S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/17/2019 - 05:05

హైదరాబాద్, అక్టోబర్ 16: ఏయిర్ ఫోర్స్ అకాడమీ కమాండెంట్‌గా ఏయిర్ మార్షల్ జె. చలపతి బాధ్యతలను స్వీకరించారు. ఎయిర్ మార్షల్ ఏఎస్ బుటోలా నుండి చలపతి బాధ్యతలు తీసుకున్నారు. ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్ట్ఫా (ప్లాన్స్) గా పనిచేస్తున్న చలపతి ప్రమోషన్‌పై ఎయిర్ మార్షల్‌గా నియామకం అయ్యారు. ఎయిర్ మార్షల్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సంబంధిత అధికారులు ఆయనను అభినందించారు.

10/17/2019 - 04:59

హైదరాబాద్, అక్టోబర్ 16: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి సంవత్సరం సాలీనా 17.5 మిలియన్ల మంది గుండె జబ్బుల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని అపోలో హాస్పిటల్స్ సీఎస్‌ఆర్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కామినేని అన్నారు. ప్రమాదాలు, గుండె పోటు వంటివి అత్యవసర పరిస్థితులకు కారణమవుతాయన్నారు. సంక్లిష్టపరిస్థితుల్లో రోగులను కాపాడేందుకు నైపుణ్యం, వ్యవహరించాల్సిన తీరు అవసరమన్నారు.

10/17/2019 - 04:58

*చిత్రం... అనారోగ్యంతో బాధపడుతూ కొంపల్లిలోని సురక్ష హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విశాలాంధ్ర మాజీ సంపాదకుడు సీ రాఘవాచారిని బుధవారం పరామర్శిస్తున్న ప్రణాళికా సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్

10/17/2019 - 01:36

హైదరాబాద్, అక్టోబర్ 16: లైఫ్ సైనె్సస్ రంగానికి హైదరాబాద్ నగరం హబ్‌గా మారబోతుందని పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న బయో ఏషియా-2020 తర్వాత లైఫ్ సైనె్సస్ రంగంలో ఈ స్థానం మరింత సుస్థిరం కానుందన్నారు. ఈ రంగంలో హైదరాబాద్‌ను మరింత సుస్థిరం చేసే దిశగా ప్ర భుత్వం కృషి చేస్తుందన్నారు.

10/16/2019 - 23:47

హైదరాబాద్, అక్టోబర్ 16: టీఆర్టీ పీఈటీ ఫలితాలను ప్రకటించి నియామకాలు అన్నీ పూర్తి చేయాలని కోరుతూ జాక్టో యూఎస్‌పీసీ నాయకత్వం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తమ డిమాండ్‌ను తక్షణమై ఆమోదించాలని కోరుతూ టీఆర్టీ పీఈటీ అభ్యర్ధులు బుధవారం నాడు ప్రగతి భవన్‌ను ముట్టడించారు. నేతలు అందర్నీ పోలీసులు అరెస్టు వారిని గోషామహల్‌కు తరలించారు.

10/16/2019 - 23:46

హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమం ఈ రాష్ట్రానికి మణిహారంగా మారిందని రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన అధికారి, పీసీసీఎఫ్ ఆర్. శోభ పేర్కొన్నారు.

10/16/2019 - 23:44

హైదరాబాద్, అక్టోబర్ 16: ఆర్టీసీకి చెందిన భూములను ప్రైవేట్ ఏజన్సీలకు లీజుకు ఇవ్వకుండా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కోరారు. బుధవారం ఇక్కడ లక్ష్మణ్ ఆధ్వర్యంలోని బీజేపీ నేతల బృందం గవర్నర్‌ను కలిసి ఆర్టీసీ కార్మికులతో రాష్ట్రప్రభుత్వం చర్చలు జరిపేందుకు చొరవ తీసుకోవాలని అభ్యర్థించారు.

10/16/2019 - 23:42

హైదరాబాద్, అక్టోబర్ 16: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో గురువారం పాల్గొనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో భారీ నిసనలు, ర్యాలీలు చేపట్టాలని విపక్షాలు పిలుపు ఇచ్చాయి. ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పూర్తి మద్దతును వామపక్షాలతో పాటు తెలంగాణ జన సమితి ప్రకటించాయి. సమ్మెను ఉధృతం చేయడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం భేషరతుగా ముందుకు రావాలన్నారు.

10/16/2019 - 23:38

హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక, అభివృద్ధికోసం సమగ్ర కార్యాచరణను రూపొందించేందుకు రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ-సెంటర్ ఫర్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ (సీఈజీఐఎస్) మధ్య బుధవారం త్రైపాక్షిక అవగాహనా ఒప్పందం కుదిరింది. తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శి కే. రామకృష్ణారావు, సీఈజీఐఎస్ ఫౌండర్, సైంటిఫిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ కార్తిక్ మురళీధరన్‌లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

10/16/2019 - 23:36

హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణ రాష్ట్రంలో 2020 సీజన్‌కు తునికాకు సేకరణ, అమ్మకాల బాధ్యతను తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు అప్పగించారు. ఈ మేరకు అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ పేరుతో బుధవారం జీఓ (ఆర్‌టీ నెంబర్ 150) జారీ అయింది.

Pages