S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/19/2019 - 00:34

సూర్యాపేట, అక్టోబర్ 18: ఆర్టీసీ సమ్మెపై ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తన వైఖరిని మార్చుకొని స్పందించకుంటే సమ్మె ఉధృతమై సకల జనుల సమ్మెగా రూపాంతరం చెందుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా 14వ రోజు సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు జరుగుతున్న ఆందోళనలో పాల్గొని మద్దతు తెలిపారు.

10/18/2019 - 23:42

హైదరాబాద్ తాజ్‌కృష్ణలో శుక్రవారం సాయంత్రం జరిగిన మెదక్ ఎస్పీ చందన దీప్తి-బల్‌రామ్
పెళ్లి రిపెప్షన్‌కు హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్. అంతకుముందు ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఈ వివాహానికి వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు.

10/18/2019 - 23:36

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా బీహెచ్‌ఈఎల్ నుంచి కూకట్‌పల్లి వరకు శనివారం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు
కే. లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీ

10/18/2019 - 23:05

హైదరాబాద్, అక్టోబర్ 18: ఆర్టీసీ జేఏసీ సమ్మెకు మద్దతుగా చేపట్టిన నేటి రాష్ట్ర బంద్‌కు అన్ని వర్గాలు సై అంటూ సంఘీభావం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం, ప్రభుత్వయేతర రంగల్లో ఉన్న అన్ని ఉద్యోగ, కార్మిక వర్గాలకు చెందిన సిబ్బంది శనివారం జరగనున్న రాష్ట్ర బంద్‌లో పాల్గొనడానికి సిద్ధం అయ్యాయి. దీంతో బంద్ విజయవంతం చేయడానకి కార్యాలయాల భోజన విరామ సమయంలో బంద్‌లో పాల్గొననున్నారు.

10/18/2019 - 23:04

హైదరాబాద్, అక్టోబర్ 18: ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర గవర్నర్ స్పందించడం భేష్ అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి వి హనుమంతరావు ప్రశంసించారు. గత గవర్నర్ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరిగిన స్పందించలేదని విమర్శించారు. గవర్నర్ స్పందించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం మంచిది కాదన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వానికి రాజ్యాంగంపై గౌరవం లేదన్నారు.

10/18/2019 - 23:03

హైదరాబాద్, అక్టోబర్ 18: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ‘2019-ఆకాశవాణి సంగీత సమ్మేళనం’ నిర్వహిస్తున్నట్టు ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ ఎం శైలజా సుమన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 24 ఆకాశవాణి కేంద్రాలలో నిర్వహించనున్న సంగీత సమ్మేళనంలో 177 మంది సంగీత విద్వాంసులు పాల్గొంటారని తెలిపారు.

10/18/2019 - 23:03

హైదరాబాద్, అక్టోబర్ 18: రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా బియ్యం నిల్వలకు అవసరమైన గోదాములను కేటాయించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ విజ్ఞప్తి చేశారు. స్టోరేజీ సమస్యను ఎలా అధిగమించాలనే దానిపై ఎఫ్‌సీఐ అధికారులతో సమావేశం నిర్వహించారు.

10/18/2019 - 05:29

కరీంనగర్, అక్టోబర్ 17: ‘సకల జనుల సమ్మెతో సీఎం సీటెక్కినవ్ అధికారం లోకి వస్తే ఆర్టీసీని సర్కార్‌లో విలీనం చేస్తామన్న మాటే‘మాయే’ సమ్మెకు 30 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రుల మద్దతుంది, ఇచ్చిన మాట నిలుపుకో.. కేసీఆర్ సర్‌‘కారు’ కూలకుండా చూసుకో..’ అని టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం హెచ్చరించారు.

10/18/2019 - 05:26

హైదరాబాద్, అక్టోబర్ 17: గత 13 రోజులుగా ఆర్టీసీ సమ్మె జరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరాలు ఏమిటో చెప్పాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు గవర్నర్ తమిళసై ఫోన్ చేశారు. సమ్మెపై శనివారం ఒక నిర్ణయానికి వచ్చి, విధాయక నివేదికతో రావాలని హైకోర్టు ఆదేశించడంతో మల్లగుల్లాలు పడుతున్న సర్కారుకు గవర్నర్ ఫోన్ మరింత ఆందోళనకు గురిచేసింది.

10/18/2019 - 05:25

హైదరాబాద్, అక్టోబర్ 17: తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు వ్యపారవేత్తలు పెద్ద ఎత్తును పోటీపడ్డారు. మద్యం షాపులను దక్కించుకునేందుకు దరఖాస్తుదారుడు నాన్ రీఫండబుల్ ఫీజు రూపంలో రూ.2 లక్షలు చెల్లించి టెండర్లలో పాల్గొనాల్సి ఉంది. గతం కంటే ఈసారి లక్ష రూపాయలు పెరిగిన దరఖాస్తుదారులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు పోటీపడ్డారు.

Pages