S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/25/2019 - 05:46

హైదరాబాద్, అక్టోబర్ 24: ప్రజా రవాణా వ్యవస్థలో వెనె్నముకగా ఉన్న ఆర్టీసీ కార్మిక శక్తులకు ముగింపు ఉండదని జేఏసీ నేతలు మండిపడ్డారు. కార్మికులను చులకనగా సీఎం కేసీఆర్ మాట్లాడడం బాధాకరమని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా నిరసనలు, ధర్నాలు, ర్యాలీలను కొనసాగిస్తామన్నారు. గురువారం హైదరాబాద్‌లో జేఏసీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు.

10/25/2019 - 04:50

హైదరాబాద్, అక్టోబర్ 24: తెలంగాణలో రబీ సీజన్‌కు సంబంధించి రైతులకు అవసరమైన ఎరువులను మరీ ముఖ్యంగా యూరియాను అందించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాల్సి ఉందని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి పేర్కొన్నారు.

10/25/2019 - 04:48

హైదరాబాద్, అక్టోబర్ 24: బుద్దవనం ప్రాజెక్టు పనుల పురోగతిపై రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బుద్దవనం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

10/25/2019 - 04:46

హైదరాబాద్, అక్టోబర్ 24: న్యాయసమ్మతమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన తీరు దారుణంగా ఉందని బీజేపీ ధ్వజమెత్తింది. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ముఖ్యమంత్రి కంటే, ఒక ప్రైవేట్ సంస్థకు సీఈవోలాగా వ్యవహరించారు. ఆర్టీసీపై చేసిన ప్రపకటన నయా పెట్టుబడీనదారీ మనస్తత్వాన్ని ప్రతిబింబించాయని బీజేపీ పేర్కొంది.

10/25/2019 - 04:45

హైదరాబాద్, అక్టోబర్ 24: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు గుండె ఆపరేషన్లకోసం వాడే ‘స్టెంట్’ను తక్కువ ధరకే రూపొందించేందుకు పరిశోధన చేపడుతున్నామని హైదరాబాద్‌లోని ‘ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటల్లర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) డైరెక్టర్ డాక్టర్ జీ. పద్మనాభ రెడ్డి తెలిపారు.

10/25/2019 - 04:44

హైదరాబాద్, అక్టోబర్ 24: తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్‌సీ) చైర్మన్‌గా శ్రీరంగారావు నియమితులయ్యారు. ఈయనతో పాటు సభ్యులుగా ఎండీ మనోహర రాజు, బండారు క్రిష్ణయ్యలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్, సభ్యులు ఐదేళ్లపాటు పదవిలో ఉంటారని ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు.

10/25/2019 - 04:44

హైదరాబాద్, అక్టోబర్ 24: అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను వచ్చే నెల 5వ తేదీ నుండి కొల్‌కటాలో నిర్వహిస్తున్న సందర్భంగా హైదరాబాద్‌లో సైన్స్ కారిడార్ నిర్వహిస్తున్నట్టు సీడీఎఫ్‌డీ డైరెక్టర్ దేబశిష్ మిశ్రా తెలిపారు. తార్నాక నుండి నాగోల్ కారిడార్ వరకూ దీనిని నిర్వహిస్తామని అన్నారు.

10/25/2019 - 04:43

హైదరాబాద్, అక్టోబర్ 24: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు సంతోషాన్ని కలిగించే విధంగా ఉన్నాయని కరీంనగర్ మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలతో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనే విషయం తేలిపోయిందన్నారు.

10/25/2019 - 04:31

నిజామాబాద్, అక్టోబర్ 24: తాత్కాలిక సిబ్బందితో నిర్వహిస్తున్న ఆర్టీసీ బస్సుల కారణంగా వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పూర్తిస్థాయిలో అనుభవం లేని తాత్కాలిక డ్రైవర్లు బస్సులు నడిపిస్తుండటంతో అనునిత్యం ఏదోఒక చోట ప్రమాద ఘటనలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా గురువారం నిజామాబాద్ మండలం మల్లారంగండి సమీపంలో భారీ రోడ్డు దుర్ఘటన బారి నుండి పదుల సంఖ్యలో ప్రయాణికులు త్రుటిలో తప్పించుకోగలిగారు.

10/25/2019 - 04:26

భూపాలపల్లి, అక్టోబర్ 24: హుజూర్‌నగర్ గెలుపు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నీచంగా మాట్లాడుతున్నాడని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రశేఖర్ అన్నారు. గురువారం భూపాలపల్లి పట్టణంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు, రిలే దీక్షలకు వారు సంఘీభావం తెలిపారు.

Pages