S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/04/2016 - 04:05

కొడిమ్యాల, నవంబర్ 3: దైవ దర్శనార్థం కోసం బయలు దేరిన ఆ కుటుంబాన్ని ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన రెండు కుటుంబాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

11/04/2016 - 04:01

ఇటిక్యాల, నవంబర్ 3: ఏ కష్టం వచ్చిందోకాని కృష్ణానదిలో పడి ముగ్గురు మహిళలు తనువుచాలించారు. ఈ సంఘటన గద్వాల- జోగు లాంబ జిల్లా ఇటిక్యాల మండల పరిధిలోని జాతీయ రహదారి పక్కన ఉన్న బీచుపల్లి కృష్ణానది పుష్కరఘాట్ దగ్గర చోటుచేసుకుంది. అలంపూర్ సిఐ వెంకటేశ్వర్లు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

11/04/2016 - 03:59

హైదరాబాద్, నవంబర్ 3: తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం కొలువు తీరిన సచివాలయాన్ని కూల్చివేసి తాత్కాలికంగా వేరే చోటకు తరలించి కొత్త భవనాలను నిర్మించాలన్న ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. సచివాలయాన్ని తరలించడం తెలివితక్కువ నిర్ణయమన్నారు.

11/04/2016 - 03:58

హైదరాబాద్, అక్టోబర్ 3: ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికోద్యోగి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, కేంద్రం అమలు చేస్తున్న నిర్బంధ కాండకు నిదర్శనమని టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు భట్టి విక్రమార్క అన్నారు. వన్ ర్యాంక్, వన్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చి మాట తప్పిందన్నారు.

11/04/2016 - 03:58

హైదరాబాద్, నవంబర్ 3: మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌కు నిరశనగా ఐదు రాష్ట్రాల్లో మావోయిస్టులు తలపెట్టిన బంద్ గురువారం ప్రశాంతంగా సాగింది. మావోల బంద్ పిలుపుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్టల్ల్రో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఏవోబిలో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు.

11/04/2016 - 03:57

సూర్యాపేట, నవంబర్ 3: గతంలో సిమి ఉగ్రవాదుల ఉదంతం వెలుగుచూసిన సూర్యాపేటలోని హైటెక్ బస్టాండ్‌లో గురువారం రాత్రి ఓ అనుమానిత వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. సదరు యువకుని వద్ద వివిధ పేర్లతో ఉన్న గుర్తింపు కార్డులు లభ్యమైనట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది.

11/04/2016 - 03:57

హైదరాబాద్, నవంబర్ 3: వివాదాల ప్రత్యామ్నాయ పరిష్కారాల అంతర్జాతీయ కేంద్రం (ఐసిఎడిఆర్) ఏపి, తెలంగాణ రాష్ట్రాల చాప్టర్ శుక్రవారం నాడు మధ్యవర్తిత్వంపై న్యాయమూర్తులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఉదయం 9.30 గంటలకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావు ప్రారంభిస్తారు. సాయంత్రం ముగింపు కార్యక్రమంలో జస్టిస్ జి శ్యాం ప్రసాద్ పాల్గొంటారు.

11/04/2016 - 03:56

హైదరాబాద్, నవంబర్ 3: టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గడ్డం పెంచుకుంటే ముఖ్యమంత్రి కాలేరని, సన్యాసులు అవుతారంటూ మంత్రి కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై టిపిసిసి మండిపడింది. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం కెటిఆర్ అహంకారానికి, అధికార మూర్ఖత్వానికి నిదర్శనమని టిపిసిసి సీనియర్ నేత మల్లురవి అన్నారు.

11/04/2016 - 03:55

మఠంపల్లి, నవంబర్ 3: నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలంలోని గుర్రంపోడు తండా పునరావాస భూములలో స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించి హద్దుల ఏర్పాటు కోసం వచ్చిన రెవెన్యూ సర్వే అధికారులను గురువారం గిరిజనులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొంత మేర ఉద్రిక్తత నెలకొంది. 540 సర్వే నెంబర్‌లో తమ భూములను ఎవరికీ విక్రయంచలేదని సర్వే సిబ్బందికి గిరిజనులు స్పష్టం చేశారు.

11/04/2016 - 03:18

హైదరాబాద్, నవంబర్ 3: తెలంగాణలో న్యాయ విద్యా కళాశాలల్లో మూడేళ్ల యుజి, రెండేళ్ల పిజి, ఐదేళ్ల యుజి కోర్సుల్లో ప్రవేశానికి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తికావస్తున్నా, కాలేజీల్లో సీట్లు, ఫీజుల వ్యవహారాన్ని ప్రభుత్వం తేల్చలేదు. రాష్టవ్య్రాప్తంగా 22 కాలేజీలకు తాత్కాలికంగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే వీటిలో సీట్ల వ్యవహారం కూడా నిర్దిష్టంగా తేలలేదు.

Pages