S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/18/2019 - 05:24

హైదరాబాద్, అక్టోబర్ 17: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించడమే కాకుండా ఉద్యోగ సంఘాల జేఏసీ గురువారం మరో అడుగు ముందుకేసింది. ఆర్టీసీ సమ్మెను వెంటనే పరిష్కరించడంతో పాటు తమ అపరిష్కృత డిమాండ్లను కూడా తీర్చాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, గజిటెడ్ అధికారుల, కార్మిక, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ కమిటీ ప్రతినిధి బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషిని కలిసి వినతి పత్రం సమర్పించింది.

10/18/2019 - 05:32

హైదరాబాద్, అక్టోబర్ 17: ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఆయన తన ఛాంబర్‌లో ఎస్సీ, మైనారిటీ శాఖలు చేపట్టిన వివిధ పథకాలపై సమీక్షించారు. ప్రజల ఆశయాలు, అవసరాలకు అనుగుణంగా వివిధ సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం చేపట్టిందన్నారు.

10/18/2019 - 05:14

హైదరాబాద్, అక్టోబర్ 17: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారవాణా లేక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఉన్నందున ప్రభుత్వం ఒక మెట్టుదిగాల్సిందేనని వామపక్షాలు డిమాండ్ చేశాయి. గురువారం ఇందిరాపార్క్ వద్ద ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా వామపక్షాలు భారీ ధర్నా చేపట్టాయి. ధర్నాకు వామపక్షాల నేతలు, పార్టీ కేడర్ తరలిరావడంతో అనూహ్య స్పందన వచ్చింది.

10/18/2019 - 05:14

హైదరాబాద్, అక్టోబర్ 17: నెల నెలా జీతాలు చెల్లించేలా అధికారులను ఆదేశించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావుకు కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం విజ్ఞప్తి చేసింది. సంఘం అధ్యక్షుడు కనకచంద్రం నేతృత్వంలోని బృందం ఒక వినతిపత్రాన్ని మంత్రికి అందించింది. నెలనెలా వేతనాలు అందకపోవడంతో తాము, తమ కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.

10/18/2019 - 05:13

హైదరాబాద్, అక్టోబర్ 17: కేంద్ర ప్రభుత్వం రూసా పథకం కింద రాష్టప్రరిధిలోని ఏడు యూనివర్శిటీలకు, మహిళా డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు, ఎస్సీ,ఎస్టీ బాలికల హాస్టళ్లకు 242 కోట్ల రూపాయిలు కేటాయించింది. అందులో ఉస్మానియా యూనివర్శిటీకి 107 కోట్ల రూపాయిలను కేంద్రం కేటాయించింది. కేంద్రప్రభుత్వం యూనివర్శిటీల్లో వివిధ అంశాలకు 60 శాతం నిధులను కేటాయిస్తే మిగిలిన 40 శాతం నిధులను ఆయా రాష్ట్రాలు వెచ్చించాల్సి ఉంటుంది.

10/18/2019 - 05:12

హైదరాబాద్, అక్టోబర్ 17: రాష్ట్రంలోని న్యాయ విద్యా కళాశాలల్లో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సులకు నిర్వహించిన సర్ట్ఫికేట్ల పరిశీలన, ఆన్‌లైన్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం నాడు అధికారులు వెబ్ ఆప్షన్ల ట్రయిల్ నిర్వహించనున్నారు. శనివారం నాడు వెబ్ ఆప్షన్లను కేటాయించనున్నట్టు తెలిసింది.

10/18/2019 - 04:47

వరంగల్, అక్టోబర్ 17: సీఎం కేసీఆర్‌ది రైతు ప్రభుత్వం అని, ప్రతి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం వరి, పత్తి కొనుగోళ్లపై వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

10/18/2019 - 04:43

సిద్దిపేట, అక్టోబర్ 17 : వేద ధర్మాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో పద్మనాయక కల్యాణ మండపంలో తెలంగాణ వేద విద్వన్ మహాసభల ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు. సద్దిపేటలో తెలంగాణ వేద విద్వన్ మహాసభలు జరిపే అవకాశం ఇవ్వటం తమ అదృష్టమన్నారు.

10/18/2019 - 04:40

చిట్యాల, అక్టోబర్ 17: ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలతో తీవ్ర ఆందోళనకు గురైన నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యాడు.

10/18/2019 - 04:39

డిచ్‌పల్లి రూరల్, అక్టోబర్ 17: నిజామాబాద్ జిల్ల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలోని టీఎస్‌ఎస్‌పీ 7వ పోలీస్ బెటాలియన్ సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో నిజామాబాద్‌కు చెందిన వంగల రవీందర్(48), కానుగు గంగవ్వ(65) సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసుల తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

Pages