S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/25/2020 - 00:51

హైదరాబాద్, ఫిబ్రవరి 24: సైబర్ దాడులను ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి చెప్పారు. సీడీటీఐ క్యాంపస్‌లో నేషనల్ సైబర్ రీసెర్చి ఇన్నోవేషన్ కెపాసిటీ బిల్డింగ్ సెంటర్‌ను సోమవారం నాడు ఆయన ప్రారంభించారు.

02/25/2020 - 00:48

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనను పురస్కరించుకొని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం నాడు రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చే విందులో పాల్గొనడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఢిల్లీ వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మంగళవారం ఢిల్లీ చేరుకుంటారు.

02/24/2020 - 04:42

మహదేవ్‌పూర్, ఫిబ్రవరి 23: జయశంకర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సరస్వతీ బ్యారేజీ (అన్నారం) నిండుకుండను తలపిస్తోంది. 119 మీటర్ లెవల్‌లో ఉండగా 10.87 పూర్తి సామర్ధ్యానికి ప్రస్తుతం 10.17 టీఎంసీల నీటి నిల్వ ఉంది. బ్యారేజీలోకి ఇన్‌ఫ్లో 22వేల క్యూసెక్కుల నీరు రాగా ఔట్ ఫ్లో 18వేల క్యూసెక్కులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

02/24/2020 - 04:40

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 23 : ప్రజాప్రతినిధులు బాధ్యతతో పనిచేసినప్పుడే సమాజంలో అసమానతలు తొలగి సమాజంలో మార్పులు వచ్చి పురోభివృద్ధి సాధ్యవౌతుందని రాష్ట్ర వ్యవసాయాశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారంనాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెంలో జరిగిన పల్లె, పట్టణ ప్రగతి ప్రజాప్రతినిధుల సమ్మేళనం నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది.

02/24/2020 - 04:38

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 23: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి కొనసాగిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎంపీటీసీలను కూడా భాగస్వాములను చేయాలని, ప్రజలతో ఎన్నుకున్న ఎంపీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని పలువురు ఎంపీటీసీలు ఆందోళన వ్యక్తం చేస్తూ పంచాయతీరాజ్ సమ్మేళనం వేదిక ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

,
02/24/2020 - 04:30

సికిందరాబాద్, ఫిబ్రవరి 23: భిన్నత్వంలో ఏకత్వం అదే భారతదేశం యొక్క విశిష్టత అని భారతదేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. సికిందరాబాద్ రైల్వే స్పోర్ట్స్ మైదానంలో ఆదివారం జరిగిన అఖిల భారత పోలీస్ మ్యూజిక్ బ్యాండ్-2020 ముగింపు వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పోటీలలో గెలుపొందినవారికి బహుమతుల ప్రదానం చేశారు.

02/24/2020 - 04:21

హైదరాబాద్, ఫిబ్రవరి 23: తెలంగాణలో టీడీపీ బీసీల విభాగానాకి ప్రధాన్యత ఇవ్వాలని ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో పార్లమెంట్ నియోజక వర్గాల వారిగా 3 నుంచి 5 పేర్లను సూచించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఎపీ మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్ర పార్టీని ఆదేశించారు. దీంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ నేతలకు సూచించారు.

02/24/2020 - 04:19

హైదరాబాద్ (ఖైరతాబాద్), ఫిబ్రవరి 23: ఎన్నికలు సమీపిస్తున్న వేళ మారో మారు ప్రజలను మోసగించేందుకు యత్నిస్తున్న అధికార టీఆర్‌ఎస్ కుట్రలను ఎండగట్టేందుకు పట్టణం గోస కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై రేవంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

02/24/2020 - 04:16

హైదరాబాద్, ఫిబ్రవరి 23: మహోన్నత ఆశయంతో ఏర్పాటైన రైతు సమన్వయ సమితులు వివిధ కారణాల వల్ల నీరసించిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రైతు సమన్వయ సమితులు (ఆర్‌ఎస్‌ఎస్) ఏర్పాటు చేశారు. రాష్టస్థ్రాయిలో హల్‌చల్ జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో చడీచప్పుడు లేదు. ఆర్‌ఎస్‌ఎస్‌లకు నిధులు లేకపోవడం తదితర కారణాల వల్ల ఇవి నీరసించిపోతున్నాయి.

02/24/2020 - 04:15

హైదరాబాద్, ఫిబ్రవరి 23; హైదారబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో భవన నిర్మాణ సెస్స్‌ను వసూళ్లు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలంగాణ బిల్డింగ్ అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఆదివారం నాడు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు, కోటంరాజు మీడియాతో మాట్లాడారు.

Pages