S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/18/2020 - 07:42

హైదరాబాద్, పిబ్రవరి 17: రాష్ట్రంలో కంది రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. కంది పండించిన రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ కంది రైతులకు బాసటగా ఉన్నారన్నారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా కంది రైతులకు మద్దత్తు ధర కల్పించడానికి నిర్ణం తీసుకున్నారని ఆయన చెప్పారు.

02/18/2020 - 07:41

హైదరాబాద్, ఫిబ్రవరి 17: రాష్ట్రంలో రైతుల నుంచి 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆ ర్ 66 జన్మదిన సందర్భంగా 2020 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

02/18/2020 - 07:39

హైదరాబాద్, ఫిబ్రవరి 17: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాల్ పోస్టులకు దరఖాస్తు గడువును ఈ నెల 26 వరకూ పొడిగించినట్టు కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఇతర వివరాలకు పోర్టల్‌ను సందర్శించాలని సూచించారు.

02/18/2020 - 07:39

హైదరాబాద్, ఫిబ్రవరి 17: పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించే వరకూ ఉద్యమాలు నిర్వహిస్తామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సోమవారం నాడు హెచ్చరించింది. ఈ మేరకు సంఘం ప్రధాన కార్యదర్శి టీ వెంకట్రాములు ఒక ప్రకటన విడుదల చేస్తూ అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర పాలకులు వ్యవసాయ కూలీలు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

02/18/2020 - 07:37

హైదరాబాద్, ఫిబ్రవరి 17: దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ నిర్వహించిన 33వ స్నాతకోత్సవంలో 2,31,573 మందికి డిగ్రీలు అందజేయగా, తెలంగాణ రీజనల్ కేంద్రంలో 1437 మందికి డిగ్రీలు అందజేశారు. తెలంగాణ రీజనల్ సెంటర్ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ భవనం వెంకట్రామ్ ఆడిటోరియంలో నిర్వహించారు.

02/18/2020 - 07:37

హైదరాబాద్, ఫిబ్రవరి 17: కార్పొరేషన్ ఎన్నికలు దగ్గరపడ్తున్న కొద్దీ అధికార పార్టీకి అభివృద్ధి గుర్తుకు వస్తోందని బీజేపీ సోమవారం నాడు ఎద్దేవా చేసింది. తెలంగాణ కేబినెట్ సమావేశంలో గ్రేటర్ ఎన్నికల కోసం టీఆర్‌ఎస్ సన్నాహక సమావేశంలా జరిగిందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కే కృష్ణసాగరరావు విమర్శించారు. ఆరేళ్లుగా గుర్తుకురాని హైదరాబాద్ నగర అభివృద్ధి అకస్మాత్తుగా తెరమీదకు వచ్చిందని ఆయన అన్నారు.

02/18/2020 - 07:36

హైదరాబాద్, ఫిబ్రవరి 17: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం నార్సింగి 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో సంస్థ సీఎండీ రఘుమారెడ్డి మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ 66వ జన్మదిన కార్యక్రమంలో పాల్గొనడం తనకు అదృష్టంగా భావిస్తున్నానని సీఎండీ రఘుమారెడ్డి అన్నారు.

02/18/2020 - 07:36

హైదరాబాద్, ఫిబ్రవరి 17: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 67వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్టప్రతి, ఉప రాష్టప్రతి, ప్రధాన మంత్రి మొదలుకొని లోక్‌సభ స్పీకర్, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఫోన్ల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ 66వ సంవత్సరాలు పూర్తి చేసుకొని సోమవారం 67వ ఏటాలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.

02/18/2020 - 07:26

సూర్యాపేట, ఫిబ్రవరి 17: దశాబ్దాలు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ శ్రీరామరక్షలా ఉండి అభివృద్ధి చేయడంతో పాటు అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి అహర్నిశలూ కృషిచేస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ 66వ జన్మదినోత్సవ వేడుకలను సోమవారం జిల్లాకేంద్రంలో ఘనంగా నిర్వహించారు.

02/18/2020 - 07:24

వేములవాడ, ఫిబ్రవరి 17: శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఉదయం కోడెల కుమ్ములాటలో నలుగురు భక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. స్వామివారిని దర్శించుకోడానికి ఆలయంలోకి వచ్చిన భక్తులకు వెనుక నుంచి ఒక్కసారిగా కోడెలు కుమ్ముకుంటూ వారి పైకి దూసుకువచ్చాయి. ఈ ఘటనలో మహబుబాబాద్ జిల్లాకు చెందిన అరూరి ముత్తయ్య, వి.మాధవపురం, రవిలకు తీవ్రగాయాలు అయ్యాయి వెంటే వారిని స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Pages