S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/15/2016 - 11:54

హైదరాబాద్: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఉభయ తెలుగురాష్ట్రాల్లో రామాలయాలు శుక్రవారం ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రఖ్యాతి చెందిన భద్రాచలం, ఒంటిమిట్ట, రామతీర్థం వంటి పుణ్యక్షేత్రాలతో పాటు ప్రతి పల్లెలో, కాలనీల్లో రామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సర్కారు భద్రాద్రిలో, ఎపి ప్రభుత్వం ఒంటిమిట్టలో అధికారికంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ భారీ ఏర్పాట్లు చేశాయి.

04/15/2016 - 11:54

ఖమ్మం: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం సీతారామస్వామి ఆలయంలో జరిగే కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు తెలంగాణ సిఎం కెసిఆర్ శుక్రవారం ఉదయం ఇక్కడికి చేరుకున్నారు. హెలిపాడ్ వద్ద ఆయనకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు స్వాగతం పలికి ఆలయం వద్దకు తోడ్కొని వెళ్లారు. స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కెసిఆర్ దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.

04/15/2016 - 07:06

హైదరాబాద్, ఏప్రిల్ 14: అస్పృశ్యత మూలాలను ప్రశ్నించి, అసమానతల పునాదులను పెకిలించి అపూర్వ సందేశాలను భరతజాతికి అందించిన మహానుభావుడు అంబేద్కర్ అని ఎబివిపి అఖిల భారత సహ సంఘటనా కార్యదర్శి గుంతా లక్ష్మణ్ పేర్కొన్నారు. అఖిల భాతర విద్యార్ధి పరిషత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 125వ జయంతి సం దర్భంగా 125 కాగడాలతో ట్యాంక్‌బండ్‌పై ప్రదర్శన చేసి నేతలు ఘనంగా నివాళులు అర్పించారు.

04/15/2016 - 07:05

ఆదిలాబాద్, ఏప్రిల్ 14: ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లోని మహారాష్ట్ర పరిధిలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో అలజడి సృష్టించిన సంఘటనలో మాజీ ఎమ్మెల్యే గన్‌మెన్ నాకేసే నానాజీ (38) మృతి చెందాడు.

04/15/2016 - 07:05

హైదరాబాద్, ఏప్రిల్ 14:విపక్షాలు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో ప్రాజెక్టుల గురించి వివరించిన నీటిపారుదల రంగం నిపుణులు రిటైర్డ్ ఇఎన్‌సి టి హనుమంతరావును నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శుక్రవారం కలుస్తారు. నీటిపారుదల ప్రాజెక్టులపై హనుమంతరావు అభిప్రాయాలను తెలుసుకుంటారు.

04/15/2016 - 07:04

హైదరాబాద్, ఏప్రిల్ 14: అగ్నిమాపక వారోత్సవాలను గురువారం ఎఫ్‌ఎసి డైరెక్టర్ లక్ష్మిప్రసాద్ ప్రారంభించారు. గురువారం వట్టినాగులపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్‌లో అగ్నిమాపక శాఖ ఏర్పాటు చేసిన పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 20 దాకా ఈ ఉత్సవాలు జరుగుతాయి.

04/15/2016 - 07:04

హైదరాబాద్, ఏప్రిల్ 14:‘మిషన్ భగీరథ’ పనులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ ఈనెల 19న రాష్ట్రంలో పర్యటిస్తారు. ఖమ్మం జిల్లా పాలేరు సెగ్మెంట్‌తోపాటు, మెదక్ జిల్లాలో పనులను ఆయన పరిశీలిస్తారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటిని అం దించే పథకంపై కేంద్రం ఆసక్తి చూపిస్తోంది.

04/15/2016 - 07:03

బెల్లంపల్లి, ఏప్రిల్ 14: సింగరేణి సంస్థలో అతి పురాతన బొగ్గు గని బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని బొగ్గు గని కార్మికులకు, సింగరేణి సంస్థకు శాంతిని పంచే ఈ గనికి 61 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది.

04/15/2016 - 07:03

హైదరాబాద్, ఏప్రిల్ 14: కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని టిఆర్‌ఎస్ పార్టీ ప్రలోభాలకు గురి చేసి పార్టీలోకి చేర్చుకోవడం అనైతికమని సిఎల్‌పి నేత జానారెడ్డి విమర్శించారు. ఈ తరహా చర్యలకు పాల్పడినందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించదని స్పష్టం చేశారు.

04/15/2016 - 07:01

హైదరాబాద్, ఏప్రిల్ 14: బ్యాంకులు, ఏటిఎంల వద్ద సెక్యూరిటీ వ్యవస్ధ సక్రమంగా లేకపోవడంతో ఆయా కేంద్రాలవద్ద తరచూ చోరీలు జరుగుతున్నాయి. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ ఆంధ్రాబ్యాంక్‌లో జరిగిన చోరీ ఘటన మరువకముందే నగరంలో పది రోజుల వ్యవధిలోనే మూ డు చోట్ల ఏటిఎంలలో చోరీకి విఫలయత్నం జరిగింది.

Pages