S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/15/2016 - 06:57

హైదరాబాద్, ఏప్రిల్ 14:పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదం పొందినప్పుడే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌కు నిజమైన నివాళి అర్పించినట్టు అని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. 125వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద నున్న అంబేద్కర్ విగ్రహానికి గురువారం ఆమె పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఫోటో ప్రదర్శన తిలకించారు.

04/15/2016 - 06:55

హైదరాబాద్, ఏప్రిల్ 14: టిఆర్‌ఎస్ ప్రభుత్వం దళితులకు మోసం చేసిందని, తమ పార్టీ అధికారంలోకి వస్తే దళిత నేతను ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి తుంగలో తొక్కారని టిపిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో గురువారం అంబేద్కర్ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

04/15/2016 - 06:55

హైదరాబాద్, ఏప్రిల్ 14: నవ భారత రాజ్యాంగ నిర్మాత, స్ఫూర్తిప్రదాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు. గురువారం నగరంలోని ట్యాంక్‌బండ్ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అన్ని పార్టీల ప్రముఖలు, నేతలు ఘనంగా నివాళులర్పించారు.

04/15/2016 - 06:51

హైదరాబాద్, ఏప్రిల్ 14: అంతర్జాతీయ యోగా ఛాంపియన్ షిప్ సాధించిన దళిత విద్యార్థి సుందర్‌రాజ్‌కు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు రూ. 5 లక్షల చెక్‌ను అందజేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఐమాక్స్ థియేటర్ వద్ద గురువారం జరిగిన బహిరంగ సభావేదికపై సుందర్‌రాజ్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. తెలంగాణ కీర్తిని విశ్వవ్యాప్తం చేసాడని ఆయన కొనియాడారు.

04/15/2016 - 06:49

హైదరాబాద్, ఏప్రిల్ 14: అగ్నిమాపక వారోత్సవాలను గురువారం ఎఫ్‌ఎసి డైరెక్టర్ లక్ష్మిప్రసాద్ ప్రారంభించారు. గురువారం వట్టినాగులపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్‌లో అగ్నిమాపక శాఖ ఏర్పాటు చేసిన పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 20 దాకా ఈ ఉత్సవాలు జరుగుతాయి.

04/15/2016 - 06:49

హైదరాబాద్, ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలో దళితులను తీసుకోకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ దళితులను అవమానపరుస్తున్నారని టిటిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. జూన్ 2లోగా మంత్రి వర్గాన్ని విస్తరించి దళితులను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

04/15/2016 - 06:48

సూర్యాపేట, ఏప్రిల్ 14: తెలంగాణలోని ప్రతిపల్లెకు ఆర్టీసీ బస్సు నడిపించే విధంగా రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుండి ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్తూ మార్గమధ్యంలోని నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఆయన కొంతసేపు ఆగారు. ఈ సందర్భంగా స్థానిక రహదారి బంగ్లాలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

04/15/2016 - 06:48

వేములవాడ, ఏప్రిల్ 14: హిందూ సమాజంలో శ్రీ సీతారాముల పెళ్లికి అత్యంత విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. కమనీయమైన, రమణీయమైన సీతారాముల కళ్యానోత్సవాన్ని వాల్మీకి తన శ్రీమద్రామాయణంలో మహాద్భుతంగా, అపురూపంగా మనోహరంగా వర్ణించారు.దుర్ముఖి నామ సంవత్సరంలో శ్రీ రాముడు చైత్ర శుద్ద నవమినాడు పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో జన్మించారు. నవమే శ్రీ రామనవమి.

04/15/2016 - 06:47

హైదరాబాద్, ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత కారణంగా పాఠశాలలకు విద్యా వార్షిక ప్రణాళికను మరోమారు సవరించింది. ఈ నెల 16వ తేదీ నుండి పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తిరిగి విద్యాసంవత్సరం జూన్ 13న ప్రారంభం అవుతుందని విద్యాశాఖాధికారులు తెలిపారు. ముందుగా అనుకున్న షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 24 వరకూ స్కూళ్లు పనిచేయాలి, కాని వారం రోజులు ముందుగానే స్కూళ్లకు సెలవులు ఇచ్చారు.

04/15/2016 - 06:46

నల్లగొండ, ఏప్రిల్ 14: కాంగ్రెస్ పార్టీని వీడి తాను టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, పదవుల కోసం పార్టీ మారే తత్వం తనది కాదని సిఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన నల్లగొండ బైపాస్‌లోని డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు.

Pages