S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/20/2020 - 23:30

హైదరాబాద్, ఫిబ్రవరి 20:మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఈ నెల 23వ తేదీ నుండి మూడు రోజుల పాటు ఎంసీపీఐయూ రాష్ట్ర ప్లీనరీ నిర్వహించనున్నట్టు కార్యదర్శి తాండ్ర కుమార్ తెలిపారు. గురువారం నాడు ఆయన ప్లీనరీ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

02/20/2020 - 23:29

హైదరాబాద్, ఫిబ్రవరి 20: శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, మహాశివరాత్రి పండుగను కోట్లాది మంది ప్రజలు శ్రద్దతో జరుపుకుంటారని, ఉపవాసం ఉంటూ పూజలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరిలో మంచి ఆలోచనలు రావాలని, ప్రేమ, ఆప్యాయత, మైత్రి, సోదరభావం పెంపొందాలన్నారు.

02/20/2020 - 04:51

హైదరాబాద్, ఫిబ్రవరి 19: రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. వైస్ చాన్సలర్ల నియామక ప్రక్రియ పూర్వరంగంలో ముందుగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ల నియామకాలు సత్వరంగా పూర్తి చేయాలని కూడా సీఎం ఆదేశించారు.

02/20/2020 - 04:49

హైదరాబాద్, ఫిబ్రవరి 19: బయో ఆసియా మూడురోజుల సదస్సుతో హైదరాబాద్ మురిసిపోయింది. సోమవారం ప్రారంభమైన బయో ఆసియా 2020 సదస్సు బుధవారం ముగిసింది. ఫార్మారంగానికి మరీ ముఖ్యంగా జీవశాస్త్ర రంగం అభివృద్ధి చెందేందుకు ఈ సదస్సు ఊతమిస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. మూడు రోజు సదస్సులో భాగంగా రెండువేల భాగస్వామ్య సమావేశాలు నిర్వహించారు.

02/20/2020 - 04:45

వరంగల్, ఫిబ్రవరి 19: గత మేడారం జాతర హుండీ ఆదాయం బ్రేక్ అయ్యంది. గత ఏడాది మేడారం జాతర ద్వారా హుండీల ఆదాయం దాదాపు పది కోట్ల పైచిలుకు రాగా ఇప్పటికే 11 కోట్ల చేరువకు చేరింది. బుధవారం 56 హుండీలను లెక్కించగా 59 లక్షల 22 వేలు వచ్చింది. మొత్తం 494 హుండీలకు గాను 492 హుండీలను లెక్కించారు. ఇంకా రెండు హుండీలతో పాటు భారీ ఎత్తున బంగారు అభరణాలు, విదేశీ కరెన్సీ లెక్కించాల్సి ఉంది.

,
02/20/2020 - 04:31

మహబూబాబాద్, ఫిబ్రవరి 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రతి ఒక్కరికీ అందిస్తోందని రాష్ట్ర గిరిజన, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మానుకోట జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన పంచాయతీ సమ్మేళనంలో మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

,
02/20/2020 - 04:26

నిర్మల్, ఫిబ్రవరి 19: పల్లె ప్రగతి కార్యక్రమ నిర్వహణకు అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధం కావాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్‌లోని సాగర్ కనె్వన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పంచాయతీ సమ్మేళనంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు.

02/20/2020 - 04:23

సూర్యాపేట, ఫిబ్రవరి 19: పెన్షన్ భిక్ష కాదని ప్రతి ఉద్యోగి హక్కని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని గాంధీపార్కులో నిర్వహించిన ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘం ప్రథమ మహాసభల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ అందకుండా కుట్ర చేయడం సరికాదన్నారు.

02/20/2020 - 04:22

తుంగతుర్తి, ఫిబ్రవరి 19: వర్షాకాలంలో విపరీతంగా వర్షాలు కురిసినప్పటికీ అనేక ప్రాంతాలలోని చెరువులు,కుంటలు నిండిపోవడంతో పాటు అందులోని కొన్ని మాత్రమే నామమాత్రంగా వారం, పది రోజుల పాటు నీటితో పొంగిపొర్లడం వంటివి సహజంగా చూస్తుంటాం. అయితే ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఏమీ ఉండదు.

02/20/2020 - 04:00

హైదరాబాద్, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు స్వాగతించారు. ఇది ఒక మంచి ఆలోచన అని ఆయన అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, హైదరాబాద్‌లో అంబర్‌పేటలో మహాత్మా జ్యోతిరావుఫూలే మహాశయుడి విగ్రహం పెట్టేందుకు అనువైన స్థలం ఉందన్నారు.

Pages