S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/06/2016 - 03:15

భద్రాచలం, నవంబర్ 5: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాను మెదడువాపు (జపనీస్ ఎన్‌సైఫలైటిస్) వ్యాధి వణికిస్తున్న నేపథ్యంలో ఆ జిల్లాలో శనివారం న్యూఢిల్లీలోని ఎన్‌విపిడిసిపి (నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం) అడిషనల్ డైరెక్టర్ డా.పి.కె.సేన్ నేతృత్వంలోని 9 మంది వైద్యుల బృందం పర్యటించింది. ఇప్పటి వరకు ఈ జిల్లాలో 69 మంది చిన్నారులు మెదడువాపు వ్యాధితో కన్నుమూశారు.

11/06/2016 - 03:23

నాగార్జునసాగర్/విజయపురి సౌత్, నవంబర్ 5: నాగార్జునసాగర్‌లో మరోసారి తెలంగాణ, ఆంధ్ర అనే అంశంపై గందరగోళం ఏర్పడింది. శనివారం టూరిజంపరంగా సాగర్ జలాల సాక్షిగా ఆంధ్రా, తెలంగాణ లాంచీల రాకపోకల విషయంలో ఆంధ్ర, తెలంగాణ వివాదం మరోసారి రేకెత్తింది. శనివారం నాగార్జునసాగర్‌లోని తెలంగాణ ప్రాంతం నుండి మొదటిసారిగా తెలంగాణ టూరిజం లాంచీలు నాగార్జునకొండకు పర్యాటకులను తీసుకుని వెళ్లాయి.

11/06/2016 - 02:45

భద్రాచలం, నవంబర్ 5: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాను మెదడువాపు (జపనీస్ ఎన్‌సైఫలైటిస్) వ్యాధి వణికిస్తున్న నేపథ్యంలో ఆ జిల్లాలో శనివారం న్యూఢిల్లీలోని ఎన్‌విపిడిసిపి (నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం) అడిషనల్ డైరెక్టర్ డా.పి.కె.సేన్ నేతృత్వంలోని 9 మంది వైద్యుల బృందం పర్యటించింది. ఇప్పటి వరకు ఈ జిల్లాలో 69 మంది చిన్నారులు మెదడువాపు వ్యాధితో కన్నుమూశారు.

11/05/2016 - 08:33

హైదరాబాద్, నవంబర్ 4: వైద్య శాఖలో 2,118 పోస్టుల భర్తీకి విధి విధానాలను ఖరారు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తో శుక్రవారం ఈ అంశంపై చర్చించారు. విధి విధానాలపై మంత్రి, అధికారులు సమగ్రంగా చర్చించారు. ప్రాథమికంగా విధివిధానాలపై ఒక నిర్ణయానికి వచ్చారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోస్టుల భర్తీ ప్రక్రియకు ఆమోదం తెలిపారు.

11/05/2016 - 06:44

హైదరాబాద్, నవంబర్ 4: వైద్యవృత్తిలో అనైతిక చర్యలకు పాల్పడిన వైద్యులపై తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ శుక్రవారం కొరడా జుళిపించింది. రాష్టవ్య్రాప్తంగా ఒకేసారి ఆరుగురు వైద్యులపై సస్పెన్షన్ వేటు వేయడం చారిత్రాత్మక నిర్ణయంగా ఈ రంగంలోని వారు కొనియాడుతున్నారు.

11/05/2016 - 06:40

గద్వాల, నవంబర్ 4: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు రైతులు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన హృదయవిదారక సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలోని ఆలూరులో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం ఆలూరు గ్రామంలో వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్‌ఫార్మర్ అమర్చుతుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు రైతులు దుర్మరణం పాలయ్యారు.

11/05/2016 - 06:37

హైదరాబాద్, నవంబర్ 4: పట్టణీకరణ వేగంగా జరుగుతున్న హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ అక్రమాలు, మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక అథారిటీ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై జారీ చేసిన విధి విధానాలపై రాష్ట్రంలో కూడా రియల్ ఎస్టేట్ రెగ్యులారిటీ అథారిటీని నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

11/05/2016 - 07:32

హైదరాబాద్, నవంబర్ 4: సింగరేణి కాలరీస్ సంస్ధలో వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి రెండు కీలకమైన నిర్ణయాలను శుక్రవారం ప్రకటించింది. సిఎం కెసిఆర్ ఆదేశాలపై సింగరేణి కాలరీస్ కంపెనీలో వారసత్వ ఉద్యోగాలకు హైదరాబాద్‌లో జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం అంగీకారం తెలిపిందని సిఎండి ఎన్ శ్రీ్ధర్ తెలిపారు.

11/05/2016 - 02:09

భూదాన్ పోచంపల్లి, నవంబర్ 4: అన్నం సరిగ్గా పెట్టడం లేదని యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలోని కస్తూర్బా విద్యాలయానికి చెందిన 100 మంది విద్యార్థినులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. నీళ్ల చారు, వారం రోజులుగా పసుపుతో కలపిన అన్నం, నాణ్యతలేని సరైన ఆహారం పెట్టకపోవడంతో ఆకలితో అలమటించామనీ.. మా సమస్యలు పట్టించుకునే నాధుడే కరువయ్యాడని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.

11/05/2016 - 02:07

మోర్తాడ్, నవంబర్ 4: బిజెపి సీనియర్ నాయకుడు, స్వదేశీ జాగరణ మంచ్ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ ముత్యాల మనోహర్‌రెడ్డి పసుపు రైతుల సంక్షేమం కోసం చేపట్టిన దీక్ష శనివారం నాటితో ఐదేళ్లు పూర్తి చేసుకుంది. పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఆయన 2011 నవంబర్ 5వ తేదీన దీక్షకు శ్రీకారం చుట్టారు.

Pages