S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/25/2019 - 01:45

హైదరాబాద్, అక్టోబర్ 24: బాల కార్మిక వ్యవస్థలేని సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ పాటుపడాలని రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్-చైర్మన్ బి. వినోద్‌కుమార్ సూచించారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జె. శ్రీనివాసరావు, సభ్యులు గురువారం వినోద్‌కుమార్‌తో సమావేశమయ్యారు.

10/25/2019 - 00:32

హైదరాబాద్: తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-2 రిక్రూట్‌మెంట్ తుది ఫలితాలను పబ్లిక్ సర్వీసు కమిషన్ గురువారం నాడు ప్రకటించింది. 1,032 పోస్టులకుగాను 1,027 మందిని ఎంపిక చేశారు. అందులో డిప్యుటీ తహసీల్దార్లుగా 259 మంది, ఎక్సైజ్ ఎస్‌ఐలుగా 284 మందిని, వాణిజ్య పన్నుల అధికారులుగా 156 మందిని నియమించనున్నారు. ఈ ఎంపిక పరీక్షలకు 7,89,985 మంది దరఖాస్తు చేశారు.

10/25/2019 - 00:27

నల్లగొండ, అక్టోబర్ 24: రాష్ట్ర ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపిన హుజూర్‌నగర్ ఉప ఎన్నిక పోరులో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజేతగా నిలిచారు. అభివృద్ధి నినాదంతో పోటీ చేసిన అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఓటర్లు ఆదరించడంతో ఆ పార్టీ అవిర్భావం తర్వాత తొలిసారిగా హుజూర్‌నగర్ గడ్డపై గులాబీ జయకేతనం ఎగురవేసింది.

10/25/2019 - 00:24

హైదరాబాద్, అక్టోబర్ 24: ‘సమ్మె ముగియకపోతే...ఆర్టీసీ కథ ముగిసినట్టే’నని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ‘ఐ యామ్ సారీ...ఇక ఆర్టీసీని మరిచిపోవాల్సిందే’ అని కుండబద్దలు కొట్టారు. ఆర్టీసీ సమ్మె భవితవ్యం ఎలా ఉండబోతుందో కూడా సీఎం పత్రికాముఖంగా సుదీర్ఘంగా వివరించారు.

10/24/2019 - 16:55

హైదరాబాద్:హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపొందారు. ఆయన 43,624 ఓట్ల మెజార్టీ విజయం సాధించారు. 22వ ఆఖరి రౌండ్‌లో భారీ మేజార్టీతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా సైదిరెడ్డి తొలి నుంచి ఆధిక్యం కనబరుస్తూనే వచ్చారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఓట్ల లెక్కింపు జరుగుతుండగా మధ్యలోనే వెళ్లిపోయారు.

10/24/2019 - 12:52

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ సంబరాలు చేసుకుంది. హుజుర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యం దిశలో దూసుకుపోతున్న వేళ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ శంభూపూర్ రాజు, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ఇకపై మరింత బాధ్యతగా పనిచేస్తామని చెప్పారు.

10/24/2019 - 12:52

హైదరాబాద్: హుజుర్‌నగర్‌లో జరిగిన ఉప ఎన్నికలో కారు జోరుగా దూసుకుపోతుంది. తొమ్మిది రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. తొమ్మిదో రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి 19,200 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెండవ స్థానానికి పరిమితమయ్యారు. మూడు, నాలుగు స్థానాల్లో బీజేపీ, టీడీపీ ఉన్నారు.

,
10/24/2019 - 05:33

హైదరాబాద్, అక్టోబర్ 23; ప్రభుత్వం ఎలాంటి కమిటీలు వేసినా జేఏసీ డిమాండ్ మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని జేఏసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మెలో భాగంగా బుధవారం హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు, ధూంధాం కార్యక్రమాన్ని చేపట్టారు. జేఏసీ ప్రతిపాధించిన 26 డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

10/24/2019 - 05:27

హైదరాబాద్, అక్టోబర్ 23: దేశ అభివృద్ది, జాతీయ ఆదాయంలో గనుల రంగం కీలక భూమిక పోషిస్తుందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అభివృద్ది ఏదైనా అందులో గనుల పాత్రనే ముఖ్యమన్నారు.

10/24/2019 - 05:20

హైదరాబాద్, అక్టోబర్ 23: రాష్ట్రంలో 2019 ఖరీఫ్ సీజన్‌లో పండిన పంటల ఉత్పత్తులు, మరీముఖ్యంగా ధాన్యం కొనుగోలు ప్రారంభం నుండి పూర్తయ్యే సమయం వరకు మార్కెటింగ్ శాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు.

Pages