S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/06/2016 - 03:32

హైదరాబాద్, నవంబర్ 5: గ్యాంగ్ స్టర్ నరుూం కేసులో సిట్‌తో దర్యాప్తు నిర్వహిస్తే నిజాలు బయటపడవని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. నరుూం చీకటి వ్యవహారాలతో అధికార పార్టీ నేతలకు సంబంధాలున్నాయని, అందుకే ప్రభుత్వం ఈ కేసును సిబిఐతో కాకుండా సిట్‌తో దర్యాప్తు జరిపిస్తోందని ఆయన ఆరోపించారు.

11/06/2016 - 03:32

హైదరాబాద్, నవంబర్ 5: రాష్ట్రంలో విషజ్వరాల నివారణకు తీసుకున్న ప్రభుత్వం చర్యలపై ఈ నెల 15 లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సి) ఆదేశించింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయని, ప్రజలు, ముఖ్యంగా పేదలు ఈ జ్వరాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) ఒక నివేదిక ద్వారా మానవహక్కుల కమిషన్‌కు తెలియచేసింది.

11/06/2016 - 03:31

హైదరాబాద్, నవంబర్ 5: గ్యాంగ్‌స్టర్ నయిం కేసులో ఇప్పటి వరకు 166 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో 109 మంది నయిం అనుచరులు, బంధువులను అరెస్టు చేసిన పోలీసులు ఇప్పటివరకూ 92 మందిని కస్టడీలోకి తీసుకుని 230 మందిని పీటీ వారెంట్‌పై విచారించారు. అలాగే 418 సాక్షులను కూడా సిట్ విచారించింది.

11/06/2016 - 03:31

హైదరాబాద్, నవంబర్ 5: విడాకుల కేసుకు సంబంధించిన పిటిషన్ విచారణలో స్కైప్ టెక్నాలజీని వినియోగించుకునేందుకు హైదరాబాద్ హైకోర్టు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తన భర్త సాక్ష్యాన్ని స్కైప్ టెక్నాలజీ ద్వారా స్వీకరించడానికి కొత్తగూడెం సీనియర్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారని, ఈ ఆదేశాలను సవరించి సరిదిద్దాలని కోరుతూ ఒక మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

11/06/2016 - 03:30

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు సలహాలు-సూచనలు ఇచ్చేందుకు ‘మనటివి’ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేస్తోంది. టిఎస్‌పిఎస్‌సి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మనటివి సిఇఓ ఆర్.శైలేష్‌రెడ్డి తెలిపారు.

11/06/2016 - 03:28

భద్రాచలం, నవంబర్ 5: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాను మెదడువాపు (జపనీస్ ఎన్‌సైఫలైటిస్) వ్యాధి వణికిస్తున్న నేపథ్యంలో ఆ జిల్లాలో శనివారం న్యూఢిల్లీలోని ఎన్‌విపిడిసిపి (నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం) అడిషనల్ డైరెక్టర్ డా.పి.కె.సేన్ నేతృత్వంలోని 9 మంది వైద్యుల బృందం పర్యటించింది. ఇప్పటి వరకు ఈ జిల్లాలో 69 మంది చిన్నారులు మెదడువాపు వ్యాధితో కన్నుమూశారు.

11/06/2016 - 03:28

హైదరాబాద్, నవంబర్ 5: రాష్ట్రంలో రైతులు మార్కెట్‌కు తీసువస్తున్న పంటల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇప్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి సి. పార్థసారథి ఆదేశించారు. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి మార్కెట్ యార్డ్‌లో మార్కెటింగ్ అధికారులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ సమస్యలపై చర్చించారు. ఖరీఫ్ పంటల ఉత్పత్తులు ఇప్పుడే మార్కెట్‌కు వస్తున్నాయన్నారు.

11/06/2016 - 03:27

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణ రాష్ట్రం-బ్రిటన్ దేశాల మధ్య పారిశ్రామిక, సాంస్కృతిక రంగాల్లో పటిష్టమైన సంబంధాలను నెలకొల్పుకుందామని బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు వీరేంద్రశర్మను ప్రభుత్వ సలహాదారు (సాంస్కృతిక వ్యవహారాలు) డాక్టర్ కెవి రమణాచారి కోరారు. వాణిజ్య, సాంస్కృతిక రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు, కార్యక్రమాలను పరిశీలించేందుకు వీరేంద్రశర్మ వచ్చారు.

11/06/2016 - 03:24

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణ పరీక్షల బోర్డు పూర్తికాలిక సంచాలకురాలిగా బి.శేషుకుమారిని నియమించారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ సొసైటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇంత వరకూ డైరెక్టర్‌గా ఉన్న ఆర్.సురేందర్‌రెడ్డి డిసెంబర్ 12 వరకూ సెలవులో వెళ్లారని అధికారులు తెలిపారు.
పోలీస్ కమిషనరేట్‌లో మిస్ ఫైర్

11/06/2016 - 03:16

సూళ్లూరుపేట, నవంబర్ 5: పార్శిల్ లారీల్లో విదేశీ మద్యాన్ని తరలిస్తుండగా చెక్‌పోస్టు అధికారులు అనుమానంతో తనిఖీచేసి దాన్ని స్వాధీనంచేసుకున్న సంఘటన ఆంధ్రా,తమిళనాడు సరిహద్దు తడ చెక్‌పోస్టులో శనివారం వెలుగుచూసింది. క్రాంతి పార్శిల్ లారీ మాటున విదేశీ మద్యాన్ని కూడా ట్రాన్స్‌పోర్టు లారీలు తరలిస్తున్నాయి. ప్రతిరోజు ఈ తంతు జరుగుతోంది.

Pages