S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/16/2016 - 05:04

ఖమ్మం, ఏప్రిల్ 15: కయ్యాలకు, గిల్లికజ్జాలకు పోకుండా పరస్పరం సహకరించుకుందామని ఆంధ్ర సర్కారుకు తెలంగాణ సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. పొరుగు రాష్ట్రంతో సఖ్యతతో మెలగుతూ సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. దుమ్ముగూడెం తర్వాత ఎలాగూ గోదావరి జలాలను తెలంగాణ వాడుకునే వీలు లేదని, 1000 టిఎంసిలు తెలంగాణ వాడుకున్నా, మిగిలిన 1500 టిఎంసిలు ఆంధ్రా ప్రజలకు ఉపయోగపడతాయని అన్నారు.

04/15/2016 - 18:07

హైదరాబాద్: తెలంగాణలో బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల కోసం 250 గురుకులాలను ప్రారంభిస్తామని, వీటి భవనాలకు 5వేల కోట్లు ఖర్చవుతుందని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి శుక్రవారం విలేఖరులతు తెలిపారు. ఒక్కో గురుకులంలో 600 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తామన్నారు.

04/15/2016 - 18:05

కరీంనగర్: వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం చూసేందుకు వచ్చిన ఓ భక్తురాలిపై ముగ్గురు మహిళా హోంగార్డులు దాడి చేసి కొట్టడం కలకలం రేపింది. అయితే, ఈ ఘటనపై పోలీసులు గానీ, ఆలయ అధికారులు గానీ నోరు మెదపడం లేదు.

04/15/2016 - 18:01

ఖమ్మం: సమస్యల పరిష్కారానికి ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరమని, గిల్లికజ్జాలతో సాధించేది ఏదీలేదని తెలంగాణ సిఎం కెసిఆర్ అన్నారు. ఆయన శుక్రవారం భద్రాచలంలో సీతారామకల్యాణం అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ, ఎపి సర్కారుతో తాము సమన్వయంతో ముందుకెళ్లామన్నారు. దుమ్ముగూడెం వద్ద గోదావరి నీటిని వాడుకునే హక్కు ఎపికి ఉందన్నారు.

04/15/2016 - 14:51

హైదరాబాద్: తెలంగాణలో వడగాలులు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నందున వేసవి తాపానికి గురికాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాగా, ఎండలు తీవ్రంగా ఉండడంతో పాఠశాలలకు ఈ నెల 16 నుంచి జూన్ 12 వరకూ తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవులను ముందుగానే ప్రకటించింది.

04/15/2016 - 14:51

హైదరాబాద్: సికింద్రాబాద్ వారాసిగూడలో శుక్రవారం ఓ ఇంట్లో విద్యుత్ షాక్‌కు గురై రెండేళ్ల బాలుడితో పాటు తల్లి దుర్మరణం పాలయ్యారు. వాషింగ్ మిషన్ నుంచి బట్టలు తీస్తుండగా వీరు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ప్రమాదం జరిగినపుడు ఇంట్లో మరెవరూ లేకపోవడంతో తల్లి, కుమారుడిని ఎవరూ రక్షించడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ సంఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది.

04/15/2016 - 14:50

ఖమ్మం: యాదగిరిగుట్ట తరహాలో భద్రాచలంలోని రామాలయాన్ని అభివృద్ధి చేసేందుకు వంద కోట్ల రూపాయలు కేటాయిస్తామని తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రకటించారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా శుక్రవారం ఆయన భద్రాద్రి ఆలయాన్ని సందర్శించారు. పండితులతో, ఆగమశాస్త్ర నిపుణులతో చర్చించి భద్రాచలం ఆలయాన్ని సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతామన్నారు.

04/15/2016 - 14:50

హైదరాబాద్: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. సీతరామ్‌బాగ్‌లో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్, హిందూ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ యాత్ర ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల మీదుగా శోభాయాత్ర కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకూ కొనసాగుతుంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ట్రాఫిక్‌ను మళ్లించారు.

04/15/2016 - 13:04

ఖమ్మం: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం ఆలయంలో శుక్రవారం మధ్యాహ్నం సీతారామచంద్రుల కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సర్కారు తరఫున ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కమనీయ దృశ్యాలను చూసేందుకు తెలంగాణ, ఎపిలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

04/15/2016 - 13:03

మెదక్: సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ పదవికి కె.రాజనర్సు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్నట్లు జిల్లా మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో తెరాసకు ఆధిక్యత లభించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ కౌన్సిలర్లతో శుక్రవారం ఉదయం హరీష్ సమాలోచనలు జరిపి రాజనర్సును చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేశారు.

Pages