S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/14/2016 - 18:04

హైదరాబాద్: ప్రస్తుత వేసవిలో గుక్కెడు నీటికోసం తెలంగాణ ప్రజలు విలవిల్లాడుతుండగా, ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం మద్యం కంపెనీల (డిస్టిలరీస్)కు భారీగా నీటిని విక్రయిస్తున్నారని టి.అసెంబ్లీలో టిడిపి నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, కెసిఆర్ చేస్తున్న నీటి వ్యాపారంపై తాను న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు.

04/14/2016 - 18:00

హైదరాబాద్: జూన్ 2లోగా తెలంగాణ మంత్రివర్గంలో దళితులకు తగిన ప్రాతినిధ్యం కల్పించకుంటే తాను ఆందోళనను తీవ్రతరం చేస్తానని టి.టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. దళితులపై తెలంగాణ సిఎం కెసిఆర్ వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ ఆయన ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారం ఒకరోజు దీక్ష చేపట్టారు.

04/14/2016 - 18:00

హైదరాబాద్: తాను తెరాసలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా పార్టీ వీడేదిలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ స్పష్టం చేశారు. తన సోదరుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ తెరాసలో చేరడంపై ఆమె గురువారం స్పందించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రామ్మోహన్ తెరాసలో చేరితే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు.

04/14/2016 - 16:26

మహబూబ్‌నగర్ : అంబేద్కర్ జయంతి సభ సందర్భంగా షాద్‌నగర్‌లో గురువారం కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అంబేద్కర్ విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసిన తర్వాత సిపిఎం నాయకుడు రాజు మాట్లాడుతూ, దళితులపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రతిస్పందిస్తూ రాజు ప్రసంగాన్ని అడ్డుకున్నారు.

04/14/2016 - 16:26

మెదక్: వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకుని బ్యాంకులను వంచించిన విజయ్ మాల్యాలాంటి వాళ్లకే పాలకులు అండగా నిలుస్తున్నారని, కరవుతో అలమటిస్తున్న రైతుల సంక్షేమం గురించి మాత్రం పట్టించుకోరని సిపిఐ నేత నారాయణ విమర్శించారు. రామాయంపేట, చేగుంట మండలాల్లో దుర్భిక్షం కారణంగా ఎండిపోయిన పంట పొలాలను ఆయన గురువారం పరిశీలించి, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు.

04/14/2016 - 16:25

ఖమ్మం: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భద్రాచలంలో గురువారం జరిగే సీతారాముల కల్యాణానికి భారీ ఎత్తున సన్నాహాలు చేశామని జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని ఆలయ అధికారులను ఆయన ఆదేశించారు.

04/14/2016 - 14:33

వరంగల్: తమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలో కోగిల్వాయి గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన గణేష్, రమ రెండేళ్లుగా ప్రేమించుకుంటూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే, రమకు ఆమె తల్లిదండ్రులు బుధవారం మరో యువకుడితో సంబంధం ఖాయం చేశారు.

04/14/2016 - 14:33

హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆనాడు చేసిన చట్టం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సిఎం కెసిఆర్ అన్నారు. ట్యాంక్‌బండ్ వద్ద 15 అంతస్థులతో నిర్మించే అంబేద్కర్ టవర్స్ నిర్మాణానికి గురువారం భూమిపూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బలహీన రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉండాలన్న చట్టాన్ని అంబేద్కర్ తెచ్చారన్నారు.

04/14/2016 - 14:32

మెదక్: సంగారెడ్డి శివార్లలో గురువారం ఉదయం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా రాజుగౌడ్ అనే ఓ ఘరానా దొంగ చిక్కాడు. అతని వద్ద నుంచి 56 తులాల బంగారు నగలు, రెండు కిలోల వెండి ఆభరణాలు, 5.8 లక్షల నగదు, లాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాజుగౌడ్ పలు ఇళ్లలో చోరీలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

04/14/2016 - 14:32

నల్గొండ: తాను తెరాసలో చేరతానని కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. తనకు పార్టీమారే ఆలోచనే లేదని ఆయన గురువారం మీడియాతో చెప్పారు. ప్రజలే తన అధిష్ఠానమని, వారి అభిప్రాయాలకు విరుద్ధంగా వ్యవహరించనన్నారు.

Pages