S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/17/2016 - 06:14

బెల్లంపల్లి, ఏప్రిల్ 16: ఈనెల 13న మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో బెల్లంపల్లిలోని శాంతిఖని బొగ్గు గనిలో 52వ లెవెల్ 1వ జంక్షన్ వద్ద బొగ్గు గని పై కప్పు కూలిన సంఘటనలో కార్మికులు పొలసాని హన్మంతరావు, గాలిపెల్లి పోశం, రణవత్ కిష్టయ్యలు మృతిచెందారు. వీరి మృతదేహాలు 67 గంటల పాటు బండకింది శిథిలాల్లోనే ఉన్నాయి.

04/17/2016 - 06:14

సిద్దిపేట, ఏప్రిల్ 16 : మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్‌గా కడవేర్గు రాజనర్సు, వైస్ చైర్మన్‌గా ఖాజా అత్తర్‌పటేల్ ఎన్నికయ్యారు. రాజనర్సు మున్సిపల్ చైర్మన్‌గా రెండవ సారి ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా, జడ్పీ సిఇఓ వర్షిణి వ్యవహరించారు.

04/17/2016 - 06:13

హైదరాబాద్, ఏప్రిల్ 16:నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి మిగిలి ఉన్న కొద్దిపాటి పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఖరీఫ్‌లో సాగునీటిని ఇచ్చి తీరాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులవారీగా ఐదు గంటలపాటు సుదీర్ఘంగా సమీక్షించారు.

04/16/2016 - 18:07

హైదరాబాద్: నచ్చిన కారును కొనడమే కాదు, దానికి ఫ్యాన్స్ నెంబర్ తెచ్చుకునేందుకు సెలబ్రిటీలు ఎంత డబ్బయినా ఖర్చు చేస్తారని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మరోసారి నిరూపించాడు. ఇటీవల తాను మోజు పడి కొనుక్కున్న బీఎండబ్ల్యు కారుకు 10.5 లక్షల రూపాయలను చెల్లించి వేలంలో ‘టిఎస్ 09 ఇఎల్ 9999’ నెంబర్‌ను ఆయన దక్కించుకున్నాడు. ఈ నెంబర్ కోసం పలువురు పోటీ పడగా బహిరంగ వేలంలో తనదే పైచేయి అని ఆయన నిరూపించుకున్నాడు.

04/16/2016 - 18:06

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త కార్యవర్గాన్ని నియమిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తమకుమార్ రెడ్డి టి.పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతుండగా, కార్యవర్గంలో 31 మంది ప్రధాన కార్యదర్శులను, 13 మంది ఉపాధ్యక్షులను, 35 మంది ఇసి మెంబర్లను, 22 మంది శాశ్వత ఆహ్వానితులను, సమన్వయ కమిటీలో 31 మందిని నియమించారు.

04/16/2016 - 16:43

హైదరాబాద్: పగటి ఉష్ణోగ్రతలు అధికం కావడంతో వడదెబ్బకు లోనై ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో శనివారం 11 మంది మరణించారు. అనంతపురం, కరీంనగర్ జిల్లాల్లో ముగ్గురేసి, శ్రీకాకుళం, కర్నూలు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. మరో మూడు రోజుల పాటు వేడిసెగలు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

04/16/2016 - 16:41

హైదరాబాద్: విద్యాశాఖ అధికారులకు బదులు పోలీసులు తనిఖీలకు రావడం పట్ల తెలంగాణ విద్యాసంస్థల జెఎసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కొందరు వ్యక్తులు సిఎం కెసిఆర్‌ను, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని తప్పుదోవ పట్టిస్తున్నారని జెఎసి నేతలు అంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐబి, సిఐడి, ఎన్‌ఫోర్స్‌మెంట్, స్పెషల్ పోలీసులు ప్రైవేటు విద్యాసంస్థల్లో తనిఖీలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

04/16/2016 - 14:35

హైదరాబాద్: ఆధ్యాత్మిక పండితుడిగా, కవిగా, వ్యాఖ్యాతగా తెలుగువారికి చిరపరిచితమైన శేషం రామానుజాచార్యులు శనివారం ఉదయం నగరంలోని వనస్థలిపురంలో కన్నుమూశారు. తిరుమల బ్రహ్మోత్సవాలతో పాటు యాదగిరిగుట్ట వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు.

04/16/2016 - 14:34

వరంగల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి తాడ్వాయిలోని ఫారెస్టు గెస్ట్‌హౌస్‌లో విధ్వంసానికి పాల్పడ్డారు. జీపుతో పాటు ఓ నిర్మాణాన్ని వారు దగ్ధం చేశారు. హరితహారం పేరిట గిరిజనుల భూములను లాక్కుంటే తెలంగాణ సర్కారుకు తాము బుద్ధి చెబుతామని సంఘటన స్థలంలో వదిలిన లేఖలో మావోలు హెచ్చరించారు.

04/16/2016 - 12:42

హైదరాబాద్: అర్ధరాత్రి వేళ అతివేగంగా కారును నడుపుతున్నందుకు కేంద్రమంత్రి సుజనాచౌదరి కుమారుడు సాయికార్తీక్‌పై బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి తనిఖీల సందర్భంగా సాయికార్తీక్ కారును పోలీసులు ఆపి, మితిమీరిన వేగంగా వెళుతున్నందుకు కేసు పెట్టారు. కారును స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Pages