S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/16/2016 - 12:44

హైదరాబాద్: ఆవేశంలో భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య పోలీసులకు లొంగిపోయిన ఘటన నగరంలోని నల్లకుంట ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగింది. గంగాధర్, విజయలక్ష్మి దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలున్నాయి. భర్త ప్రవర్తనతో విసిగిపోయినందునే కత్తితో ఆమె దాడి చేసిందని స్థానికులు చెబుతున్నారు.

04/16/2016 - 12:40

మహబూబ్‌నగర్: నగదును దోచుకునేందుకు దొంగలు ఎస్‌బిహెచ్ ఎటిఎంను ధ్వంసం చేసిన సంఘటన పెబ్బేరులో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ఎటిఎం యంత్రం తెరుచుకోనందున దొంగలు విధ్వంసం సృష్టించి పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదుపై పోలీసులు ఎటిఎం కేంద్రాన్ని పరిశీలించి, దొంగల కోసం గాలిస్తున్నారు.

04/16/2016 - 12:37

ఖమ్మం: భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం పట్ట్భాషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏటా శ్రీరామనవమి మరుసటి రోజున స్వామివారికి పట్ట్భాషేకం జరుగుతుంది. తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.

04/16/2016 - 08:30

హైదరాబాద్, ఏప్రిల్ 15: బిక్షగాళ్లను కూడా దోచుకున్న చరిత్ర మీది అంటూ కాంగ్రెస్ నాయకురాలు డికె అరుణపై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.

04/16/2016 - 08:29

హైదరాబాద్, ఏప్రిల్ 15: దళిత విద్యార్ధులపై వివక్షతో యూనివర్శిటీలు భగ్గుమంటున్న సమయంలో హైదరాబాద్ ఇంగ్లీషు అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ (ఇఎఫ్‌ఎల్ వర్శిటీ)లో ఒక దళిత విద్యార్ధిని బహిష్కరించడం వివాదాస్పదంగా మారింది. వర్శిటీ పాలకుల నిర్ణయంపై విద్యార్ధి సంఘాలు భగ్గుమంటున్నాయి.

04/16/2016 - 08:21

సిద్దిపేట, ఏప్రిల్ 15 : మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సుగా టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ ప్రకటించగా మంత్రి హరీష్‌రావు సమక్షంలో ఆ పార్టీ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మంత్రి హరీష్‌రావు నూతనంగా ఎన్నికైన టిఆర్‌ఎస్ కౌన్సిలర్లతో శుక్రవారం ఇక్కడి బాలాజీ హోటల్‌లో సమావేశం నిర్వహించారు.

04/16/2016 - 08:19

మహాదేవపూర్, ఏప్రిల్ 15: గోదావరి నదీ, ప్రాణహిత, అంతర్వాహిని మూడు నదుల (త్రివేణి ) సంగమ స్థానమైన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి (త్రినేత్ర)కు నిలయమైన కాళేశ్వరంనకు సమీపంలోని కనె్నపల్లి మెట్టుపల్లి వద్ద తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ (త్రిరాష్ట్ర)లకు వారధిగా నిర్మిస్తున్న వంతెన పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. మూడేళ్ళలో పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ముందే పనులు పూర్తి చేసిన నిర్మాణ సంస్థ.

04/16/2016 - 08:18

వేములవాడ, ఏప్రిల్ 15: కరీంనగర్ జిల్లాలోని హరిహరక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్‌లగ్న సుముహూర్తాన ఉదయం 11.45 గంటలకు కళ్యాణతంతును ఆలయ అర్చకులు ప్రారంభించారు.

04/16/2016 - 07:32

హైదరాబాద్, ఏప్రిల్ 15: ‘్భరత్ మాతాకీ జై అనకపోతే మజ్లిస్ సంగతిని ధూల్‌పేట వాసులే చూసుకుంటారు..’ అని బిజెపి ఎంపి సాక్షిమహారాజ్ హెచ్చరించారు. ధూల్‌పేటలో గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ ఏర్పాటు చేయించిన భారీ శ్రీవీరాంజనేయ స్వామి విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు సాక్షిమహారాజ్ వచ్చారు.

04/16/2016 - 05:43

హైదరాబాద్, ఏప్రిల్ 15: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, త్రీడి తెర ఉన్న టీవి, సెల్‌ఫోన్‌లను తయారు చేసే కంపెనీని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ కెడిఎక్స్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. కళ్లద్దాలు లేకుండా త్రీడి చిత్రాన్ని చూడగలిగే తెరలను తయారు చేసే ఏకైక సంస్థ ప్రపంచంలో కెడిఎక్స్ మాత్రమే.

Pages