S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/04/2016 - 03:17

హైదరాబాద్, నవంబర్ 3: కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా అవినీతికి రాజధాని లాంటిదని టిఆర్‌ఎస్ ఎంపి బూర నర్సయ్య విమర్శించారు. టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఎంపి మాట్లాడారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే ఇక తమకు భవిష్యత్తు లేదు అనే భయం కాంగ్రెస్ నాయకులకు పట్టుకుందని అన్నారు.

11/04/2016 - 03:16

హైదరాబాద్, నవంబర్ 3: తెలంగాణలో మద్యం ఏరులై పారుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ప్రజాద్రోహమేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు.

11/04/2016 - 03:15

హైదరాబాద్, నవంబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా నిత్యావసర సరకులు క్రమం తప్పకుండా ప్రజలకు అందించాలని పౌరసరఫరాల కమిషనర్ సివి ఆనంద్ కోరారు. పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో రేషన్ డీలర్లతో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, సబ్సిడీ బియ్యం పేదలకు కిలో రూపాయికే అందిస్తున్నామని, ఈ పథకం పారదర్శకంగా, సమర్థతగా అమలు చేయాల్సిన బాధ్యత డీలర్లపైనే ఉందన్నారు.

11/04/2016 - 03:15

హైదరాబాద్, నవంబర్ 3: 2011 నాటి 15/2011, 18/2011నోటిఫికేషన్ల ఆధారంగా నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష పేపర్-5లో రెండు ప్రశ్నలు తొలగించినట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ప్రకటించింది.

11/04/2016 - 03:14

హైదరాబాద్, నవంబర్ 3: ఢాకాలోని వ్యాధి పరిశోధన అంతర్జాతీయ కేంద్రం ఐసిడిడిఆర్‌కు డైరెక్టర్‌గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో బయోటెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నియాజ్ అహ్మద్ నియమితులయ్యారు.

11/04/2016 - 03:13

హైదరాబాద్, నవంబర్ 3: రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయానికి సంబంధించిన సలహాలు, సూచనలే కాకుండా బ్యాంకుల నుండి వ్యవసాయ రుణాలు ఇప్పించడంలోనూ సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. రెడ్ హిల్స్ ఫ్యాప్సి భవనంలో రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల జోనల్ స్థాయి అవగాహన, సమీక్షా సమావేశం గురువారం జరిగింది.

11/04/2016 - 03:12

హైదరాబాద్, నవంబర్ 3: తెలంగాణలో భారతీయ వైద్య కాలేజీల్లో (హౌజ్ సర్జన్లు, పోస్ట్‌గ్రాడ్యుయేట్) విద్యార్థులకు నెలవారీగా ఇచ్చే స్ట్ఫైండ్‌ను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు గురువారం జీఓ (జిఓఎంఎస్ నెంబర్ 152) జారీ అయింది.

11/04/2016 - 03:12

హైదరాబాద్, నవంబర్ 3: ఖమ్మం జిల్లాలోని భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ సరఫరా పనులను ఆ లోగా పూర్తి చేయాలని ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకర్‌రావును మంత్రి ఆదేశించారు.

11/04/2016 - 03:48

హైదరాబాద్, నవంబర్ 3: జంటనగరాల పరిధిలో సిసి కెమెరాల ఏర్పాటుకు పోలీస్ శాఖ చేపట్టిన వినూత్న కార్యక్రమానికి నేషనల్ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు నగర కమిషనర్ కార్యాలయంలో గురువారం ఎన్‌ఎండిసి డైరెక్టర్ సందీప్ తుల, నగర అదనపు కమిషనర్ మురళీకృష్ణ కలసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి సమక్షంలో మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (ఎంవోయు)పై సంతకాలు చేశారు.

11/03/2016 - 07:14

హైదరాబాద్, నవంబర్ 2: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి మరో ఖ్యాతి దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో యూనివర్శిటీకి 14వ ఉత్తమ విశ్వవిద్యాలయంగా గుర్తింపు దక్కింది. యుఎస్ న్యూస్ వరల్డ్ రిపోర్టు-2017లో బెస్ట్ గ్లోబల్ యూనివర్శిటీల జాబితాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ 14వ స్థానాన్ని దక్కించుకుంది.

Pages