుళ్ల ఎంపిక ఫలితాలపై విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Pages